ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకాల 42వ రోజు సమాచారం
ఇప్పటిదాకా 1.37 కోట్ల కోవిడ్ టీకా డోసుల పంపిణీ ఈరోజు సాయంత్రం 6 వరకు 2.84 లక్షల టీకాలు ఈరోజు 1,71,089 మంది ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్ టీకా
Posted On:
26 FEB 2021 8:19PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సంఖ్య ఈ రోజుకు 1.37కోట్లు దాటింది. మొత్తం 2,89,320 శిబిరాల ద్వారా ఈ సాయంత్రం 6 గంటలకు 1,37,56,940 టీకా డోసుల పంపిణీజరిగింది. ఇందులో 66,37,049 (76.6%) మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, 22,04,083 (62.9%) మంది రెండో డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా 49,15,808 (47.7%) మంది కోవిడ్ యోధులు ఉన్నారు. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం జనవరి 16న మొదలు కాగా కోవిడ్ యోధులకు ఫిబ్రవరి 2న మొదలైంది. .
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
మొదటి డోస్
|
66, 37, 049 (76.6%)
|
22, 04, 083 (62.9%)
|
49, 15, 808 (47.7%)
|
కోవిడ్ టీకాలు మొదలుపెట్టిన 42వ రోజైన ఈరోజు సాయంత్రం 6 గంటలవరకు 2,84,297 టీకా డోసులిచ్చారు. అందులో 1,13,208 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 1,71,089 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది. సాయంత్రం 6 వరకు 10,405 శిబిరాలు జరిగాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈరోజు టీకాలు ఇచ్చారు.
క్రమసంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
మొత్తం డోసులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
6,127
|
2,413
|
8,540
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
5,15,007
|
1,34,516
|
6,49,523
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
24,658
|
6,700
|
31,358
|
4
|
అస్సాం
|
1,92,301
|
23,981
|
2,16,282
|
5
|
బీహార్
|
5,59,203
|
79,142
|
6,38,345
|
6
|
చండీగఢ్
|
20,890
|
1,712
|
22,602
|
7
|
చత్తీస్ గఢ్
|
3,76,475
|
50,557
|
4,27,032
|
8
|
దాద్రా-నాగర్ హవేలి
|
5,252
|
337
|
5,589
|
9
|
డామన్, డయ్యూ
|
2,151
|
254
|
2,405
|
10
|
ఢిల్లీ
|
3,64,032
|
34,781
|
3,98,813
|
11
|
గోవా
|
18,722
|
2,072
|
20,794
|
12
|
గుజరాత్
|
8,33,340
|
1,60,294
|
9,93,634
|
13
|
హర్యానా
|
2,21,841
|
71,983
|
2,93,824
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1,00,723
|
17,041
|
1,17,764
|
15
|
జమ్మూ-కశ్మీర్
|
2,40,817
|
16,255
|
2,57,072
|
16
|
జార్ఖండ్
|
2,83,808
|
23,597
|
3,07,405
|
17
|
కర్నాటక
|
6,02,967
|
2,07,700
|
8,10,667
|
18
|
కేరళ
|
4,46,072
|
91,729
|
5,37,801
|
19
|
లద్దాఖ్
|
8,753
|
748
|
9,501
|
20
|
లక్షదీవులు
|
2,368
|
710
|
3,078
|
21
|
మధ్యప్రదేశ్
|
6,49,377
|
1,31,088
|
7,80,465
|
22
|
మహారాష్ట్ర
|
10,20,108
|
1,40,372
|
11,60,480
|
23
|
మణిపూర్
|
51,109
|
2,519
|
53,628
|
24
|
మేఘాలయ
|
28,860
|
1,350
|
30,210
|
25
|
మిజోరం
|
21,772
|
5,635
|
27,407
|
26
|
నాగాలాండ్
|
29,463
|
5,495
|
34,958
|
27
|
ఒడిశా
|
4,58,368
|
1,54,434
|
6,12,802
|
28
|
పుదుచ్చేరి
|
9,455
|
1,024
|
10,479
|
29
|
పంజాబ్
|
1,54,197
|
36,254
|
1,90,451
|
30
|
రాజస్థాన్
|
7,97,900
|
1,52,486
|
9,50,386
|
31
|
సిక్కిం
|
16,950
