ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ లో కొనసాగుతున్న కొత్త కోవిడ్ కేసుల పెరుగుదల

వయసు ఆధారంగా తరువాత దశ టీకాలు నేడు ప్రారంభం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు సున్నా

Posted On: 01 MAR 2021 12:16PM by PIB Hyderabad

అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆరు రాష్ట్రాలు- మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్. ఈ రాష్ట్రాల్లో గత 24 గంటలలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. గత 24 గంటలలో 15,510 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్టలో అత్యధికంగా 8,293 కేసులు, కేరళలో 3,254. పంజాబ్ లో 579 కేసులు వచ్చాయి. కొత్త కేసులలో 87.25% ఈ ఆరు రాష్ట్రాలవే.

 

 

ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. నిఘా పెంచటం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలని రాష్టాలకు సూచించింది.  సమర్థంగా పరీక్షలు జరపటం, సమగ్రంగా ఆనవాలు పట్టి వ్యాధి సోకినవారిని ఐసొలేషన్ కు తరలించటం, చికిత్స అందించటం మీద దృష్టి సారించాలని కోరింది. రోజువారీ కేసుల పెరుగుదల ఎనిమిది రాష్ట్రాల్లో నమోదైంది.  

 

 

 

 

ఈరోజుకు భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,68,627 గా నమోదైంది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.52%. చికిత్సలో ఉన్నవారిలో 84% మంది కేవలం ఐదు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలోనే దేశంలోని మొత్తం

కేసుల్లో 46.39%  నమోదు కాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 29.49% కేసులు వచ్చాయి.

 

21 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో 1000 మంది లోపు మాత్రమే చికిత్సలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్ లో  ఒక్క కేసుకూడా

గత 24 గంటలలో చికిత్సలో లేదు.

 

 

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య వెయ్యికి పైబడ్డవి 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. 10 వేలకంటే ఎక్కువ నమోదైన రాష్ట్రాలు మహారాష్ట్ర, కేరళ మాత్రమే. మిగిలిన 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య

1,000-10,000 మధ్య ఉంది.

 

 

 

ఇప్పటివరకు 1,43,01,266 డోసుల కోవిడ్ టీకాల పంపిణీ జరిగింది. ఇందుకోసం మొత్తం  2,92,312 శిబిరాలు నిర్వహించారు. ఇందులో 66,69,985 మంది మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది, 24,56,191 మంది రెండో డోస్ ఆరోగ్య సిబ్బంది,  51,75,090 మంది మొదటి డోస్ కోవిడ్ యోధులు ఉన్నారు. తరువాత దశ టీకాల కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఇందులో 60 ఏళ్ళు పైబడ్డవారికి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలు ఇస్తారు. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవటానికి ఒక ప్రక్రియ

రూపొందించారు. స్వయంగా ఎవరికి వారే ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీకాల ప్రదేశంలో కూడా రిజిస్టర్ చేసుకునే సౌకర్యంఉంది. ఈ పద్ధతి చాలా సులభతరం చేశారు.  రిజిస్టర్ చేసుకొని టీకా కోసం అపాయింట్ మెంట్ తీసుకోవాల్సినవారి కోసం

రూపొందించిన మార్గదర్శకాలను ఈ దిగువ లింక్ లో చూడవచ్చు.

https://www.mohfw.gov.in/pdf/UserManualCitizenRegistration&AppointmentforVaccination.pdf

 

ఈ ప్రైవేట్ ఆస్పత్రుల జాబితా మొత్తాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖవారి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. అది ఇక్కడ చూడవచ్చు:
ఎ) https://www.mohfw.gov.in/pdf/CGHSEmphospitals.xlsx           

బి) https://www.mohfw.gov.in/pdf/PMJAYPRIVATEHOSPITALSCONSOLIDATED.xlsx

ఇప్పటివరకు 1,07,86,457 మంది కోవిడ్ బారి నుంచి బైటపడ్డారు. గత 24 గంటలలో 11,288 మంది  కోలుకున్నారు. తాజాగా కోలుకున్నవారిలో 85.07% మంది కేవలం ఆరు రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యారు.  కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 4,333 మంది కోలుకోగా మహారాష్ట్రలో  3,753 మంది, తమిళనాడులో  490 మంది కోలుకున్నారు.

 

 

గత 24 గంటలలో 106 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో  86.79%  మరణాలు కేవలం 5 రాష్ట్రాలకు చెందినవే. మహారాష్టలో అత్యధికంగా 62 మంది చనిపోగా కేరళలో 15 మంది, పంజాబ్ లో ఏడుగురు చనిపోయారు.

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కానివి 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. అవి: తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, మణిపూర్, సిక్కిం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, లక్షదీవులు, మేఘాలయ, లద్దాఖ్, అండమాన్-నికోబార్ దీవులు,

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి

                                                                                                                                               

****


(Release ID: 1701867) Visitor Counter : 224