మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఇండియా టాయ్ ఫెయిర్ 2021లో విద్యా సంబంధిత ఆటవస్తువులను ప్రదర్శిస్తున్న మూడు కెవిలు
Posted On:
02 MAR 2021 1:14PM by PIB Hyderabad
కేంద్రీయ విద్యాలయ సంఘటన విద్యార్ధులు ఇండియా టాయ్ ఫెయిర్ 2021లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కోసం మొత్తం కేవీల నుంచి నమోదు చేసుకున్న మొత్తం విద్యార్ధుల సంఖ్య సుమారు 3.5 లక్షలు.
ఇండియా టాయ్ ఫెయిర్ 2021 ప్రదర్శనను 27 ఫిబ్రవరి 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించారు. మన దేశపు ఆటబొమ్మల, వస్తువుల పరిశ్రమలో కనిపించని శక్తి ఉందని ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ అన్నారు. ఈ బలాన్ని పెంచడం, దాని విలక్షణతను, గుర్తించడమన్నది ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో పెద్ద భాగం.
ఈ ప్రదర్శనలో తమ స్టాళ్ళను పెట్టుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల నుంచి మూడింటిని ఎంపిక చేశారు. ప్రత్యేకమైన, విలక్షణమైన బొమ్మలను ఢిల్లీ ప్రాంతానికి చెందిన కె.వి.జెఎన్‌యు, కెవి నెం.1 ఎఎఫ్ ఎస్ గురుగ్రాం, కెవి ఐఐటి కాన్పూర్ ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు.
కెవిలు అభ్యాసం, విద్యకు సంబంధించిన బొమ్మలు ప్రదర్శించే హాల్ నెం.9 వద్ద ఉన్నారు. కెవి జెఎన్‌యు స్టాల్ నెం ఐ 347లో , కెవి ఐఐటి కాన్పూర్ తన బొమ్మలను స్టాల్ నెం. ఐ1550లో, కెవి నెం.1 ఎఎఫ్ెస్ గురుగ్రాం స్టాల్ నెం.ఐ361లో ప్రదర్శనకు ఉంచాయి.
వివిధ కథలను చెప్పేందుకు ఉపయోగించే జంతురూపంలోని తోలు బొమ్మలు, నాట్యం, విన్యాసాలు చేసే అస్తిపంజరం, ఊపిరితిత్తుల రూపంలోని బెలూన్, నోస్ బగ్ తదితరాలు సహా 25 బొమ్మలను కెవి జెఎన్‌యు ప్రదర్శిస్తోంది.
బోర్డ్ గేమ్స్, డిజిటల్ గేమ్స్, మెకానికల్ గేమ్స్‌తో పాటు రోలింగ్ జోకర్, పేపర్ పప్పెట్స్, డైనమిక్ డాల్, నాలెడ్జ్ ఎక్స్‌ప్రెస్, వే మేకర్, టచింగ్ స్లేట్, కోవిడ్ రక్షక్, టాయ్ పారాచూట్ వంటి పలు సైన్స్ యాక్టివిటీ ఆటలు సహా 33 ఆటవస్తువులను ప్రదర్శనకు ఉంచింది.
అడిషన్ మెషీన్, వర్డ్ హౌజీ, హైడ్రాలిక్ బ్రేక్ సిస్టం, జోడ్ గాడీ, నల్ తరంగ్, ప్రోబినో తదితరాలు సహా మొత్తం 14 ఆటవస్తువలను కెవి నెం.1 ఎఎఫ్ ఎస్ గురుగ్రాం ప్రదర్శనకు పెట్టింది.
భారతీయ ఆటవస్తువుల, బొమ్మల ప్రత్యేక ప్రపంచంలోకి పిల్లలను తీసుకువెళ్ళేందుకు సంప్రదాయ, ఆధునిక ఆటబొమ్మలు, వస్తువులను ఈ ప్రత్యేక చొరవ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేంద్రీ విద్యాలయాల విద్యార్ధులు చురుకుగా పాల్గొంటున్నారు.
ఇండియా టాయ్ ఫెయిర్‌ను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2, 2021 వరకు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ ఆటవస్తువులు, బొమ్మలు తయారీ, టాయ్ మ్యూజియమ్‌లు, పరిశ్రమలను దృశ్యమాధ్యమం ద్వారా సందర్శించడం సహా పలు కార్యకలాపాలలో పాల్గొనేందుకు పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం.
***
(Release ID: 1701963)
Visitor Counter : 228