ప్రధాన మంత్రి కార్యాలయం
ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీతకాల ఆట ల రెండో సంచిక ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
ఇటీవలి జాతీయ విద్య విధానం లో క్రీడల కు ఒక గర్వకారకమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది: ప్రధాన మంత్రి
యువ క్రీడాకారులు వారు ‘ఆత్మనిర్భర్ భారత్’ కు బ్రాండ్ ఎంబాసడర్ లు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని ఆయన ఉద్బోధించారు
Posted On:
26 FEB 2021 12:36PM by PIB Hyderabad
ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీతకాల ఆట ల రెండో సంచిక ప్రారంభ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఖేలో ఇండియా శీతకాల ఆటల తాలూకు రెండో సంచిక శుక్రవారం నుంచి మొదలవుతోందన్నారు. శీతకాల ఆటల లో భారతదేశం ప్రభావవంతమైనటువంటి ఉనికి ని చాటుకోవడం ద్వారా జమ్ము, కశ్మీర్ ను ఈ విభాగం లో ఒక ప్రధాన కేంద్రం గా మలచే విషయం లో ఇది ఒక పెద్ద అడుగు గా ఉంది అని ఆయన అన్నారు. జమ్ము- కశ్మీర్ క్రీడాకారుల కు, అలాగే దేశమంతటి నుంచి తరలివచ్చిన క్రీడాకారుల కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసి,ఈ శీతకాల ఆటల లో పాల్గొంటున్న క్రీడాకారుల సంఖ్య రెండింతలు అయిందని, ఇది శీతకాల ఆటలంటే ఉత్సుకత పెరుగుతూ ఉండటాన్ని చాటుతోందన్నారు. ఈ శీతకాల ఆటల పోటీల లో సంపాదించే అనుభవం శీతకాల ఒలింపిక్స్ లో పాలుపంచుకొనేటప్పుడు క్రీడాకారులకు సహాయకారి అవుతుందని ఆయన అన్నారు. జమ్ము- కశ్మీర్ లో ఒక కొత్త స్పోర్టింగ్ ఇకోసిస్టమ్ ను అభివృద్ధి పరచడం లో శీతకాల ఆట లు తోడ్పడుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం జమ్ము- కశ్మీర్ పర్యటక రంగం లో ఒక కొత్త స్ఫూర్తి ని, ఉత్సుకత ను నింపుతుందని ఆయన చెప్పారు. ప్రపంచం లోని దేశాలు తమ మానవ వనరుల శక్తి ని చాటుకొనే ఒక రంగం గా క్రీడ లు రూపుదాల్చాయి అని ఆయన అన్నారు.
క్రీడల కు ఒక ప్రపంచ పార్శ్వం అంటూ ఉందని, ఈ దృష్టి కోణమే స్పోర్ట్స్ ఇకోసిస్టమ్ లో ఇటీవలి సంస్కరణ లకు దారి ని చూపుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఖేలో ఇండియా ప్రచార ఉద్యమం మొదలుకొని ఒలింపిక్ పోడియమ్ స్టేడియమ్ వరకు ఒక సంపూర్ణ వైఖరంటూ ఉంది అని ఆయన చెప్పారు. క్రీడాకారుల లో ఉన్న ప్రతిభ ను గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ను గుర్తించి, ఆ ప్రతిభావంతులను అత్యున్నత ప్రపంచ వేదిక కు తీసుకు పోయే వరకు క్రీడల కు సంబంధించిన వృత్తి నిపుణుల కు అండదండల ను అందించడం జరుగుతోందన్నారు. ప్రతిభ ను గుర్తించడం మొదలుకొని జట్టు లోకి ఎంపిక వరకు, పారదర్శకత్వం అనేదే ప్రభుత్వ ప్రాధాన్యం గా ఉంది అని ఆయన చెప్పారు. క్రీడాకారుల కు గౌరవ పరిరక్షణ, వారు అందించిన తోడ్పాటు కు గుర్తింపు లభించడం కోసం అన్నింటా పూచీ పడటం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.
ఇటీవలి జాతీయ విద్య విధానం లో క్రీడల కు గర్వకారకమైనటువంటి ఒక స్థానాన్ని కట్టబెట్టడం జరిగిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. క్రీడల ను ఇదివరకు పాఠ్య క్రమేతర కార్యకలాపం గా పరిగణించే వారు, ఇప్పుడు దీనిని బోధనాంశాల లో ఒక భాగం గా ఎంచుతున్నారు, క్రీడల లో సాధించే గ్రేడుల ను బాలల విద్య లో ఓ అంశం గా లెక్కపెట్టడం జరుతుంది అని ఆయన వివరించారు. క్రీడల కోసం ఉన్నత విద్య సంస్థల ను, క్రీడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరుగుతోందని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ సైన్సెస్ ను, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ను పాఠశాల స్థాయి కి తీసుకుపోవలసిన అవసరం ఉందని, అలా చేసినందువల్ల యువత జీవనోపాధి మార్గం తాలూకు అవకాశాలు మెరుగుపడతాయని, క్రీడా సంబంధిత ఆర్థిక వ్యవస్థ లో భారతదేశం ఉనికి విస్తరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
యువ క్రీడాకారులు వారు ‘ఆత్మనిర్భర్ భారత్’ కు బ్రాండ్ ఎంబాసడర్ లు అనే సంగతి ని గుర్తుంచుకోవాలి అని శ్రీ నరేంద్ర మోదీ ఉద్బోధించారు. భారతదేశాన్ని ప్రపంచం ఆట మైదానం లో భారతదేశీయుల ప్రదర్శన ద్వారానే మదింపు చేస్తుంది అని ప్రధాన మంత్రి చెప్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 1701064)
Visitor Counter : 239
Read this release in:
Urdu
,
Tamil
,
Kannada
,
Assamese
,
Manipuri
,
Odia
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Malayalam