భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చెన్నైలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క దక్షిణ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు

Posted On: 26 FEB 2021 1:30PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు వర్చువల్‌ విధానం చెన్నైలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని (సౌత్) కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ప్రారంభించారు.

ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ వర్మ, సిసిఐ చైర్‌పర్సన్ డాక్టర్ సంగీత వర్మ, శ్రీ బిఎస్ బిష్ణోయ్, సిసిఐ సభ్యులు, సిసిఐ కార్యదర్శి శ్రీ ఎస్.ఘోష్‌ దస్తీదర్ మరియు సిసిఐ అధికారులు పాల్గొన్నారు.

సిసిఐ చైర్‌పర్సన్ శ్రీ అశోక్ కుమార్ గుప్తా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు స్వాగతం పలికారు. మరియు సిసిఐ చెన్నై కార్యాలయాన్ని ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చెన్నైలోని ప్రాంతీయ కార్యాలయం సిసిఐ యొక్క ప్రాంతీయ ఉనికిని పెంపొందించే దశ అని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో పోటీని పెంపొందించడంలో రాష్ట్రాలు ముఖ్యమైన వాటాదారులుగా ఉండటంతో ఫెడరల్ రెగ్యులేటర్‌గా తన విధులను నెరవేర్చాలని ఆయన ఉద్ఘాటించారు.

చెన్నైలోని సిసిఐ కార్యాలయం ఢిల్లీ కార్యాలయంతో సమన్వయం చేసుకోవడంతో పాటు దర్యాప్తు, న్యాయవాద పనితీరును సులభతరం చేయడానికి ఒక కార్యాలయంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతీయ కార్యాలయం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి మరియు లక్షద్వీప్ అవసరాలను తీర్చనుంది.

సిసిఐ ప్రయత్నాల పట్ల ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరియు ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి ప్రయత్నాలలో ఫెసిలిటేటర్గా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆర్థిక మంత్రి, సహాయమంత్రి మరియు ఎంసీఏ కార్యదర్శిలకు సిసిఐ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు.

***


(Release ID: 1701105) Visitor Counter : 264