ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటీ 80 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ
గత 24 గంటల్లో 14 లక్షల టీకా డోసులు
మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
గత 24 గంటలలో కోవిడ్ మరణం నమోదు కాని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
Posted On:
05 MAR 2021 11:31AM by PIB Hyderabad
భారత లో కోవిడ్ టీకా డోసుల సంఖ్య కోటీ 80 లక్షలు దాటి నేటికి 1,80,05,503 కి చేరినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం తేల్చింది. అందులో ఆరోగ్య సిబ్బంది మొదటి డోసులు 68,53,083, ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు 31,41,371, కోవిడ్ యోధుల మొదటి
డోసులు 60,90,931, కోవిడ్ యోధుల రెండో డోసులు 67,297, 45 ఏళ్ళు దాటిన దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల మొదటి డోసులు 2,35,901,
60 ఏళ్ళు పైబడిన వారి మొదటి డోసులు16,16,920 ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
68,53,083
|
31,41,371
|
60,90,931
|
67,297
|
2,35,901
|
16,16,920
|
1,80,05,503
|
టీకాల కార్యక్రమం మొదలైన 48వ రోజైన నిన్న మార్చి 4న దాదాపు 14 లక్షల డోసులు (13,88,170) టీకాలిచ్చారు. మొదటి డోస్ కోసం మొత్తం 16,081 శిబిరాలలో 10,56,808 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా వారిలో ఆరోగ్య సిబ్బంది,
కోవిడ్ యోధులు ఉన్నారు. 3,31,362 మంది ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు రెండో డోస్ అందుకున్నవారున్నారు.
తేదీ: మార్చి4, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 -60 ఏళ్ళ దీర్ఘ కాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
62,143
|
2,68,267
|
2,86,653
|
63,095
|
92,109
|
6,15,903
|
10,56,808
|
3,31,362
|
మరోవైపు గత 24 గంటలలో ఆరు రాష్టాల్లో కొత్త కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అవి మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, గుజరార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ. 16,838 కొత్తకేసులలో 84.44% ఈ రాష్ట్రాలదే కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో8,998
కేసులు, కేరళలో 2,616, పంజాబ్ లో 1,071 కొత్తకేసులు నమోదయ్యాయి.
కొత్తకేసులలో పెరుగుదల ఎనిమిది రాష్ట్రాలలో కనబడుతోంది.
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 1,76,319 గా నేడు నమోదు కాగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో1.58%.వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో కోవిడ్ కేసులలో మార్పును ఈ దిగువ పటం చూపిస్తుంది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్
లో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తూ ఉండగా మరోవైపు మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ,
గుజరాత్ లో కేసులు పెరుగుదలలో ఉన్నాయి.
గడిచిన నెలరోజుల్లో ఆయా రాష్ట్రాలలో చికిత్సలో ఉన్న కేసుల సంక్యలో మార్పును ఈ క్రింది చిత్రపటం చూపుతుంది. చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టటంలో ముందున్న మొదటి ఐదు రాష్టాలుగా కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, తమిళనాడు ఉన్నాయి.
అదే సమయంలో చికిత్సలో ఉన్న కేసులు పెరుగుతున్న మొదటి 5 రాష్టాలు మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ
20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1000 కంటే తక్కువమంది చికిత్సలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో కేవల ఇద్దరే ఉన్నారు.
దేశం మొత్తం మీద పాజిటివ్ శాతం తగ్గుదలబాటలో సాగుతూ ప్రస్తుతం 5.08% చేరింది.
వారపు జాతీయ సగటు పాజిటివ్ శాతం (2.09%) కంటే ఎక్కువ చూపుతున్న రాష్టాలు 8 ఉండగా అందులో మహారాష్ట్ర అత్యధికంగా
10.38%. చూపుతోంది.
గత 24 గంటలలో 113 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కేవలం ఆరు రాష్టాల్లోనే 88.5% మరణాలు సంభవించగా మహారాష్ట్రలో అత్యధికంగా 60 మంది, పంజాబ్ లో 15 మంది, కేరళలో 14 మంది చనిపోయారు.
గత 24 గంటలలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణమూ నమోదు కాలేదు. అవి: అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, చండీగఢ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్,
మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ ,
***
(Release ID: 1702654)
Visitor Counter : 209