హోం మంత్రిత్వ శాఖ

భారత్ బాంగ్లాదేశ్ ల మధ్య 19వ హోం కార్యదర్శుల స్థాయి సమావేశం

Posted On: 27 FEB 2021 2:06PM by PIB Hyderabad

భారత్ బాంగ్లాదేశ్ ల మధ్య హోం కార్యదర్శుల స్థాయి సమావేశం ఈ రోజు వర్చ్యువల్ విధానంలో జరిగింది. బంగ్లాదేశ్  స్వేచ్ఛ కల్పించడానికి జరిగిన యుద్ధం 50 సంవత్సరాలు పూర్తిచేసుకొని రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయిన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. భారతదేశ బృందానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, బాంగ్లాదేశ్ బృందానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ పబ్లిక్ సెక్యూరిటీ డివిజన్ సీనియర్ కార్యదర్శి  ముస్తఫా కమల్ ఉద్దీన్ నాయకత్వం వహించారు. 

ద్వైపాక్షిక సంబంధాలకు భారత్, బంగ్లాదేశ్లు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకుని భద్రత మరియు సరిహద్దులకు సంబందించిన అంశాలపై మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో రెండు దేశాల కార్యదర్శులు నిర్ణయించారు. తమ దేశాల భూభాగాలను ఏ ఒక్క దేశం ప్రయాజనాలు దెబ్బతినే విధంగా ఉపయోగించడానికి అంగీకరించరాదని సమావేశంలో నిర్ణయించారు. 

రెండుదేశాల ప్రధానమంత్రులు అంగీకరించిన విధంగా భారత్, బంగ్లా సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ ను త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకొనే అంశంపై సమావేశంలో చర్చించారు.

ఉగ్రవాద సమస్య పరిష్కారం, ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలసి అమలు చేస్తున్న చర్యలపై సమావేశంలో కార్యదర్శులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనధికారికంగా సరిహద్దులను దాటకుండా చూడడానికి రూపొందిన  సమన్వయ సరిహద్దు నిర్వహణ ప్రణాళిక (సిబిఎంపి) అమలు జరుగుతున్న తీరుపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. 

2019లో హోం మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 2021 జనవరిలో పోలీస్ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరగడంపట్ల కూడా కార్యదర్శుల స్థాయి సమావేశం సంతృప్తి వ్యక్తం 

 నకిలీ నోట్ల చెలామణిని, వస్తువుల అక్రమ రవాణాని అరికట్టడానికి మరింత సహకారంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

భద్రత సంస్థల సామర్ధ్యాన్ని పెంపొందించడానికి తమ దేశానికి భారత్ అందిస్తున్న సహకారానికి బంగ్లాదేశ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. 

భద్రత, సరిహద్దు అంశాలపై సమగ్రంగా చర్చించిన సమావేశం రెండు దేశాల ప్రధానమంత్రుల ఆశయాలకు అనుగుణంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

***


(Release ID: 1701397) Visitor Counter : 253