ఆర్థిక మంత్రిత్వ శాఖ
జిఎస్‌టి పరిహారంలో లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం 1.06 లక్షల కోట్ల రూపాయలకు చేరిక
19 వ వ విడత వాయిదా రూ 2,104 కోట్లరూపాయలను మార్చి 8, 2021 సోమవారం నాడు రాష్ట్రాలకు విడుదల చేసిన కేంద్రప్రభుత్వం
అంచనా వేసిన కొరత 1.10 లక్షల కోట్ల రూపాయలలో 96 శాతం మొత్తం విడుదల
Posted On:
09 MAR 2021 12:29PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన వ్యయ విభాగం 19 వ వారపు వాయిదా కింద రూ 2,104 కోట్ల రూపాయాలను రాష్ట్రాలకు విడుదల చేసింది. జిఎస్‌టి పరిహార లోటును భర్తీ చేసుకునేందుకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ఈమొత్తంలో రూ 2,103.95 కోట్ల రూపాయలను ఏడు రాష్ట్రాలకువిడుదల చేయగా 0.05 కోట్ల రూపాయలను కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి విడుదల చేశారు.
ఇప్పటివరకు జిఎస్‌టి పరిహారంలో లోటు మొత్తంలో 96 శాతం మొత్తాన్ని రాష్ట్రాలు, లెజిస్లేటివ్ అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేశారు. ఈ మొత్తంలో రూ 97,242.03 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేయగా, లెజిస్లేటివ్ అసెంబ్లీ కలిగిన 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ 8,861.97 కోట్ల రూపాయలు విడుదల చేశారు.
ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో ప్రత్యేక రుణ గవాక్షాన్ని ఏర్పాటు చేసింది. జిఎస్‌టి అమలు వల్ల ఏర్పడనున్నట్టు భావించిన సుమారు 1.10 లక్షల కోట్ల రూపాయల లోటుకు సంబంధించి దీనిని ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక విండో ద్వారా రుణాలు సేకరిస్తుంది. ఇప్పటివరకూ19 రౌండ్ల మేరకురుణాలను 2020 అక్టోబర్ 23 నుంచి తీసుకోవడం జరిగింది.
ప్రత్యేక విండో కింద, భారత ప్రభుత్వం మూడు సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలానికి ప్రభుత్వ స్టాక్ లను రుణంగా తీసుకుంటున్నది. ప్రతి సారీ తీసుకుంటున్న రుణాన్ని అన్ని రాష్ట్రాలకు వాటి జి.ఎస్.టి లోటును బట్టి సమానంగా పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రస్తుతవిడుదల క్రింద, జిఎస్‌టి లోటుదామాషా ప్రకారం 5 సంవత్సరాల కాలపరిమితి కింద 23 రాష్ట్రాలు , లెజిస్లేటివ్ అసెంబ్లీ కలిగిన 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 5 రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహార లోటు లేదు.
ఈ వారం విడుదల చేసిన మొత్తం రాష్ట్రాలకు కేటాయించిన 19 వ వాయిదాకు సంబంధించినది. ఈ వారం విడుదల చేసిన మొత్తంపై వడ్డీ రేటు 5.8594 శాతం. ఇప్పటివరకూ 1,06,104 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణ సేకరణ గవాక్షం ద్వారా 4.8842 శాతం వెయిటెడ్ యావరేజ్ పద్ధతిన సేకరించింది.
జిఎస్‌టి అమలు కారణంగా ఏర్పడిన రెవిన్యూ లోటును భర్తీ చేసేందుకు
ప్రత్యేక రుణ సేకరణ గవాక్షం ద్వారా నిధులు సమీకరణతోపాటు, భారత ప్రభుత్వం అదనపు రుణ సేకరణకు అనుమతి మంజూరుచేసింది. దీనిని జిఎస్‌టి పరిహార లోటును భర్తీ చేసుకునేందుకు ఆప్షన్ -1ని ఎంపిక చేసుకున్న రాష్ట్రాలకు వాటి జిఎస్‌డిపి లో 0.50 శాతం మొత్తానికి సమానమైన మొత్తానికి అదనపు నిధుల సమీకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అన్ని రాష్ట్రాలూ ఆప్షన్ -1ని ఎంచుకున్నాయి.మొత్తం అదనపు రుణ సమీకరణ మొత్తం అయిన రూ 1,06,830 కోట్ల రూపాయలకు (0.50 శాతం జిఎస్‌డిపి)ని ఈ ప్రోవిజన్ కింద 28 రాష్ట్రాలకు మంజూరు చేశారు.
28రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనపు రుణ సేకరణ కింద అనుమతించిన మొత్తం, స్పెషల్ విండో ద్వారా సమీకిరంచిన నిధులను అనుబంధంలో సూచించడం జరిగింది.
రాష్ట్రాల వారీగా అదనపు రుణ సేకరణ కింద ఆయా రాష్ట్రాల జిఎస్‌డిపిలో 0.50 మొత్తాన్ని అనుమతించడం జరుగుతుంది. ఈ స్పెషల్ విండో ద్వారా సేకరించిన మొత్తాన్ని 08-03-2021 వరకు రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసిన మొత్తం కింది విధంగా ఉంది.
( రూ..కోట్లలో)
S. No.
|
Name of State / UT
|
Additional borrowing of 0.50 percent allowed to States
|
Amount of fund raised through special window passed on to the States/ UTs
|
1
|
Andhra Pradesh
|
5051
|
2306.59
|
2
|
Arunachal Pradesh*
|
143
|
0.00
|
3
|
Assam
|
1869
|
992.12
|
4
|
Bihar
|
3231
|
3897.50
|
5
|
Chhattisgarh
|
1792
|
2654.69
|
6
|
Goa
|
446
|
838.38
|
7
|
Gujarat
|
8704
|
9204.31
|
8
|
Haryana
|
4293
|
4343.62
|
9
|
Himachal Pradesh
|
877
|
1713.71
|
10
|
Jharkhand
|
1765
|
1442.18
|
11
|
Karnataka
|
9018
|
12383.13
|
12
|
Kerala
|
4,522
|
4923.48
|
13
|
Madhya Pradesh
|
4746
|
4533.28
|
14
|
Maharashtra
|
15394
|
11954.02
|
15
|
Manipur*
|
151
|
0.00
|
16
|
Meghalaya
|
194
|
111.80
|
17
|
Mizoram*
|
132
|
0.00
|
18
|
Nagaland*
|
157
|
0.00
|
19
|
Odisha
|
2858
|
3814.67
|
20
|
Punjab
|
3033
|
7137.53
|
21
|
Rajasthan
|
5462
|
4249.28
|
22
|
Sikkim*
|
156
|
0.00
|
23
|
Tamil Nadu
|
9627
|
6229.05
|
24
|
Telangana
|
5017
|
2196.62
|
25
|
Tripura
|
297
|
225.54
|
26
|
Uttar Pradesh
|
9703
|
5995.48
|
27
|
Uttarakhand
|
1405
|
2311.55
|
28
|
West Bengal
|
6787
|
3783.50
|
|
Total (A):
|
106830
|
97242.03
|
1
|
Delhi
|
Not applicable
|
5853.76
|
2
|
Jammu & Kashmir
|
Not applicable
|
2267.62
|
3
|
Puducherry
|
Not applicable
|
740.59
|
|
Total (B):
|
Not applicable
|
8861.97
|
|
Grand Total (A+B)
|
106830
|
106104.00
|
* These States have ‘NIL’ GST compensation gap
****
(Release ID: 1703496)
Visitor Counter : 167