|
1,361
|
18,311
|
32
|
తమిళనాడు
|
3,79,563
|
51,676
|
4,31,239
|
33
|
తెలంగాణ
|
2,84,058
|
1,14,020
|
3,98,078
|
34
|
త్రిపుర
|
89,395
|
21,349
|
1,10,744
|
35
|
ఉత్తరప్రదేశ్
|
11,70,022
|
2,74,151
|
14,44,173
|
36
|
ఉత్తరాఖండ్
|
1,40,671
|
14,323
|
1,54,994
|
37
|
పశ్చిమబెంగాల్
|
9,02,528
|
1,29,100
|
10,31,628
|
38
|
ఇతరములు
|
5,23,554
|
40,924
|
5,64,478
|
|
మొత్తం
|
1,15,52,857
|
22,04,083
|
1,37,56,940
|
2021 ఫిబ్రవరి 26న అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యక్రమ నిర్వాహకులకు శిక్షణాకార్యక్రమాలు జరిగాయి. కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో తరువాత దశ అయిన 60 ఏళ్ళు పైబడిన, ఇతర దీర్ఘకాల వ్యాధులతో 45 ఏళ్ళు పైబడిన వారిని కోవిన్ పోర్టల్ లో నమోదు చేయటం మీద వారికి వివరించారు.
రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులలో మొదటి డోస్ పూర్తి చేసుకున్నవారు 75% పైగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరు ఉన్నాయి. ఇవి దాద్రా-నాగర్ హవేలి, గుజరాత్, లక్షదీవులు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర.
రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 80% కు పైగా మొదటి డోస్ టీకాలు వేసుకున్న వారు ఏడు రాష్ట్రాలలో ఉన్నారు. అవి: బీహార్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ గఢ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్
మరోవైపు 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరోగ్య సిబ్బందిలో రిజిస్టర్ చేసుకున్న వారిలో 50% కంటే తక్కువ మంది మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అవి నాగాలాండ్, పంజాబ్, చండీగఢ్, పుదుచ్చేరి.
ఏడు రాష్ట్రాలలో రిజిస్టర్ చేసుకున్న కోవిడ్ యోధులలో 60% కంటే ఎక్కువమంది మొదటి డోస్ తీసుకున్నారు. అవి: ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్.
మరోవైపు ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదు చేసుకున్న కోవిడ్ యోధులలో 30% కంటే తక్కువ మంది మొదటి డోస్ తీసుకున్నారు. అవి: అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, తమిళనాడు, అండమాన్-నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, కేరళ, పుదుచ్చేరి
5 రాష్ట్రాలలో అత్యధికంగా టీకాలు వేశారు. అవి ఉత్తర ప్రదేశ్ (73,434), పశ్చిమ బెంగాల్ (38,522), గుజరాత్ (35,540), కర్నాటక (21,459) మహారాష్ట్ర (18,190).
మొత్తం ఇప్పటిదాకా 51 మంది ఆస్పత్రిలో చేరారు. వీరు టీకాలు తీసుకున్న మొత్తం సంఖ్యలో 0.0004%. ఈరోజు వరకు ఆస్పత్రిలో చేరిన 51 మందిలో 27 మందిని చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. 23 మంది ప్రాణాలు కోల్పోగా ఒకరు ఇంకా చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో కొత్తగా ఎవరూ ఆస్పత్రిలో చేరలేదు.
ఇప్పటిదాకా మొత్తం 46 మరణాలు నమోదయ్యాయి. ఇవి మొత్తం కోవిడ్ టీకాలలో 0.0004% మాత్రమే. 46 మందిలో 23 మంది ఆస్పత్రిలో చనిపోగా 23 మంది ఆస్పత్రి వెలుపల చనిపోయారు. ఇప్పటిదాకా కోవిడ్ సంబంధమైన తీవ్రమైన ఘటన గాని, మరణం గాని నమోదు కాలేదు.
గత 24 గంటలలో ఒక మరణం నమోదైంది. .బీహార్ లోని భీఓజ పూర్ కి చెందిన 41 ఏళ్ళ పురుషుడు టీకా టీసుకున్న 15 రోజులకు చనిపోయాడు. హృదయ సంబంధమైన వ్యాధి కారణంగా చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది.
***
(Release ID: 1701257)
|