ప్రధాన మంత్రి కార్యాలయం

బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావ‌వంత‌మైన విధం గా అమ‌లు చేయ‌డం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ఆరోగ్య‌వంత‌మైన భార‌త‌దేశం ఆవిష్కార దిశ లో ప్ర‌భుత్వం చ‌తుర్ముఖ వ్యూహం తో ప‌ని చేస్తోంది:  ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశ ఆరోగ్య రంగం చూపిన బ‌లాన్ని, ప్ర‌తిఘాతుక‌త్వాన్ని ప్ర‌పంచం ప్ర‌స్తుతం పూర్తి గా ప్ర‌శంసిస్తోంది:  ప్ర‌ధాన మంత్రి

మందులు, వైద్య పరికరాల ఉత్ప‌త్తి కి అవ‌స‌ర‌మైన ముడి ప‌దార్థాల దిగుమ‌తుల ను త‌గ్గించుకొనేందుకు భార‌త‌దేశం కృషి చేయాలి:  ప్ర‌ధాన మంత్రి

Posted On: 23 FEB 2021 12:29PM by PIB Hyderabad

బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ఆరోగ్య రంగం లో ప్రభావ‌వంత‌మైన విధం గా అమ‌లు చేయ‌డం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

ప్ర‌ధాన మంత్రి వెబినార్ లో ప్ర‌సంగిస్తూ, ఆరోగ్య రంగాని కి ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెటు లో కేటాయించిన నిధులు ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేనంత స్థాయి లో ఉన్నాయ‌ని, ఇది దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కి మెరుగైన ఆరోగ్య సంర‌క్ష‌ణ ను అందించాల‌న్న ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త ను చాటిచెప్తోంద‌న్నారు.

మ‌హ‌మ్మారి కార‌ణం గా కింద‌టి సంవ‌త్స‌రం ఎంతటి అతిక‌ష్టం గాను, ఎంతటి సవాళ్లతో కూడుకొన్నది గాను ఉండిందీ శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు కు తెస్తూ, ఈ స‌వాలు ను అధిగ‌మించి చాలా మంది ప్రాణాల ను కాపాడ‌గ‌లిగినందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  ప్ర‌భుత్వ రంగం, ప్రైవేటు రంగం.. ఈ రెండిటి సంయుక్త ప్రయాస‌లదే ఈ ఖ్యాతి అని ఆయ‌న అన్నారు.  

దేశం ఏ విధం గా కొన్ని నెల‌ల వ్యవధి లో 2500 ప్ర‌యోగ‌శాల‌ల తో కూడిన ఒక నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేసుకొన్నదీ, అలాగే ఏ విధంగా ఒక డ‌జ‌ను ప‌రీక్ష‌ల స్థాయి నుంచి 21 కోట్ల ప‌రీక్ష‌ల మైలురాయి కి  చేరుకోన్నదీ ప్ర‌ధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చారు.

మనం వర్తమానం లో అంటువ్యాధి తో పోరాడ‌టం ఒక్క‌టే కాకుండా భవిష్యత్తు లో అలాంటి ఏ తరహా స్థితిని ఎదుర్కోవడానికి అయినా దేశాన్ని స‌న్న‌ద్ధం చేయాలనే పాఠాన్ని కూడా కరోనా మనకు నేర్పించింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ కార‌ణం గా, ఆరోగ్య సంర‌క్ష‌ణ కు సంబంధించిన ప్ర‌తి ఒక్క రంగాన్ని సమానమైన స్థాయి లో ప‌టిష్ట‌ ప‌ర‌చ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయన అన్నారు.

మ‌నం మందులు మొదలుకొని వెంటిలేట‌ర్ లు‌, టీకామందులు, విజ్ఞాన శాస్త్ర సంబంధిత ప‌రిశోధ‌న, నిఘా సంబంధిత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, వైద్యులు, ఎపిడిమియాల‌జిస్టుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క అంశం పైనా శ్ర‌ద్ధ తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ ప‌ని ని చేశామంటే గనక రాబోయే కాలం లో ఎలాంటి ఆరోగ్య రంగ విప‌త్తు కు అయినా దేశం స‌మ‌ర్ధంగా ఎదురొడ్డి నిల‌వగ‌లుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

ఇది పిఎమ్ ఆత్మ‌నిర్భ‌ర్ స్వ‌స్థ్ భార‌త్ ప‌థ‌కానికి ప్రేరణ గా ఉందని  ఆయ‌న అన్నారు.  ఈ ప‌థ‌కం లో భాగం గా, ప‌రిశోధ‌న మొద‌లుకొని ప‌రీక్ష‌లు చేయ‌డం, చికిత్స‌ ను అందించ‌డం వ‌ర‌కు విస్తృత‌మైన‌టువంటి ఒక ఆధునిక ఇకోసిస్ట‌మ్ ను దేశం లోనే అభివృద్ధిపరచాల‌ని నిర్ణయించ‌డం జ‌రిగింది అని ఆయన తెలిపారు.  ఈ ప‌థ‌కం ప్ర‌తి ఒక్క క్షేత్రం లో మ‌న శక్తి యుక్తుల ను పెంచుతుంద‌ని ఆయ‌న అన్నారు.

ప‌దిహేనో ఆర్థిక సంఘం సిఫారసు ల ప్ర‌కారం ఆరోగ్య సేవ‌ల‌ ను దృష్టి లో పెట్టుకొని స్థానిక సంస్థ‌ల కు 70,000 కోట్ల రూపాయ‌ల‌ కు పైగా నిధులు అందుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  అంటే, ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత పెట్టుబ‌డి అంశానికి ఒక్కదానికే ప్రాముఖ్యాన్ని ఇవ్వ‌డం కాదు, ఆరోగ్య సంర‌క్ష‌ణ ను దేశం లోని మారుమూల ప్రాంతాల‌ కు సైతం అందుబాటు లోకి తీసుకుపోయే విధంగా చూడటానికి కూడా ప్రభుత్వం ప్రాముఖ్యాన్ని ఇవ్వ‌నుంద‌ని ఆయ‌న వివ‌రించారు.  ఈ పెట్టుబ‌డులు ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డానికి మాత్రమే పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కూడా పూచీ ప‌డాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

భార‌త‌దేశం ప్ర‌తిభ‌ వల్ల, అనుభ‌వం వల్ల కరోనా మహమ్మారి కాలం లో భార‌త‌దేశ ఆరోగ్య రంగం చాటినటువంటి బ‌లాన్ని, ప్ర‌తిఘాతుక‌త్వాన్ని ప్ర‌పంచం ప్రస్తుతం పూర్తి గా ప్రశంసిస్తోంది అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  భార‌త‌దేశ ఆరోగ్య రంగం ప‌ట్ల విశ్వాసం, గౌర‌వం ప్ర‌పంచవ్యాప్తం గా ఇంత‌లంత‌లు గా పెరిగింది, మ‌రి ఇప్పుడు దేశం భవిష్యత్తు కేసి దృష్టి ని సారించి కృషి చేయ‌వ‌ల‌సిన అవసరం ఉంది అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశ వైద్యులు, భార‌త‌దేశ న‌ర్సులు, భార‌త‌దేశ పారామెడిక‌ల్ స్టాఫ్‌, భార‌త‌దేశ మందులు, భార‌త‌దేశ టీకామందుల కు డిమాండు ప్ర‌పంచం అంత‌టా పెర‌గ‌నుంద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌పంచం శ్రద్ధ భార‌త‌దేశ వైద్య విద్య వ్య‌వ‌స్థ ప‌ట్ల త‌ప్ప‌క మళ్లుతుందని, వైద్య విద్య ను అభ్య‌సించ‌డానికి విదేశీ విద్యార్థులు పెద్ద సంఖ్య లో భారతదేశానికి త‌ర‌లివ‌స్తార‌ని ఆయ‌న అన్నారు.

వెంటిలేట‌ర్ ల, వైద్య పరికరాల త‌యారీ లో గొప్ప కార్యాన్ని మనం సాధించిన తరువాత వాటికి అంత‌ర్జాతీయంగా గిరాకీ పెరిగిపోయిన నేప‌థ్యం లో మనం మ‌రింత వేగం గా పనిచేయవల‌సిందే అని శ్రీ మోదీ అన్నారు.

ప్ర‌పంచానికి అవ‌స‌ర‌ప‌డే వైద్య ఉపకరణాలను అన్నిటినీ కొద్ది గా త‌క్కువ ఖ‌ర్చు లో అందించగలిగే కల ను భార‌త‌దేశం కనగలదా? అంటూ ఆయ‌న వెబినార్ లో పాలుపంచుకొన్న వారిని అడిగారు.  వినియోగ‌దారుల కు అనుకూల‌ంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానం తో త‌క్కువ ఖ‌ర్చు లో, నిలకడైన తీరు న ప్రపంచానికి భారతదేశం సరఫరా చేసే విధం గా దేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్ద‌గ‌ల‌ం అనే అంశం పై మనం శ్ర‌ద్ధ వ‌హించ‌గ‌ల‌మా? అని కూడా ఆయ‌న అడిగారు.

ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వాల కు భిన్నంగా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం, ఆరోగ్య సంబంధిత అంశాల‌ ను ముక్క‌చెక్క‌లు గా కంటే ఒక్కుమ్మ‌డి ప‌ద్ధ‌తి లో ప‌రిశీలిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ కార‌ణం గా ఒక్క చికిత్స పైనే కాక వెల్‌ నెస్ పైన కూడా శ్ర‌ద్ధ వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

నివార‌ణ మొద‌లుకొని న‌యం చేయ‌డం వ‌ర‌కూ కూడాను ఒక సంపూర్ణ‌మైన‌టువంటి, ఏకీకృత‌మైన‌టువంటి వైఖ‌రి ని అవ‌ల‌ంబిస్తున్న‌ట్లు కూడా ఆయ‌న వివ‌రించారు.

ఆరోగ్య‌వంత‌మైన భార‌త‌దేశాన్ని ఆవిష్క‌రించ‌డం కోసం నాలుగు విధాలైన‌టువంటి వ్యూహం తో ప్ర‌భుత్వం కృషి చేస్తున్నది అని ఆయ‌న చెప్పారు.

వాటిలో ఒక‌టోది ‘‘అస్వ‌స్థ‌త ను నివారించ‌డం, వెల్‌ నెస్ ను ప్రోత్స‌హించ‌డం’’ అని ఆయ‌న అన్నారు.  స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్‌, యోగా, గ‌ర్భ‌వ‌తుల‌ కు, బాల‌ల‌ కు స‌కాలం లో సంర‌క్ష‌ణ‌ ను, చికిత్స ను అందించ‌డం వంటి పథకాలు దీనిలో భాగం గా ఉన్నాయ‌న్నారు.

రెండోది ‘‘నిరుపేద‌ల కు చౌకైన‌, ప్ర‌భావ‌వంత‌మైన చికిత్స ను అంద‌జేయ‌డ‌ం’’ అని ఆయ‌న అన్నారు.  ఆయుష్మాన్ భార‌త్‌, ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఔష‌ధి కేంద్రాల ఏర్పాటు వంటి ప‌థ‌కాలు ఇందుకోసం పనిచేస్తున్నాయ‌న్నారు.

మూడోది ‘‘ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల నాణ్య‌త ను, ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగ వృత్తి నిపుణుల వాసి ని పెంచ‌డం.’’  గ‌డ‌చిన 6 సంవ‌త్స‌రాలు గా, ఎఐఐఎమ్ఎస్‌ వంటి సంస్థ‌ల ను విస్త‌రించ‌డం, దేశ‌వ్యాప్తం గా వైద్య క‌ళాశాల‌ ల సంఖ్య ను పెంచ‌డం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించడం జరుగుతోందన్నారు. .

ఇక నాలుగోది ‘‘అవ‌రోధాల ను అధిగ‌మించ‌డం కోసం ఉద్య‌మ త‌ర‌హా లో పాటుప‌డ‌టం.’’  ‘మిష‌న్ ఇంద్ర‌ధ‌నుష్’ ను దేశం లోని ఆదివాసీ ప్రాంతాల కు, సుదూర ప్రాంతాల కు వ‌ర్తింప ‌చేయ‌డ‌మైంది.  క్ష‌య వ్యాధి ని 2030 సంవ‌త్స‌రానిక‌ల్లా నిర్మూలించాలి అని ప్ర‌పంచం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, అంత‌కంటే అయిదేళ్ళు ముందుగానే అంటే 2025వ సంవ‌త్స‌రానిక‌ల్లా ఈ ల‌క్ష్యాన్ని సాధించాల‌ని భారతదేశం సంక‌ల్పించిందని ఆయన అన్నారు.  క‌రోనా వైర‌స్ ను నివారించ‌డం లో అనుస‌రించిన ప్రోటోకాల్స్ నే క్ష‌య వ్యాధి నివార‌ణ లో కూడాను అనుస‌రించ‌వ‌చ్చు, ఎందుకంటే బాధితుల నుంచి తుంప‌ర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  మాస్కుల ను ఉపయోగించడం, తొలి దశ లోనే వ్యాధిని నిర్ధారించడం, చికిత్స చేయడం వంటివి క్ష‌య వ్యాధి నివార‌ణ లోనూ ముఖ్య‌మైన అంశాలే అని ఆయ‌న వివ‌రించారు.

