గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ముస్సోరీలో జి.ఐ. మహోత్సవ్!
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, లాల్ బహదారు శాస్త్రి జాతీయ అకాడమీ సహకారంతో నిర్వహించనున్న ట్రైఫెడ్
Posted On:
02 MAR 2021 4:12PM by PIB Hyderabad
"స్థానిక ఉత్పాదనలకే ప్రాధాన్యం" అన్న నినాదంతో ప్రధానమంత్రి ప్రకటించిన దార్శనికతకు అనుగుణంగా, స్వావలంబనతో కూడిన “ఆత్మనిర్భర్ భారత్” నిర్మాణంలో భాగంగా “జి.ఐ. మహోత్సవం” పేరిట ఒక కార్యక్రమాన్ని 2021 మార్చి 4, 5 తేదీల్లో ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య ట్రైఫెడ్) ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ముస్సోరీలోని లాల్ బహదూరు శాస్త్రి జాతీయ పరిపానా అకాడమీ (ఎల్.బి.ఎస్.ఎన్.ఎ.ఎ.)తోపాటు, కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఇది చేపడుతున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆవరణలో జరిగే ఈ జి.ఐ. మహోత్సవ్.లో భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ-జి.ఐ.) కలిగిన ఉత్పాదనలను, గిరిజన హస్త కళాఖండాలను విక్రయించే 40కి పైగా అధీకృత సంస్థలు పాలుపంచుకుంటాయి.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భౌగోళిక గుర్తింపు కలిగిన వివిధ రకాల ఉత్పాదనలను ప్రదర్శించడం, శిక్షణలోని ఐ.ఎ.ఎస్. ప్రొబేషనర్లకు సదరు ఉత్పత్తులపై అవగాహనను పెంపొందించడం, సుసంపన్నమైన ఆ ఉత్పాదనల సాంస్కృతిక వారసత్వాన్నిగురించి వారికి తెలియజెప్పడం ఈ జీ.ఐ. మహోత్సవ్ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో తమ అధికార పరిధిలోని ప్రాంతాల్లో జి.ఐ. గుర్తింపు కలిగిన ఉత్పాదల ప్రయోజనాలను పరిరక్షించేలా ట్రెయినీ అధికారులు తగిన విధానాలను రూపొందించేందుకు ఈ ఉత్సవం దోహదపడుతుంది.
శిక్షణలో ఉన్న అధికారులు,.. అధీకృత జి.ఐ. వస్తువుల ఉత్పత్తిదారులతో, హస్త కళాకారులతో సంప్రదింపులు జరిపేందుకు,.. ఉత్పత్తి, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర అంశాలకు సంబంధించి ఒక ప్రణాళికను రూపకల్పన చేయడంలో వారికి అధికారులు తగిన సహాయం అందించేందుకు కూడా ఈ జి.ఐ. మహోత్సవ్ దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా జి.ఐ. ఉత్పాదనల తాజా పరిస్థితి, జి.ఐ. గుర్తింపు ట్యాగింగ్ ప్రక్రియ, గిరిజన ఉత్పత్తి దారులు, హస్త కళాకారులు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర అంశాలపై మార్చి 4వ తేదీ జరిగే కార్యక్రమంలో డాక్టర్ రజనీ కాంత్, పద్మశ్రీలు ట్రెయినీ అధికారులకు అవగాహన కల్పిస్తారు.
మార్చి 5వ తేదీన ట్రైబ్స్ ఇండియా ఆధ్వర్యంలోని ఒక విక్రయ శాలను ప్రారంభిస్తారు. జి.ఐ. ట్యాగింగ్ కలిగిన ఉత్పాదనల, గిరిజన హస్తకళాఖండాల మార్కెటింగ్, ప్రచారం లక్ష్యంగా ఈ విక్రయ శాలను ఏర్పాటు చేస్తున్నారు. పోచంపల్లి చేనేత కళాకారులు అనుసరించే ప్రత్యేక అద్దకం శైలితో కూడిన ట్రైఫెడ్ జాకెట్లను మార్చి నెల 5వ తేదీన ప్రారంభించబోవడం ఈ మహోత్సవంలో ఒక విశేషం. దీనితో పాటుగా, గిరిజన సంస్కృతి, వంటల విధానం తదితర విశేషాలు ప్రతిబింబించేలా పలు సాంస్కృతి ప్రదర్శనలు, వంటల ప్రదర్శనలను కూడా రెండు రోజుల జి.ఐ. మహోత్సవ్.లో నిర్వహిస్తారు.
