ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కో-విన్ 2.0 పోర్టల్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సినేషన్ తదుపరి దశ రిజిస్ర్టేషన్లు మార్చి 1, 2021 ఉదయం 9 గంటలకు www.cowin.gov.in ద్వారా ప్రారంభం
ఆయుష్మాన్ భారత్ పిఎంజెఏవై పథకం కింద 10 వేలకు పైగా ప్రైవేటు ఆస్పత్రులకు ప్యానెల్ లో స్థానం; సిజిహెచ్ఎస్ పరిధిలో 600 పైగా ఆస్పత్రులు; రాష్ర్టాల స్కీమ్ ల కింద ప్యానెల్ లో స్థానం గల ఇతర ప్రైవేటు ఆస్పత్రులు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుగా గుర్తింపు
అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్
Posted On:
28 FEB 2021 6:54PM by PIB Hyderabad
ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్దేశిత వయోర్హతలున్న వారికి మార్చి 1, 2021 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 1, 2021 ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పోర్టల్ లో (at www.cowin.gov.in) రిజిస్ర్టేషన్లు ప్రారంభం కానున్నాయి. పౌరులందరూ కోవిన్ 2.0 పోర్టల్ లేదా ఆరోగ్య సేతు వంటి ఇతర ఐటి అప్లికేషన్ల ద్వారా ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా తమ పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సినేషన్ కు అపాయింట్ మెంట్ పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ పిఎంజెఏవై ప్యానెల్ లోని 10 వేలకు పైగా ప్రైవేటు ఆస్పత్రులు, ప్యానెల్ లో స్థానం పొందిన సిజిహెచ్ఎస్ పరిధిలోని 600 పైగా ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్యానెల్ లోని ఇతర ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అధారిటీ (ఎన్ హెచ్ఏ) నిర్వహించిన ఓరియెంటేషన్ వర్క్ షాప్ లో ఈ విషయం తెలియచేశారు. కోవిన్ 2.0 డిజిటల్ వేదికలో సమీకృతం చేసిన కొత్త నిబంధనల విధివిధానాలు కూడా వివరించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుగా (సివిసి) ప్యానెల్ లో స్థానం కల్పించిన ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందిని నేషనల్ హెల్త్ అధారిటీ (ఎన్ హెచ్ఏ) మద్దతులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రాసెస్, వ్యాక్సిన్ వేసిన సమయంలో ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఏర్పడితే వాటికి చికిత్స అందించే విధానాలపై శిక్షణ ఇచ్చారు.
2022 జనవరి 1వ తేదీ నాటికి 60 సంవత్సరాలు, ఆ పైబడిన వయసు వస్తున్న పౌరులు, 2022 జనవరి 1వ తేదీ నాటికి 45 నుంచి 59 సంవత్సరాల వయసు వస్తున్న, అనుబంధంలో చేర్చిన 20 సంక్లిష్ట వ్యాధులతో బాధపడుతున్న వారందరూ రిజిస్టర్ చేసుకునేందుకు అర్హులని ఆ వర్క్ షాప్ లో పాల్గొన్న వారికి వివరించారు. ప్రతీ ఒక్క లబ్ధిదారునికి ప్రతీ ఒక్క డోస్ కు ఒకే ఒక లైవ్ అపాయింట్ మెంట్ ఉంటుంది.అపాయింట్ మెంట్ లభించిన ఏ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ అయినా, ఏ తేదీన అయినా మధ్యాహ్నం 3 గంటలకు మూసి వేస్తారు. ఉదాహరణకి మార్చి 1వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఏ సమయంలో అయినా అందుబాటులో ఉన్నంత మేరకు స్లాట్ లు బుక్ చేసుకోవచ్చు. అలాగే రాబోయే ఏ తేదీకైనా కూడా మార్చి 1వ తేదీన అపాయింట్ మెంట్ పొందవచ్చు. అంతే కాదు తొలి డోస్ పొందిన వ్యాక్సినేషన్ సెంటర్ లోనే అపాయింట్ మెంట్ పొందిన 29వ రోజున రెండో డోస్ కు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా తొలి డోస్ అపాయింట్ మెంట్ రద్దు చేసుకుంటే రెండో డోస్ కూడా రద్దయిపోతుంది.
