ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు సంబంధించిన కార్యక్రమాల ను ఈ నెల 12న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
సాబర్‌మతీ ఆశ్రమం నుంచి పాదయాత్ర కు ప్రధాన మంత్రి పచ్చజెండా ను చూపనున్నారు
India@75 లో భాగం గా జరప తలపెట్టిన వివిధ కార్యక్రమాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు; సాబర్‌మతీ ఆశ్రమం లో సభికుల ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
Posted On:
11 MAR 2021 3:25PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు అంటే, ఈ నెల 12న అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి ‘పాదయాత్ర’ (స్వేచ్ఛా యాత్ర) కు పచ్చజెండా ను చూపనున్నారు. అలాగే ఆయన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) తాలూకు ఆది కార్యకలాపాల ను కూడా ప్రారంభిస్తారు. India@75 ఉత్సవాల కై ఉద్దేశించినటువంటి ఇతర వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ను, డిజిటల్ కార్యక్రమాల ను సైతం ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. సాబర్‌మతీ ఆశ్రమం లో ఉన్న జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఉదయం 10:30 గంటల కు మొదలయ్యే ఈ కార్యక్రమం లో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ లతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ కూడా పాల్గొననున్నారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనేది భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరాలు కావడాన్ని స్మరించుకొనేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల శ్రేణి కి పెట్టిన పేరు. ఈ మహోత్సవాన్ని ప్రజల భాగస్వామ్య భావన తో ఒక జన ఉత్సవం రూపం లో నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవం లో భాగం గా అనుసరించవలసిన విధానాల ను, జరపవలసిన వివిధ కార్యక్రమాల ను రూపొందించడానికి ఒక జాతీయ అమలు సంఘాన్ని దేశీయ వ్యవహారాల మంత్రి నాయకత్వం లో నియమించడం జరిగింది. దీనిలోని ఆది కార్యక్రమాల ను 2022వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ కన్నా 75 వారాలు ముందుగానే ఈ నెల 12 నుంచే ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
పాదయాత్ర
పాదయాత్ర కు ప్రారంభ సూచకం గా ఒక పచ్చజెండా ను ప్రధాన మంత్రి చూపనున్నారు. 81 మంది యాత్ర లో పాల్గొనే వారు అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం నుంచి నవ్ సారీ లోని దాండీ వరకు 241 మైళ్ళ దూరం ప్రయాణించనున్నారు. ఈ యాత్ర 25 రోజుల పాటు సాగి ఏప్రిల్ 5న ముగుస్తుంది. ఈ పాదయాత్ర దాండీ కి వెళ్ళే మార్గం లో వివిధ సమూహాల వారు దీనిలో చేరుతారు. పాదయాత్ర లో 75 కిలో మీటర్ల ఒకటో దశ కు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింహ్ పటేల్ నాయకత్వం వహిస్తారు.
India@75 లో భాగం గా చేపట్టే వివిధ కార్యక్రమాలు
ఈ కార్యక్రమం లో భాగం గా India@75 ఇతివృత్తం తో నిర్ధరించిన కార్యక్రమాల ను మొదలుపెట్టడం జరుగుతుంది. వీటిలో చిత్రం, వెబ్ సైట్, గానం, ఆత్మనిర్భర్ చరఖా తో పాటు ఆత్మనిర్భర్ ఇన్ క్యుబేటర్ లు ఉంటాయి.
పైన ప్రస్తావించిన కార్యక్రమాల తో పాటు దేశ అజేయ భావన ను కీర్తించే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సంగీతం, నృత్యం, ప్రవచనం, పీఠిక ను చదవడం ( దీనిలో ప్రతి ఒక్క పంక్తి దేశం లో వేరు వేరు ప్రాంతాల కు ప్రాతినిధ్యం వహించే విభిన్న భాష లలో ఉంటుంది) వంటివి భాగం గా ఉంటాయి. యువత శక్తి ని భారతదేశం తాలూకు భవిత గా అభివర్ణిస్తూ గాయక బృందంలో 75 గళాల తో పాటు 75 మంది నృత్య కళాకారులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.
ఈ నెల 12న రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కూడా భారతదేశం అంతటా కార్యక్రమాల ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల కు అదనం గా భారతీయ పురాతత్వ సర్వేక్షణ్ (ఎఎస్ఐ), సంస్కృతి మంత్రిత్వ శాఖ లోని మండల సాంస్కృతిక కేంద్రాలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టిఆర్ఐఎఫ్ఇడి ల తరఫు న ఈ సందర్భం లో వేరు వేరు కార్యక్రమాల ను రూపొందించడమైంది.
***
(Release ID: 1704241)
Visitor Counter : 265
Read this release in:
Bengali
,
Malayalam
,
Marathi
,
Tamil
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada