ప్రధాన మంత్రి కార్యాలయం
కోయంబత్తూరు లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
నౌకాశ్రయాల కు ప్రముఖ పాత్ర ను కట్టబెడుతూ అభివృద్ధిని సాధించడం పట్ల భారతదేశానికి ఉన్న నిబద్ధత ను ‘సాగర్ మాల పథకం’ ద్వారా గమనించవచ్చు: ప్రధాన మంత్రి
ఈ రోజున ప్రారంభించిన అభివృద్ధి పనులు కోయంబత్తూరు తో పాటు, యావత్తు తమిళ నాడు కు మేలు చేస్తాయి: ప్రధాన మంత్రి
Posted On:
25 FEB 2021 5:59PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1000 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన నైవేలీ నూతన థర్మల్ పవర్ ప్రాజెక్టు ను, ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకాన్ని దేశానికి అంకితం చేశారు. లోయర్ భవానీ ప్రాజెక్టు సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ పనులకు, వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన గ్రిడ్ సంధానిత క్షేత్ర ఆధారితమైన సోలర్ పవర్ ప్లాంటు రూపకల్పన, స్థాపన, ప్రారంభం తాలూకు పనుల కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తొమ్మిది స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్స్ (ఐసిసిసి) ల అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో కోరమ్ పల్లమ్ బ్రిడ్జ్ తాలూకు 8- దోవల ను, రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఒబి) ని, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్’ లో భాగం గా నిర్మించిన అద్దె ఇళ్ళ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి, తమిళ నాడు ఉప ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశీ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కోయంబత్తూరు ను పరిశ్రమ, నూతన ఆవిష్కరణ ల నగరంగా అభివర్ణించారు. ఈ రోజు న ప్రారంభించిన అభివృద్ధి పనులు కోయంబత్తూరు కు, యావత్తు తమిళ నాడుకు లబ్ధి ని చేకూరుస్తాయి అని ఆయన అన్నారు.
భవానీ సాగర్ ఆనకట్ట ఆధునీకరణ ద్వారా అనేక జిల్లాల లో 2 లక్షల ఎకరాల కు పైగా భూములు సాగునీటి ని అందుకొనే కారణంగా రైతులు లాభపడతారని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పారిశ్రామిక వృద్ధి కి ప్రధానమైన తోడ్పాటు ను అందిస్తున్నందుకుగాను తమిళ నాడు ను ఆయన ప్రశంసించారు. పారిశ్రామిక వృద్ధి తాలూకు మౌలిక అవసరాల లో విద్యుత్తు సరఫరా అనేది ఒక మౌలిక అవసరం అయినందువల్ల అనేక పెద్ద విద్యుత్తు ప్రాజెక్టుల ప్రారంభం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 709 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్తు పథకం పూర్తిగా దేశీయం గా రూపొందిందని, ఈ ప్రాజెక్టు వ్యయం 3,000 కోట్ల రూపాయల కు పైగానే ఉందని ఆయన అన్నారు. 7,800 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన మరొక 1000 ఎండబ్ల్యు సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా తమిళ నాడు కు ఎంతో ఉపయోగం ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్తు లో 65 శాతానికి పైగా విద్యుత్తు ను తమిళ నాడు కు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
వి.ఒ. చిదంబరనార్ పోర్టు , తూత్తుకూడి లకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించిన క్రమం లో మాట్లాడుతూ, తమిళ నాడు కు సముద్ర సంబంధిత వ్యాపారం లో, నౌకాశ్రయాలు ప్రధాన పాత్ర ను పోషిస్తున్న అభివృద్ధి ప్రక్రియ లో ఒక గొప్ప చరిత్ర అంటూ ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు న ప్రారంభించిన పథకాలు ఈ నౌకాశ్రయం లో ఓడ నుంచి సరుకుల ను దింపే, ఓడ లోకి సరుకుల ను నింపే సామర్ధ్యం మరింత అధికం కానుందని, అంతేకాకుండా ఈ కార్యక్రమం పర్యావరణానికి మైత్రీపూర్వకం గా కూడా రూపుదాల్చింది అని ఆయన వివరించారు. తగిన వనరులు ఉన్నటువంటి నౌకాశ్రయాలు భారతదేశం ‘ఆత్మనిర్భర్’ గా మారడానికి తోడ్పడుతాయని, లాజిస్టిక్స్ పరంగా, వ్యాపారం పరంగా భారత్ ఒక గ్లోబల్ హబ్ గా ఎదిగేందుకు సైతం అవి దోహదపడుతాయని ఆయన అన్నారు. మహా స్వాతంత్య్ర యోధుడు విఒసి గారికి శ్రీ మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘ఒక హుషారైన భారతదేశ శిప్పింగ్ పరిశ్రమ తో పాటు సముద్ర సంబంధిత అభివృద్ధి చోటు చేసుకోవాలి అంటూ ఆయన కన్న కలలు మనకు గొప్ప ప్రేరణ ను అందిస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వి.ఒ.సి పోర్టు గ్రిడ్ కు సంధానం అయిన 5 ఎండబ్ల్యు సామర్ధ్యం కలిగిన క్షేత్ర ఆధారిత సోలర్ పవర్ ప్లాంటు ను 20 కోట్ల రూపాయల వ్యయం తో చేపట్టినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 140 కెడబ్ల్యు సామర్ధ్యం కలిగిన రూఫ్ టాప్ సోలర్ ప్రాజెక్టు పనులు పురోగమిస్తున్నాయని తెలిపారు. దీనిని ‘ఊర్జా ఆత్మనిర్భరత’ (శక్తి రంగం లో స్వయంసమృద్ధి) కి ఒక ఉదాహరణ గా ఆయన పేర్కొన్నారు.
