ప్రధాన మంత్రి కార్యాలయం
రెండు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న పిఎం-కిసాన్ పథకం
మన రైతుల ఉద్వేగం మరియు గట్టి పట్టుదల ప్రేరణదాయకాలు అని పేర్కొన్న ప్రధాన మంత్రి
ఎమ్ఎస్‌పి లో ఒక చరిత్రాత్మకమైన వృద్ధి ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం: ప్రధాన మంత్రి
Posted On:
24 FEB 2021 10:54AM by PIB Hyderabad
రైతుల కు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని, సమృద్ధి ని అందించడానికి ప్రారంభించిన పిఎమ్-కిసాన్ పథకం నేటి తో రెండు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొంది.
‘‘మన దేశ ప్రజల కు ఆహారాన్ని అందించడానికి రాత్రింబగళ్ళు కఠోర శ్రమ చేస్తున్న రైతుల కు ఒక గౌరవభరిత జీవనాన్ని అందించేటట్లు చూడడం తో పాటు వారి సమృద్ధి కి పూచీ పడేందుకుగాను పిఎమ్-కిసాన్ పథకాన్ని రెండేళ్ళ కిందట ఇదే రోజు న ప్రవేశపెట్టడం జరిగింది. మన రైతుల ఉద్వేగం, వారి గట్టి పట్టుదల ప్రేరణ ను అందించేటటువంటివి.
గడచిన 7 సంవత్సరాల కాలం లో భారత ప్రభుత్వం వ్యవసాయం రూపు రేఖల లో పెనుమార్పులను తీసుకు రావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. మెరుగైన సాగునీటి పారుదల మొదలుకొని మరింత ఎక్కువ సాంకేతిక విజ్ఞానం, అధిక పరపతి, బజారు లు, తగినటువంటి పంట బీమా, భూమి స్వస్థత విషయం లో శ్రద్ధ, మధ్యవర్తుల ను తొలగించడం వరకు చూస్తే ప్రభుత్వ ప్రయాస లు చాలా విస్తృత పరిధి ని కలిగినవి గా ఉన్నాయి.
కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పి) లో ఒక చరిత్రాత్మక వృద్ధి ని తీసుకువచ్చిన గౌరవం మా ప్రభుత్వానికి దక్కింది. మేము రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సాధ్యమైనదంతా చేస్తున్నాం.
NaMo App (నమో యాప్) లో మీరు అనేక విషయాల ను చూడవచ్చు; అవి రైతుల కోసం జరిగిన కృషి ని వివరిస్తాయి.
పిఎమ్ కిసాన్ నిధి ని ప్రారంభించి ఈ రోజు కు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. అన్నదాతల సంక్షేమానికి అంకితమైన ఈ పథకం ద్వారా కోట్లాది రైతు సోదరుల, రైతు సోదరీమణుల జీవనం లో చోటు చేసుకొన్న మార్పులు వారి కోసం మరిన్ని కార్యాలను చేయాలనే ప్రేరణ ను మాకు అందించాయి.
అన్నదాత ల జీవనాన్ని సరళతరం చేయడం, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పాన్ని దేశం స్వీకరించింది, దీనిలో పిఎమ్ కిసాన్ నిధి ది ప్రముఖమైనటువంటి పాత్ర . ఇవాళ మన రైతులు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో ఓ విడదీయలేనటువిం భాగంగా మారుతున్నారు’’ అని అనేక ట్వీట్ లలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
(Release ID: 1700410)
Visitor Counter : 212
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam