ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ,

పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక
ఈ ఉదయం 7 గంటల వరకు కోటీ 56 లక్షల కోవిడ్ టీకా డోసులు

Posted On: 03 MAR 2021 12:03PM by PIB Hyderabad

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నిటిలో కలిపి మొత్తం గత 24 గంటల కోవిడ్ కేసులలో 85.95% రావటం గమనార్హం. గడిచిన 24 గంటలలో 14,989 

కొత్త కోవిడ్ కే సులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 7,863 కేసులు రాగా అ తరువాత స్థానాల్లో ఉన్న కేరళలో 2,938 కేసులు, పంజాబ్ లో  729 కేసులు వచ్చాయి.

 

ముందువారం కంటే ప్రస్తుత వారం పెరుగుదలను పోల్చి చూసినప్పుడు మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కర్నాటక అత్యధిక పెరుగుదల చూపాయి. మహారాష్ట్ర ఒక్కటే వారానికి 16,012 కొత్త కేసులు చూపింది. శాతం పరంగా చూసినప్పుడు  

పంజాబ్ లో అత్యధికంగా 71.5% (1,783 కేసులు) పెరిగాయి.

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సమాలోచనలు జరుపుతూనే ఉంది. కొత్త కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ పరిస్థితిని సమీక్షిస్తోంది.నిఘా కొనసాగిస్తూ, వ్యాధి నిర్థారణ పరీక్షలు పెంచుతూ, సోకే అవకాశమున్నవారిని గుర్తిస్తూ, లక్షణాలున్నవారిని ఐసొలేషన్ కు తరలించి సమర్థమైన చికిత్స అందేట్టు చూడాలని కోరుతోంది. అదే విధంగా కేసులు ఎక్కువగా వస్తున్న

మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలు కోవిడ్ మీద జరుపుతున్న పోరులో సహకరించటానికి ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపింది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందాలు ఆరోగ్యమంత్రిత్వ

శాఖలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పడ్దాయి. కేసులు పెరగటానికి కారణాలను నిర్థారించటంలోను, నియంత్రణ చర్యలలోను రాష్ట ప్రభుత్వాలకు  ఈ బృందాలు సహకరిస్తాయి.

 

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,70,126  కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.53% గత 24 గంటలలో రాష్టాలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో మార్పును ఈ క్రింది చిత్రపటం చూపుతుంది. కేరళ చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జమ్మూకశ్మీర్ లో చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టగా, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్ లో

పెరుగుతున్నాయి.   ఈ క్రింది చార్టులో చూపిన విధంగా 8 రాష్ట్రాలు పెరుగుతున్న కోవిడ్ కేసులను చూపుతున్నాయి.

 

 

రెండో డోస్ కోవిడ్ టీకాల కార్యక్రమం ఫిబ్రవరి13న మొదలైంది. మొదటి డోస్ తీసుకుని 28 రోజులు పూర్తయినవారికి రెండో డోస్ ప్రారంభమైంది. కోవిడ్ యోధుల టీకాల కార్యక్రమం ఫిబ్రవరి 2న మొదలైంది. తరువాత దశ కోవిడ్ టీకాలు మార్చి 1న మొదలయ్యాయి. ఇది 60 ఏళ్ళ పైబడ్డవారికి, 45 ఏళ్ళు పైబడి ఇతర దీర్ఘకాల వ్యాధులున్నవారికి వర్తిస్తుంది. ఈ ఉదయం 7 వరకు మొత్తం 3,12,188 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా1,56,20,749 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో  67,42,187 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్,   27,13,144 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్, 55,70,230 మంది కోవిడ్ యోధులకు మొదటి డోస్,   834మంది కోవిడ్ యోధులకు

 రెండో డోస్, 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు  71,896, 60 ఏళ్ళు పైబడిన వారికి 5,22,458  డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు 

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం టీకాలు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

67,42,187

27,13,144

55,70,230

834

71,896

5,22,458

1,56,20,749

 

టీకాలు మొదలైన 46 వ రోజైన మార్చి 2న మొత్తం 7,68,730 టీకా డోసులిచ్చారు. అందులో 6,52,501మంది లబ్ధిదారులు 10,527 శిబిరాలలో మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు ఉండగా 1,16,229మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

 

తేదీ : 2021 , మార్చి 2

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు  

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం టీకాలు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

37656

115395

227762

834

47617

339466

652501

116229

 

ఇప్పటివరకు 1,08,12,044 మంది కోవిడ్ బారినుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కోలుకున్నవారు13,123 మంది. వీరిలో  86.58% మంది కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 6,332 మంది కోలుకోగా

 కేరళలో 3,512 మంది, తమిళనాడులో 473 మంది కోలుకున్నారు.

 

గడిచిన 24 గంటలలో 98 కోవిడ్ మరణాలు సంభవించాయి.  అందులో నాలుగు రాష్ట్రాల్లోనే 88.78% మంది చనిపోగా, మహారాష్ట్రలో అత్యధికంగా 54 మంది, కేరళలో 16 మంది, పంజాబ్ లో 10 మంది చనిపోయారు.  

గత 24 గంటలలో 21 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: మధ్యప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, గోవా, బీహార్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, అస్సాం,

లక్షదీవులు, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, త్రిపుర, చండీగఢ్ నాగాలాండ్, అండమాన్-నికోబార్ దీవులు

 

***


(Release ID: 1702242) Visitor Counter : 218