ఆర్థిక మంత్రిత్వ శాఖ

'స్టాండ్‌ అప్‌ ఇండియా' పథకం ప్రారంభం నుంచి 1,10,019 దాటిన రుణాల సంఖ్య

Posted On: 09 MAR 2021 1:21PM by PIB Hyderabad

'స్టాండ్‌ అప్‌ ఇండియా' పథకం ప్రారంభం నుంచి 31.01.2021 వరకు ఇచ్చిన రుణాల సంఖ్య 1,10,019ను దాటింది. ఈ పథకం కింద వ్యాపారాలు ప్రారంభించడానికిగానీ, పెంచుకోవడానికిగానీ లబ్ధిదారులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణం పొందవచ్చు.

    కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

    2016 ఏప్రిల్‌ 5వ తేదీన 'స్టాండప్‌ ఇండియా' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, తర్వాత దానిని 2025 వరకు పొడిగించిందని మంత్రి రాజ్యసభకు వివరించారు. ఈ పథకం కింద, షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు తమ ప్రతి బ్రాంచి నుంచి కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ లబ్ధిదారుడికి, ఒక మహిళకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి రుణాన్ని అందించాలి. తయారీ, సేవ, వాణిజ్య రంగాల్లో ఎలాంటి అడ్డంకులు లేని సంస్థల స్థాపన కోసం ఈ రుణాన్ని అందిస్తారు.

 

***



(Release ID: 1703529) Visitor Counter : 93