ప్రధాన మంత్రి కార్యాలయం

సౌదీ అరేబియా యువ‌ రాజు మాన్య శ్రీ మొహమ్మద్బిన్ స‌ల్‌మాన్‌ బిన్  అబ్దులజీజ్ అల్ సౌద్ తో టెలిఫోన్ లో మాట్లాడినప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర ‌మోదీ

Posted On: 10 MAR 2021 7:04PM by PIB Hyderabad


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర ‌మోదీ కింగ్ డ‌మ్ ఆఫ్ సౌదీ అరేబియా యువ రాజు మాన్య శ్రీ మొహమ్మద్ బిన్ స‌ల్‌మాన్‌ తో బుధ‌వారం నాడు టెలిఫోన్ లో మాట్లాడారు.

నేత‌ లు ఇద్ద‌రూ 2019 లో ఏర్పాటైన ద్వైపాక్షిక‌, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య మండ‌లి ప‌నితీరు పై స‌మీక్ష జరిపారు. భార‌త‌దేశం-సౌదీ భాగ‌స్వామ్యం లో వృద్ధి నిల‌క‌డ‌ గా చోటు చేసుకుంటూ ఉండ‌టం ప‌ట్ల వారు సంతృప్తి ని వ్య‌క్తం చేశారు. రెండు దేశాల మ‌ధ్య వ్యాపారాన్ని, పెట్టుబ‌డి ని మ‌రింత విస్త‌రించుకోవాల‌న్న అభిలాష ను ప్ర‌ధాన‌ మంత్రి వ్య‌క్తం చేశారు. భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సౌదీ ఇన్వెస్ట‌ర్ లకు ఇవ్వ‌జూపుతున్న అవ‌కాశాల‌ ను గురించి ఆయ‌న ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశాని కి, సౌదీ అరేబియా కు మ‌ధ్య గల ప్ర‌త్యేక మైత్రి భావ‌న, ప్ర‌జా సంబంధాల తాలూకు స్ఫూర్తి తో, కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కి వ్య‌తిరేకం గా ఉభ‌య ప‌క్షాల ప్ర‌యాసల‌ ను ప్రోత్స‌హించుకోవడాన్ని కొనసాగించాల‌ని నేత‌ లు అంగీక‌రించారు. ప‌ర‌స్ప‌ర హితం ముడిప‌డ్డ ప్రాంతీయ‌ ప‌రిణామాల ను గురించి, అంత‌ర్జాతీయ ప‌రిణామాల ను గురించి కూడా వారు స‌మీక్ష జరిపారు.

మాన్య శ్రీ యువ‌ రాజు వీలైనంత త్వ‌ర‌లో భార‌త‌దేశ సంద‌ర్శ‌న కు త‌ర‌లి రావాలంటూ ప్ర‌ధాన మంత్రి త‌న త‌ర‌ఫు నుంచి మరొక్క మారు ఆహ్వానించారు.



 

***



(Release ID: 1704059) Visitor Counter : 171