ప్రధాన మంత్రి కార్యాలయం

“ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్” ను స్మ‌రించుకోవ‌డానికి ఏర్పాటైన జాతీయ సంఘాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి‌


75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్రం ఉత్సవానికి 5 స్తంభాల‌ ను గురించి ఆయ‌న వివ‌రించారు

ఈ ఉత్స‌వాల లో స‌నాతన భార‌త శోభ ఉట్టిపడటం తో పాటు ఆధునిక భార‌త‌దేశం వెలుగులు కూడా  విర‌జిమ్మాలి:  ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశ స్వాతంత్య్ర 75 సంవ‌త్సరాల ఉత్స‌వాల లో 130 కోట్ల మంది భార‌తీయుల భాగ‌స్వామ్యం కీల‌కం:  ప్ర‌ధాన మంత్రి

Posted On: 08 MAR 2021 4:42PM by PIB Hyderabad

దేశ స్వాతంత్య్రాని కి 75 సంవ‌త్స‌రాల‌ ఘట్టాన్ని స్మ‌రించుకోవ‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయకత్వం లో ఏర్పాటైన జాతీయ సంఘం త‌న మొద‌టి స‌మావేశాన్ని సోమవారం నాడు జ‌రుపుకొన్నది.  ప్ర‌ధాన మంత్రి ఈ సంఘం స‌భ్యుల‌ ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.  గ‌వ‌ర్న‌ర్ లు, కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రులు, రాజ‌కీయ నేత లు, శాస్త్రవేత్త‌ లు, అధికారులు, ప్ర‌సార మాధ్య‌మాల‌ కు చెందిన ప్ర‌ముఖులు, ఆధ్యాత్మిక‌ నాయకులు, క‌ళాకారులు, చ‌ల‌న‌చిత్ర రంగ ప్ర‌ముఖులు, క్రీడారంగ ప్రముఖులతో పాటు, వివిధ జీవ‌న‌ రంగాల కు చెందిన విశిష్ట వ్య‌క్తులు సహా జాతీయ సంఘంలోని సభ్యులు కూడా ఈ స‌మావేశానికి హాజరు అయ్యారు.

ఈ స‌మావేశం లో సూచ‌న‌ల ను అంద‌జేసిన‌ జాతీయ సంఘ సభ్యుల లో పూర్వ రాష్ట్రప‌తి శ్రీ‌మ‌తి ప్ర‌తిభా దేవి సింహ్ పాటిల్‌, పూర్వ ప్ర‌ధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ,  శ్రీ న‌వీన్ ప‌ట్ నాయ‌క్‌, శ్రీ మల్లికార్జున్ ఖడ్ గే,  శ్రీ‌మతి  మీరా కుమార్, శ్రీమతి సుమిత్రా మహాజన్, శ్రీ జె.పి. న‌డ్డా లతో పాటు మౌలానా వహీదుద్దీన్ ఖాన్ కూడా ఉన్నారు.  ‘‘ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’’ కు రూప‌కల్ప‌న చేసి, నిర్వ‌హిస్తున్నందుకు గాను ప్ర‌ధాన మంత్రి కి సంఘం స‌భ్యులు ధ‌న్య‌వాదాలు ప‌లికారు.  మ‌హోత్స‌వ్ ప‌రిధి ని మరింతగా విస్త‌రించ‌డానికి వారు వారి సూచ‌న‌ల‌ ను అందించారు.  రాబోయే కాలం లో ఈ త‌ర‌హా స‌మావేశాలను మ‌రిన్నిటిని నిర్వహించగలమని, ఈ రోజు న అందిన సూచ‌న‌ల ను ప‌రిశీలించ‌డం జ‌రుగుతుంద‌ని కేంద్ర హోం మంత్రి అన్నారు.  

ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, స్వాతంత్య్ర 75వ సంవ‌త్స‌రాల ఘ‌ట్టాన్ని దేశం దీనికి గల చారిత్రిక స్వభావానికి, ప్రాముఖ్యానికి అనుగుణంగానే వైభ‌వోపేతంగాను, ఉత్సాహంతోను నిర్వహించుకొంటుంది అని స్ప‌ష్టం చేశారు.  సంఘం స‌భ్యులు  అనేక కొత్త ఆలోచ‌న‌ల‌ను, భిన్న‌మైన అభిప్రాయాల‌ను వ్యక్తం చేసినందుకు గాను వారిని ఆయ‌న కొనియాడారు.  స్వాతంత్ర్య 75వ వార్షిక మహోత్స‌వాన్ని ఆయన భార‌త‌దేశ ప్ర‌జ‌ల కు అంకితమిచ్చారు.