నౌకాశ్రయాల కు పెద్దపీట వేస్తూ అభివృద్ధి ని సాధించాలన్న భారత ప్రభుత్వ వచన బద్ధత ను ‘సాగర మాల పథకం’ అమలు ద్వారా గ్రహించవచ్చని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. 2015- 2035 సంవత్సరాల మధ్య కాలం లో అమలు చేయడానికి గాను దాదాపు 575 ప్రాజెక్టుల ను గుర్తించడం జరిగిందని, వీటికి మొత్తం 6 లక్షల కోట్ల రూపాయల కు పైగా వ్యయమవుతుందని ఆయన వివరించారు. ఈ కృషి లో నౌకశ్రయాల ఆధునీకరణ, కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి, నౌకాశ్రయాల సంధానాన్ని మెరుగు పరచడం, నౌకాశ్రయాల కు పెద్ద పీట వేస్తూ పారిశ్రామికీకరణ ను చేపట్టడం, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వంటివి భాగం గా ఉన్నాయన్నారు. చెన్నై లోని శ్రీ పెరంబదూర్ సమీపం లో గల మాప్పేడు లో ఒక కొత్త మల్టి మాడల్ లాజిస్టిక్స్ పార్కు ను త్వరలోనే ప్రారంభించుకోనున్నామని ఆయన తెలిపారు. ‘సాగర్ మాల కార్యక్రమం’ లో భాగం గా కోరమ్ పల్లమ్ బ్రిడ్జి ని 8 దోవ లు కలిగింది గా విస్తరించే పని ని సైతం చేపట్టడమైందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు నౌకాశ్రయం నుంచి ఎలాంటి రద్దీ కి తావు ఉండని విధం గా, నిరంతరాయమైన రాక పోకల కు మార్గాన్ని సుగమం చేయడం ఒక్కటే కాకుండా ఓడ సరుకుల ను తరలించేందుకు పట్టే కాలాన్ని మరింతగా తగ్గించగలదని శ్రీ మోదీ వివరించారు.
ప్రతి ఒక్క వ్యక్తి గౌరవాని కి పూచీ పడటం అనేది అభివృద్ధి కి కీలకం గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘గౌరవం దక్కేటట్టు చూసే మౌలిక పద్ధతులలో ప్రతి ఒక్కరి కి ఆశ్రయాన్ని కల్పించడం అనేది ఒకటి గా ఉంది. మన ప్రజల కలల కు, ఆకాంక్షల కు రెక్కలు తొడగటం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ను మొదలుపెట్టడం జరిగింది’’ అని ఆయన అన్నారు. అనేక ప్రాంతాల లో నిర్మాణం పూర్తి అయిన 4,144 అద్దె ఇళ్ల ను ప్రారంభిస్తున్నందుకు, తమిళ నాడు అంతటా స్మార్ట్ సిటీస్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్ లకు శంకుస్థాపన చేస్తున్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 332 కోట్ల రూపాయలు అని, ఈ గృహాల ను స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడచిన తరువాత సైతం తల దాచుకోవడానికి ఇల్లు అంటూ లేని వారికి అప్పగించడం జరుగుతుందని కూడా ఆయన అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్ లు ఆయా నగరాల లో వివిధ సేవలను నిర్వహించేందుకు వివేకయుతమైనటువంటి పరిష్కారాలను ఐటీ దన్ను తో ఒకే చోటు లో అందిస్తాయని ఆయన వివరించారు.
***
(Release ID: 1700866)
Visitor Counter : 236
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada