ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

45వ రోజున తరువాత దశ టీకాలు ప్రారంభం

కోవిన్ పోర్టల్ లో నేడు 25 లక్షలమంది నమోదు, 24.5 లక్షల మంది సాధారణ పౌరులు
ఇప్పటిదాకా కోటీ 47 లక్షలకు పైగా టీకాలు
సోమవారం సాయంత్రం 7 కల్లా 4.27 లక్షల టీకా డోసులు

Posted On: 01 MAR 2021 9:45PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు నిన్న సోమవారం సాయంత్రానికి కోటీ 47 లక్షలు దాటాయి.  2021 జనవరి 16న వైద్య సిబ్బందితో సార్వత్రిక కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2న కోవిడ్ యోధులకు కూడా టీకాలు మొదలయ్యాయి. 60 ఏళ్ళు పైబడినవారికి, 45 ఏళ్ళు దాటిన దీర్ఘకాల వ్యాధి గ్రస్తులకు  మార్చి 1 సోమవారం నాడు టీకాలివ్వటం మొదలైంది. నిన్న కోవిన్ పోర్టల్ లో 25 లక్షలమంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నారు. వీరిలో 24.5 లక్షలమంది సాధారణ పౌరులు కాగా మిగిలినవారు ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు. దాదాపు 6 లక్షల 44 వేలమంది పౌర లబ్ధిదారులు అపాయింట్ మెంట్ నిన్ననే నమోదు అయింది. సోమవారం సాయంత్రం 7 గంటలకల్లా 1,47,28,569 టీకా డోసులుచ్చారు.  వీరిలో 66,95,665 ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ తీసుకోగా 25,57,837 మంది రెండో డోస్ తీసుకున్నారు. అదే విధంగా , 53,27,587 మంది కోవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకోగా సాధారణ పౌరుల్లో మొదటి డోస్ తీసుకున్న 1,28,630 మంది 60 ఏళ్ళు పైబడ్డ వారు, 18,850 మంది 45 ఏళ్ళు దాటి దీర్ఘకాల వ్యాధులున్నవారు ఉన్నారు.  45వ రోజైన 2వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలవరకు  4,27,072 టీకా డోసులివ్వగా  3,25,485 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 1,01,587 ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు. తుది నివేదిక ఇంకా అందాల్సి ఉంది.   

తేదీ: మార్చి 1, 2021

అరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

దీర్ఘకాల వ్యాధులున్న 45 – 60 వయస్కులు

60 పైబడ్డవారు

మొత్తం టీకాలు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

25,656

1,01,587

1,52,349

18,850

1,28,630

3,25,485

1,01,587

 

****



(Release ID: 1701907) Visitor Counter : 221