వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ రంగం లో, వ్యవసాయం తో సంబంధం గల రంగాల లో సహకారం కోసం భారతదేశాని కి, ఫిజీ ల మధ్య అవగాహన పూర్వక ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
03 MAR 2021 1:00PM by PIB Hyderabad
వ్యవసాయ రంగం లో, వ్యవసాయం తో సంబంధం గల రంగాల లో సహకారానికి గాను భారతదేశ గణతంత్రాని కి చెందిన వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కు, ఫిజీ గణతంత్రాని కి చెందిన వ్యవసాయ మంత్రిత్వ శాఖ కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒయు భారతదేశాని కి, ఫిజీ కు మధ్య ఈ కింద పేర్కొన్న రంగాల లో సహకారానికి బాట వేస్తుంది:-
• పరిశోధన లలో పాలుపంచుకొనే సిబ్బంది, విజ్ఞాన శాస్త్ర నిపుణులు, నిపుణులు, సాంకేతిక శిక్షణార్థుల పరస్పర ఆదాన ప్రదానం;
• సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, సాంకేతిక విజ్ఞాన బదలాయింపు;
• వ్యవసాయ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కు ఊతం ఇవ్వడం;
• వర్క్ షాపుల, చర్చాసభల నిర్వహణ, అధికారుల కు, రైతుల కు శిక్షణ ద్వారా మానవ వనరుల ను అభివృద్ధి చేసుకోవడం;
• ఉభయ దేశాల లోని ప్రైవేటు రంగాల మధ్య సంయుక్త సంస్థ (జెవి) లను ప్రోత్సహించడం;
• వ్యవసాయ వస్తువుల కు విలువ జోడింపు/డౌన్ స్ట్రీమ్ ప్రోసెసింగ్ తో పాటు మార్కెటింగ్ లో పెట్టుబడుల ను ప్రోత్సహించడం;
• వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాల లో సామర్ధ్యం పెంపుదల ను ప్రోత్సహించడం;
• బజారులను అందుబాటు లోకి తీసుకు రావడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యక్ష వర్తకాన్ని ప్రోత్సహించడం;
• పరిశోధన ప్రతిపాదనల ను రెండు పక్షాలు కలసికట్టుగా రూపొందించడం, అభివృద్ధి పరచడం, రిసర్చ్ ప్రాజెక్టుల ను అమలుపర్చడం;
• సస్య రక్షణ కు సంబంధించిన అంశాల ను పరిష్కరించడం కోసం ఇండో-ఫిజీ కార్యాచరణ సమూహాన్ని ఏర్పాటు చేయడం, దీనితో పాటు, ఇరు పక్షాలు సమ్మతించే మేరకు మరే విధంగానైనా సహకరించుకోవడం.
ఈ ఎమ్ఒయు ప్రకారం, రెండు దేశాల కు చెందిన కార్యాచరణ ఏజెన్సీ ల ద్వారా ఒక సంయుక్త కార్యాచరణ సమూహాన్ని (జెడబ్ల్యుజి) ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది తనకు నిర్దేశించిన లక్ష్యాల ను సాధించడం కోసం ప్రక్రియలకు తుది రూపాన్ని ఇస్తుంది. ఇరు పక్షాలు సహకరించుకోదగిన కార్యక్రమాల ను రూపొందిస్తుంది. తత్సంబంధిత సిఫారసులను చేస్తుంది. జెడబ్ల్యుజి ప్రతి రెండు సంవత్సరాల కాలం లో ఒక సారి చొప్పున ఒక పర్యాయం భారతదేశం లో, మరొక పర్యాయం ఫిజీ లో తాను సమావేశమవుతుంది.
ఈ ఎమ్ఒయు, దీని పై సంతకాలు జరిగిన తేదీ నుంచి అమలు లోకి వస్తుంది; అప్పటి నుంచి 5 సంవత్సరాల పాటు అమలు లో ఉంటుంది.
***
(Release ID: 1702237)
Visitor Counter : 181