స్వాతంత్య్రం తాలూకు 75 సంవ‌త్స‌రాల ఉత్స‌వం ఎలా ఉండాలి అంటే అందులో స్వాతంత్య్రం స‌మ‌రం తాలూకు ప్రేరణ, అమ‌ర‌వీరులకు ప్ర‌శంస, భారతదేశాన్ని నిర్మించాలన్న వారి శపథం.. ఇవన్నీ తొణికిసలాడాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ ఉత్స‌వం స‌నాత‌న భార‌త‌దేశం తాలూకు శోభ‌ ను, అలాగే ఆధునిక భార‌త‌దేశం తాలూకు వెలుగు ల‌ను నింపుకోవాల‌ని కూడా ఆయ‌న అన్నారు.  ఈ ఉత్స‌వం మునుల ఆధ్యాత్మిక ప్ర‌కాశాన్ని, మ‌న శాస్త్రవేత్త‌ల ప్ర‌తిభ‌ను, శ‌క్తి న ప్ర‌తిబింబించాలి అని ఆయ‌న చెప్పారు.  ఈ కార్య‌క్ర‌మం ఈ 75 సంవ‌త్స‌రాల లో మ‌నం సాధించిన కార్యాల‌ను ప్ర‌పంచానికి చాటి చెప్తుందని, అంతేకాకుండా రాబోయే 25 సంవ‌త్స‌రాల లో మ‌న సంక‌ల్పాల‌ కు ఒక ఆకృతి ని సైతం అందిస్తుందని ఆయ‌న అన్నారు.

ఏ సంక‌ల్పం అయినా ఉత్సవం గా జ‌రుపుకోనిదే స‌ఫ‌లం కాదు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఎప్పుడైతే ఒక సంక‌ల్పం ఉత్స‌వ రూపాన్ని సంతరించుకొంటుందో అప్పుడు ల‌క్ష‌ల మంది తాలూకు శ‌క్తి, వారి ప్ర‌తిభలు దానికి జ‌త ప‌డ‌తాయి అని ఆయ‌న చెప్పారు.  130 కోట్ల మంది ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం తో ఈ 75 సంవ‌త్స‌రాల వేడుక ను జ‌రుపుకోవాల‌ని, మ‌రి ఈ వేడుక‌ లో ఈ ప్ర‌జ‌ల ప్రాతినిధ్యం కీల‌కం గా ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ ప్రాతినిధ్యం 130 కోట్ల మంది దేశ ప్ర‌జ‌ల భావాలను, సూచ‌న‌లను, వారి స్వ‌ప్నాలను కలబోసుకొంటుంది అని ఆయన అన్నారు.

75 సంవ‌త్స‌రాల వేడుక కోసం 5 స్తంభాల ను ఖ‌రారు చేయ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన ‌మంత్రి తెలిపారు.  అవి.. స్వాతంత్య్ర సమరం, 75వ మ‌జిలీ వ‌ద్ద‌ ఉపాయాలు, 75వ మైలు రాయి వ‌ద్ద కార్య‌సాధ‌న‌ లు, 75వ మ‌లుపు వ‌ద్ద చేప‌ట్ట‌వ‌ల‌సిన కార్యాచ‌ర‌ణ‌ లు, అలాగే 75వ స్థానం వ‌ద్ద సంక‌ల్పం.. అని ఆయ‌న వివ‌రించారు.  వీట‌న్నిటిలో 130 కోట్ల మంది భార‌తీయుల ఆలోచ‌న‌లు, భావాలు క‌ల‌సివుండాలి అని ఆయ‌న చెప్పారు.

ప్ర‌జ‌ల ‌కు అంత‌గా తెలియ‌ని స్వాతంత్య్ర సమర
వీరుల గాథ‌ల‌ ను వెలికితీసి, గౌర‌వించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా ప్ర‌ధాన ‌మంత్రి నొక్కి చెప్పారు.  దేశం లోని ప్రతి మూలన దేశ పుత్రుల‌, పుత్రిక‌ల త్యాగం తాలూకు గాథలు లెక్క‌ కు మిక్కిలి గా ఉన్నాయి, అవి దేశ ప్ర‌జ‌ల‌ కు ఒక శాశ్వ‌త‌మైనటువంటి ప్రేర‌ణ‌దాయ‌క వ‌న‌రు కాగ‌లుగుతాయి అని ఆయ‌న అన్నారు.  మ‌నం మరుగున పడ్డ ప్ర‌తి ఒక్క వ‌ర్గం తోడ్పాటు ను తెర మీద‌కు తీసుకురావాలి అని ఆయ‌న చెప్పారు.  త‌రాల తరబడి దేశం కోసం ఎంతో కొంత గొప్ప కృషి ని చేస్తూవస్తున్న వ్య‌క్తులంటూ ఉన్నారు, వారి తోడ్పాటు, వారి ఆలోచ‌న విధానం, వారి అభిప్రాయాల‌ ను జాతీయ ప్ర‌యాస‌ల తో మిళితం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ చారిత్రిక ఉత్స‌వం స్వాతంత్య్ర పోరాట యోధులు కన్న క‌ల‌ల‌ ను నెర‌వేర్చ‌డమూ, భార‌త‌దేశాన్ని వారు కోరుకున్న విధంగా ఉన్న‌త‌మైన స్థానం లో నిల‌బెట్టే ప్ర‌య‌త్నమూను అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఆలోచ‌న‌కు అయినా అంద‌న‌టువంటి ప‌నుల ను దేశం సాధిస్తున్నదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  ఈ ఉత్స‌వం భార‌త‌దేశ చారిత్రిక వైభ‌వానికి త‌గిన‌ట్లుగా ఉంటుంది అని ఆయ‌న అన్నారు.



 

***
 


(Release ID: 1703227) Visitor Counter : 317