ఆర్థిక మంత్రిత్వ శాఖ

రెవెన్యూలోటు గ్రాంటు కింద 14 రాష్ట్రాలకు రూ. 6,194.09 కోట్లు విడుదల

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదలైన
రెవిన్యూ లోటు గ్రాంటు రూ. 74,340

Posted On: 10 MAR 2021 1:25PM by PIB Hyderabad

   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి (12వ) విడత నెలసరి పంపిణీ అనంతర రెవెన్యూ లోటు పద్దు  (పి.డి.ఆర్.డి.) గ్రాంటుకు సంబంధించిన రూ 6,194.09 కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ వ్యవహారాల విభాగం ఈ రోజు విడుదల చేసింది. దేశంలో ఆర్హత కలిగిన 14 రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ పద్దు కింద పచివరి విడత నెలవారీ గ్రాంటు విడుదలతో ఆర్హతగల రాష్ట్రాలన్నింటీకీ మొత్తం రూ. 74,340 కోట్ల మేర గ్రాంటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదలైంది.

  ఈ నెలలో విడుదలైన గ్రాంటు, 2020-21లో విడుదలైన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ గ్రాంటు మొత్తం తదితర వివరాలు రాష్ట్రాల వారీగా అనుబంధంలో పొందుపరచబడి ఉన్నాయి.

  రాజ్యాంగంలోని 275వ అధికరణం ప్రకారం వివిధ రాష్ట్రాలకు పంపిణీ అనంతరం ఏర్పడిన రెవిన్యూ లోటును భర్తీ చేసుకునేందుకు ఈ మొత్తాన్ని అందిస్తారు. నిధుల పంపిణీ అనంతం ఆయా రాష్ట్రాల రెవెన్యూ లెక్కల్లో అంతరాన్ని తొలగించేందుకు గాను, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ గ్రాంట్లను నెలవారీ మొత్తాలుగా కేంద్రం విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు పి.డి.ఆర్.డి. గ్రాంట్లను 15వ ఆర్థిక సంఘం సిఫార్సు  చేసింది.

  ఈ తరహా గ్రాంట్లను అందుకోవడానికి రాష్ట్రాల అర్హతను, ఆయా రాష్ట్రాలు అందుకోవలసిన గ్రాంటు పరిమాణాన్ని ఆర్థిక సంఘమే నిర్ణయిస్తుంది. రాష్ట్రాల రెవెన్యూ మధింపునకు, వ్యయానికి మధ్య నెలకొన్న అంతరం ప్రాతిపదికగా ఆర్థిక సంఘం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరపు అంచనాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఆర్థిక సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుంది.

  2020-21లో 14 రాష్ట్రాలకు అందించాల్సిన రెవిన్యూ లోటు గ్రాంటు మొత్తాన్ని రూ. 74,340 కోట్లుగా 15వ ఆర్థిక సంఘం అంతకు ముందు సిఫార్సు చేసింది. ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా వందకు వందశాతం మొత్తాన్ని కేంద్రప్రభుత్వం 14 రాష్ట్రాలకు విడుదల చేసింది.

   15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు గ్రాంటును పొందిన రాష్ట్రాలు..: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్

 

 

విడుదల తర్వాత రెవిన్యూ లోటు గ్రాంట్ల వివరాలు,.. రాష్ట్రాల వారీగా...

(రూపాయలు కోట్లలో)

క్రమసంఖ్య

రాష్ట్రం పేరు

2021 మార్చి 10వ తేదీకి విడుదలైన మొత్తం

(12వ విడత)

2020-21లో విడుదలైన మొత్తం గ్రాంటు

1

ఆంధ్రప్రదేశ్

491.34

5,896.92

2

అస్సాం

631.48

7,578.90

3

హిమాచల్ ప్రదేశ్

952.43

11,430.85

4

Kerala               కేరళ

1,276.72

15,322.80

5

మణిపూర్

235.30

2,823.97

6

మేఘాలయ

40.91

490.99

7

మిజోరాం

118.48

1,421.98

8

నాగాలాండ్

326.36

3,916.94

9

పంజాబ్

638.15

7,658.90

10

సిక్కిం

37.33

448.00

11

తమిళనాడు

335.36

4,024.94

12

త్రిపుర

269.62

3,235.95

13

ఉత్తరాఖండ్

422.93

5,075.93

14

పశ్చిమ బెంగాల్

417.68

5,012.93

 

మొత్తం

6,194.09

74,340.00

 

 

******



(Release ID: 1704053) Visitor Counter : 176