రైల్వే మంత్రిత్వ శాఖ
ఇ-అప్లికేషన్ శ్రామిక్ కళ్యాణ్ పోర్టల్ ద్వారా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించేలా 100% కట్టుబడి ఉండేందుకు భారతీయ రైల్వే నిర్ధారిస్తుంది
రోజూ కూలీలకు లబ్ధి చేకూర్చనున్న చర్య
పోర్టల్‌పై 09.03.2021నాటికి రూ.349590 లక్షల(రూ3495 కోట్లకన్నా ఎక్కువ) వేతన మొత్తం, సుమారు 6 కోట్ల పనిరోజులు కూడా భారతీయ రైల్వేల వ్యాప్తంగా నమోదు
మొత్తం 15,812మంది కాంట్రాక్టర్లు, 3,81,831మంది కాంట్రాక్టు కార్మికులు పోర్టల్‌పై 09.03.2021నాటికి నమోదు
చేసుకున్నారు
భారతీయ రైల్వేల కింద ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలూ ఈ ఇ-అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నాయి
కాంట్రాక్టరు కార్మికులకు కాంట్రాక్టర్లు చెల్లించే వేతనాలపై ప్రధాన యజమానిగా నిఘా ఉంచేందుకు రైల్వేలకు తోడ్పడనున్న ఇ-అప్లికేషన్
Posted On:
11 MAR 2021 1:12PM by PIB Hyderabad
భారతీయ రైల్వే శ్రామిక్ కళ్యాణ్ ఇ- అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి 2018 అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించారు. ఇ-అప్లికేషన్ కనీస వేతనాల చట్టంలోని నిబంధనలను పాటించడాన్ని నిర్ధారించడమే కాక భారతీయ రైల్వేలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు తమకు హక్కుగా రావలసిన వేతనాన్ని పొందేలా చూసేందుకై కాంట్రాక్టర్లు తాము చెల్లించిన వేతనాల డాటాను ఇ-అప్లికేషన్‌లో క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేసేలా చూస్తుంది. తద్వారా కాంట్రాక్టరు కార్మికులకు కాంట్రాక్టర్లు చెల్లించే వేతనాలపై ప్రధాన యజమానిగా నిఘా ఉంచేందుకు రైల్వేలకు తోడ్పడుతుంది.
ఈ పోర్టల్‌పై 09.03.2021నాటికి మొత్తం 15,812మంది కాంట్రాక్టర్లు, 3,81,831మంది కాంట్రాక్టు కార్మికులు నమోదు చేసుకున్నారు. దీనితో పాటుగా మొత్తం 48,312 లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్స్ (LOA), రూ.349590 లక్షల(రూ3495 కోట్లకన్నా ఎక్కువ) వేతన మొత్తం, సుమారు 6 కోట్ల పనిరోజులు కూడా భారతీయ రైల్వేల వ్యాప్తంగా నమోదు అయ్యాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ఇ-అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నాయి.
వివిధ రైల్వే యూనిట్లు, అంటే డివిజన్లు/ వర్క్‌షాప్‌లు/ పియులు/ పిఎస్‌యులు ఇ-అప్లికేషన్‌లో తమను తాము నమోదు చేసుకుని, తదనంతరం వివిధ రైల్వే యూనిట్లు తమకు జారీ చేసిన వర్క్ ఆర్డర్లను జత చేసేందుకు ఈ పోర్టల్ తోడ్పడుతుంది. ప్రతి కాంట్రాక్టరు తాను పని ఇచ్చిన ప్రతి కాంట్రాక్టు కార్మికుని ప్రొఫైల్ ను సృష్టించి, క్రమంతప్పకుండా వారికి చెల్లించే వేతనాలను తాజా పరచాలి. కాంట్రాక్టర్లు చెల్లించే వేతనాలు కాలానుగుణంగా భారత ప్రభుత్వం నిర్ణయించే కనీస వేతనాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు పోర్టల్‌లో తనిఖీలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు బిల్లులను జారీ చేసేముందు, రైల్వేలు ఆ కాంట్రాక్టరు ఇ-అప్లికేషన్‌లతో కాంట్రాక్టరు కార్మికుల డాటాను అప్‌లోడ్ చేశారో లేదో తనిఖీ చేయాలి. ఇందుకు కట్టుబడి ఉండేలా చూసేందుకు, కాంట్రాక్టు నిబంధనలలో అవసరమైన మార్పులు చేయడం జరిగింది.
కాంట్రాక్టు కార్మికుని ఐడిని ఉత్పత్తి చేసేందుకు ఇ-అప్లికేషన్‌లో అవకాశం ఉండటమే కాక, అతడికి చెల్లించిన వేతనం, ఇపిఎఫ్, ఇఎస్ ఐసి గురించి ఎప్పటికప్పుడు ఎస్ ఎంఎస్ పంపే సౌలభ్యం ఉంది.
పారదర్శకత కోసం, వివిధ రైల్వే యూనిట్ల వ్యాప్తంగా కార్యశీలంగా ఉన్న వర్క్ ఆర్డర్లు, పని చేస్తున్న కార్మికుల వివరాలు వంటి సహేతుకమైన అంశాలతో సూక్ష్మ సారాంశాన్ని ఇవ్వడం జరుగుతోంది.
***
(Release ID: 1704240)
Visitor Counter : 169