ప్రధాన మంత్రి కార్యాలయం

జె. జ‌య‌ల‌లిత జ‌యంతి నాడు ఆమె ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 24 FEB 2021 10:46AM by PIB Hyderabad

ఈ రోజు న జె. జ‌య‌ల‌లిత జ‌యంతి కావడం తో  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సందర్భం లో ఆమె ను స్మ‌రించుకొన్నారు.

‘‘జ‌య‌లలిత గారిని ఆమె జ‌యంతి నాడు స్మ‌రించుకొంటున్నాను.  ఆమె అనుస‌రించినటువంటి ప్ర‌జానుకూల విధానాల కు గాను మరియు అణ‌చివేత కు లోనైన వ‌ర్గాల‌ వారికి సాధికారిత ను క‌ల్పించ‌డానికి ఆమె చేసిన ప్ర‌య‌త్నాల కు గాను ఆమె ను విశాల జ‌నబాహుళ్యం అభిమానిస్తారు.  ఆమె మ‌న నారీశ‌క్తి కి సాధికారిత ను కల్పించడం కోసం కూడా గుర్తుంచుకోదగ్గ  ప్ర‌య‌త్నాల‌ ను చేశారు.  ఆమె తో అనేక సార్లు నేను జరిపిన భేటీలను నేను ఎల్ల‌ప్ప‌టికీ మ‌ది లో ప‌దిలంగా అట్టిపెట్టుకొంటాను’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

***


(Release ID: 1700415) Visitor Counter : 122