అర్హులైన వారందరూ తమ మొబైల్ ను ఉపయోగించి కో-విన్ 2.0 పోర్టల్ ద్వారా అంచెలంచెల విధానం కింద పేర్లు నమోదు చేసుకోవాలి. ఏ వ్యక్తి అయినా ఒక మొబైల్ నంబర్ తో నలుగురు లబ్ధిదారులను రిజిస్టర్ చేయవచ్చు. ఒకే మొబైల్ నంబర్ పై రిజిస్టర్ అయిన లబ్ధిదారులందరికీ ఒక్క మొబైల్ నంబర్ మినహా మరేదీ కామన్ గా ఉండదు. ప్రతీ ఒక్క లబ్ధిదారుని ఫొటో ఐడి కార్డ్ వేరుగా ఉండి తీరాలి. ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ కోసం పౌరులు ఈ దిగువ సూచించిన వాటిలో ఏదో ఒక ఫొటో గుర్తింపు పత్రాన్ని అందించాల్సి ఉంటుంది.
1. ఆధార్ కార్డు/ లెటర్
2. ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్)
3. పాస్ పోర్ట్
4. డ్రైవింగ్ లైసెన్స్
5. పాన్ కార్డు
6. ఎన్ పిఆర్ స్మార్ట్ కార్డు
7. ఫొటోగ్రాఫ్ జతపరిచిన పింఛను పత్రం
వ్యాక్సినేషన్ కు పౌరుల రిజిస్ర్టేషన్, అపాయింట్ మెంట్ కు యూజర్ గైడ్ ను కూడా కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ అధారిటీ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడం జరిగింది.
https://www.mohfw.gov.in/pdf/UserManualCitizenRegistration&AppointmentforVaccination.pdf
అన్ని ప్రైవేటు ఆస్పత్రుల జాబితాను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ అధారిటీ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడం జరిగింది. వాటిని ఈ దిగువ లింక్ ద్వారా పొందవచ్చు.
a) https://www.mohfw.gov.in/pdf/CGHSEmphospitals.xlsx
b) https://www.mohfw.gov.in/pdf/PMJAYPRIVATEHOSPITALSCONSOLIDATED.xlsx
అన్ని వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తుంది. రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వాటిని ప్రభుత్వ, ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు (సివిసి) సరఫరా చేస్తాయి. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ లబ్ధిదారులకు ఉచితంగానే వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఒక్కో వ్యక్తి నుంచి ఒక్కో డోస్ కు రూ.250కి మించి (రూ.150 వ్యాక్సిన్ కు, రూ.100 నిర్వహణ వ్యయాలకు) వసూలు చేయకూడదు. ప్రైవేటు ఆస్పత్రులు తమకు కేటాయించిన వ్యాక్సిన్ డోస్ ల సొమ్మును నేషనల్ హెల్త్ అధారిటీ (ఎన్ హెచ్ఏ) ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇతర వెబ్ సైట్లలో కూడా ఈ సొమ్ము జమ చేయడానికి పేమెంట్ గేట్ వేలను ఎన్ హెచ్ఏ అందుబాటులో ఉంచింది.
కేంద్రప్రభుత్వం రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లు...కోవిషీల్డ్, కోవాక్సిన్- హెల్త్ కేర్ సిబ్బంది (హెచ్ సిడబ్ల్యు), ఫ్రంట్ లైన్ వర్కర్లకు (ఎఫ్ఎల్ డబ్ల్యు) ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేసింది. ఆ వ్యాక్సిన్లను తదుపరి ప్రాధాన్యతా బృందం - 60 సంవత్సరాలు పైబడిన వయస్సు గల వారు, జాబితాలోని నిర్దేశిత అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా అందిస్తారు.
వ్యాక్సిన్లు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లకు (సివిసి) తేలిగ్గా సరఫరా చేయడానికి వీలుగా సమీపంలోని శీతలీకరణ కేంద్రాలను కోవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాలతో (ప్రభుత్వ, ప్యానెల్ లో చేర్చిన ప్రైవేటు సెంటర్లు) అనుసంధానం చేసే లింకేజిలు అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.
45-59 సంవత్సరాల మధ్యవయస్కులైన వ్యాక్సిన్ కు అర్హులైన వారిని నిర్ధారించేందుకు సిద్ధం చేసిన అనారోగ్యాల జాబితా
సీరియల్ నంబర్
|
అర్హత
|
01
|
గత ఏడాది కాలంలో ఆస్పత్రిలో చేరడానికి కారణం అయిన హార్ట్ ఫెయిల్యూర్
|
02
|
పోస్ట్ కార్డియాక్ ట్రాన్స్ ప్లాంట్/ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (ఎల్ విఏడి)
|
03
|
సిగ్నిఫికెంట్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ సిస్టోలిక్ డిస్ ఫంక్షన్ (ఎల్ విఇఎఫ్ <40%)
|
04
|
ఒక మోస్తరు లేదా తీవ్ర వాల్వులార్ హార్ట్ డిసీజ్
|
05
|
తీవ్ర పిఏహెచ్ లేదా ఇడియోపతిక్ పిఏహెచ్ తో కూడిన కంజెనిటల్ హార్ట్ డిసీజ్
|
06
|
గతంలో సిఏబిజి/ పిటిసిఏ/ ఎంఐతో కూడిన కరోనరీ ఆర్టరీ డిసీజ్ మరియు చికిత్స పొందుతున్న రక్తపోటు/ మధుమేహ రోగులు
|
07
|
యాంజినా మరియు చికిత్స పొందుతున్న రక్తపోటు/ మధుమేహ రోగులు
|
08
|
సిటి/ఎంఆర్ ఐ డాక్యుమెంటెడ్ స్ర్టోక్ మరియు చికిత్స పొందుతున్న రక్తపోటు/ మధుమేహ రోగులు
|
09
|
పల్మోనరీ ఆర్టరీ రక్తపోటు మరియు చికిత్స పొందుతున్న రక్తపోటు/ మధుమేహ రోగులు
|
10
|
చికిత్స పొందుతున్న మధుమేహ రోగులు (10 సంవత్సరాలకు పైబడి బాధితులు లేదా ఆరోగ్య సంక్లిష్టతలున్న వారు) మరియు రక్తపోటు రోగులు
|
11
|
కిడ్నీ/ లివర్/ హెమాటోపియోటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ : ఇప్పటికే జరిగిన వారు/ వెయిట్ లిస్ట్ లో ఉన్న వారు
|
12
|
మూత్రపిండ వ్యాధి చివరి దశ డయాలసిస్/ సిఏపిడి బాధితులు
|
13
|
దీర్ఘకాలంగా ఓరల్ కార్టికో స్టెరాయిడ్స్/ ఇమ్యునో సప్రిసెంట్ ఔషధాలు వాడుతున్న వారు
|
14
|
డీ కాంపెన్సేటెడ్ సిరోసిస్
|
15
|
తీవ్రతతో కూడిన శ్వాసకోశ వ్యాధితో గత రెండేళ్ల కాలంలో ఆస్పత్రిలో చికిత్స పొందిన వారు/ ఫెవి <50%
|
16
|
లింఫోమా/ లుకేమియా/ మైలోమా
|
17
|
2020 జూలై 1వ తేదీ తర్వాత ఏ తరహా క్యాన్సర్ బాధపడుతున్న వారుగా డయాగ్నసిస్ జరిగిన వారు లేదా ప్రస్తుతం క్యాన్సర్ థెరపీ పొందుతున్న వారు
|
18
|
సికిల్ సెల్ వ్యాధి/ బోన్ మారో ఫెయిల్యూర్/ ఎప్లాస్టిక్ ఎనీమియా/ తలసేమియా మేజర్
|
19
|
ప్రైమరీ ఇమ్యునోడెఫిషియెన్సీ డిసీజ్/ హెచ్ఐవి ఇన్ఫెక్షన్
|
20
|
మేథస్సు బాధితులు/ మస్కులర్ డిస్ర్టోఫీ/ శ్వాసకోశ వ్యాధి ప్రభావితం అయిన యాసిడ్ దాడి బాధితులు/ నిరంతరం కనిపెట్టుకుని ఉండాల్సిన తీవ్రతతో కూడిన వైకల్యాలున్నవారు/ మూగ, చెవుడుతో కూడిన బహుళ వైకల్యాలున్న వారు
|
***
(Release ID: 1701879)
Visitor Counter : 310