స్వదేశీ ఉత్పాదనలకు సంబంధించి భారతదేశానికి సుపంపన్నమైన వారసత్వం, సంప్రదాయం ఎప్పట్నుంచో కొనసాగుతూ వస్తున్నాయి. హస్త కళాఖండాలు, చేనేతలు, ఇతర ఉత్పాదనలను ఎన్నాళ్లుగానో మన మనసులను అలరిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, దేశంలోని ఆయా ప్రాంతాల ప్రాతిపదికన వస్తువులకు, ఉత్పత్తులకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు కల్పించే ప్రక్రియ ప్రాధాన్యతను సంతరించుకుంది. భౌగోళిక గుర్తింపుకోసం రిజిస్టర్ చేయడం, ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి జిరిగే ప్రత్యేక వస్తువులకు ఉత్పాదనల ప్రయోజనాల రక్షణను కోరడం వంటివి,.. సదరు ఉత్పాదనల పెంపకందార్లకు, కళాకారులకు ప్రోత్సాహం కలిగిస్తాయి. ఈ వస్తువులకు సంబంధించి మార్కెట్ నిర్వాహకులు తమ వాణిజ్యాన్ని దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతం చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. మేక్ ఇన్ ఇండియా నినాదం స్ఫూర్తిగా తీసుకున్న ఈ ఉత్పాదనల్లో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన డార్జలింగ్ టీ, మైసూరు పట్టు, చందేరీ చీరలు, బెనారస్ జరీ బుటా వస్త్రాలు, పోచంపల్లి వస్త్రాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, ఒరిస్సా వస్త్ర ఆధారిత వర్ణచిత్రాలు, వర్లి పెయింటింగులు, అరకు లోయ కాఫీ, కులూ శాలువలు, జైపూర్ మృణ్మయకళా ఉత్పత్తులు, నాగా మిర్చీ (బుట్జోలోకియా) వంటి అనేక ఉత్పత్తులకు ఈ మహోత్సవంలో చోటు కల్పించారు.
దేశంలోని వివిధ గిరిజన తెగలు, సమూహాలు కొన్ని శతాబ్దాలుగా ఉత్పత్తిచేసే అనేక స్వదేశీ ఉత్పాదనలను మార్కెటింగ్ చేసేందుకు, వాటిని ఇతర రకాలుగా ప్రోత్సహించేందుకు జాతీయ నోడల్ ఏజెన్సీ స్థాయిలో ట్రైఫెడ్ సంస్థ ఎంతో విస్తృతంగా కృషి చేస్తూవస్తోంది. భౌగోళిక గుర్తింపు కలిగిన 50 ఉత్పాదనలకు సంబంధించి మార్కెటింగ్ ప్రక్రియను ట్రైఫెడ్ సంస్థ ఇప్పటికే నిర్వహిస్తోంది. మరింత మంది గిరిజన విక్రయదారులను అధీకృత అమ్మకందార్లుగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు కూడా ట్రైఫెడ్ సంస్థ కృషి చేస్తోంది. భౌగోళిక గుర్తింపు కలిగిన ఉత్పాదనల సరికొత్త విక్రయదార్లను కూడా తాజాగా చేర్చింది. దీనితో ఈ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదార్లు, అమ్మకం దార్ల పరస్పర కలయికకు సానుకూల వాతావరణం కూడా పెరుగుతుంది. కొత్త ఉత్పాదనలకు భౌగోళిక గుర్తింపు సాధించే ప్రక్రియను ట్రైఫెడ్ ఇప్పటికే చేపట్టింది. ఇందుకోసం 54 కొత్త ఉత్పాదనలను ఇప్పటికే గుర్తించింది. గిరిజనుల జీవన విధానాలను, సంప్రదాయాలను పరిరక్షిస్తూనే,..వారి ఆదాయాన్ని, జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ట్రైఫెడ్ తన కృషిని కొనసాగిస్తూ వస్తోంది.
***
(Release ID: 1702026)
Visitor Counter : 194