క‌రోనా కాలం లో ఆయుష్ రంగం ఒడిగట్టిన ప్ర‌య‌త్నాలను ప్రధాన మంత్రి కొనియాడారు.  వ్యాధి నిరోధ‌క శ‌క్తి ని పెంచ‌డం లో, విజ్ఞాన శాస్త్ర సంబంధిత ప‌రిశోధ‌న అంశం లో ఆయుష్ తాలూకు మౌలిక స‌దుపాయాలు దేశానికి ఎంత‌గానో సాయ‌‌ప‌డ్డాయి అని ఆయ‌న అన్నారు. కొవిడ్‌-19 నియంత్రించ‌డం లో టీకా మందు తో పాటు, ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచ‌డం లో సాంప్ర‌దాయ‌క మందులు, మ‌సాలాల ప్ర‌భావాన్ని కూడా ప్ర‌పంచం గ్ర‌హిస్తోంది అని ఆయ‌న అన్నారు.    ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ) భార‌త‌దేశం లో ఒక గ్లోబ‌ల్ సెంట‌ర్ ఆఫ్ ట్రెడిశన‌ల్ మెడిసిన్ ను ఏర్పాటు చేయ‌నుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఆరోగ్య రంగం అంద‌రికీ అందుబాటులో ఉండేట‌ట్లు, త‌క్కువ ఖ‌ర్చు తో ఈ రంగం సేవ‌ లు అందేటట్టు చూస్తూ దీనిని త‌దుప‌రి స్థాయి కి తీసుకుపోవ‌డానికి ఇదే స‌రి అయిన త‌రుణం అని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.  ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి గాను ఆరోగ్య రంగం లో ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని మ‌రింత ఎక్కువ‌గా ఉప‌యోగం లోకి తీసుకు రావాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.  సామాన్య ప్ర‌జ‌లు వారికి అనువైన విధంగా చ‌క్క‌ని చికిత్స ను తీసుకోవ‌డానికి డిజిట‌ల్ హెల్థ్ మిశన్ తోడ్ప‌డుతుంది అని ఆయ‌న అన్నారు.  ఈ మార్పు లు ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ సాకారం కావ‌డానికి ఎంతో ముఖ్య‌మైన‌వి అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం ప్రస్తుతం ప్ర‌పంచానికి ఒక ఔష‌ధ శాల గా మారింది అయినప్ప‌టికీ ముడి ప‌దార్థాల కోసం ఇంకా దిగుమ‌తుల పై ఆధార ప‌డుతోంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.   అలా ఆధార ప‌డటం  మ‌న ప‌రిశ్ర‌మ కు మంచిది కాదు అంటూ ఆయ‌న విచారాన్ని వ్య‌క్తం చేశారు.  పేద‌ల‌ కు మందుల ను త‌క్కువ ధ‌ర‌ల‌ కు అందించ‌డం లోను, వారికి ఆరోగ్య సంర‌క్ష‌ణ ను సమకూర్చడం లోను ఇది ఒక పెద్ద అడ్డంకి గా ఉంద‌న్నారు.

స్వ‌యంస‌మృద్ధి కోసం తాజా కేంద్ర బ‌డ్జెటు లో నాలుగు ప‌థ‌కాల‌ ను ప్రవేశ‌పెట్ట‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు.  

దీనిలో భాగం గా మందుల ఉత్ప‌త్తి కి, మందుల త‌యారీకి సంబంధించిన సామ‌గ్రి కి ఉత్పాద‌క‌త తో ముడిపెట్టిన ప్రోత్సాహ‌కాల ను ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  అదే త‌ర‌హా లో మందుల‌ కు, వైద్య ప‌రిక‌రాల కు మెగా పార్కుల‌ ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  దేశానికి వెల్ నెస్ సెంట‌ర్ లు, జిల్లా ఆసుప‌త్రులు, క్రిటిక‌ల్ కేర్ యూనిట్ లు, ఆరోగ్య ప‌ర‌మైన నిఘా కు సంబంధించిన మౌలిక స‌దుపాయాలు, ఆధునికమైన ప్ర‌యోగ‌శాల‌ లు, టెలిమెడిసిన్ అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌తి ఒక్క స్థాయిలో కృషి జ‌ర‌గ‌వ‌ల‌సిన అవ‌స‌రం, ప్ర‌తి ఒక్క స్థాయి ని ప్రోత్స‌హించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉన్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  దేశ ప్ర‌జ‌లు.. వారు నిరుపేద‌లు లేదా సుదూర ప్రాంతాల‌ లో నివ‌సిస్తున్న‌వారు ఎవ‌రైనా స‌రే.. వీలైనంత వ‌ర‌కు ఉత్త‌మ‌మైన చికిత్స‌ను అందుకొనేట‌ట్లుగా మ‌నం చూడ‌వ‌ల‌సి ఉంద‌ని ఆయ‌న అన్నారు.  ఇది జ‌ర‌గాలి అంటే దేశం లో కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, స్థానిక సంస్థ‌లు క‌ల‌సి ప‌ని చేస్తూ, చ‌క్క‌ని ఫలితాల‌ ను సాధించాలి అని అయన అన్నారు.

ప్ర‌జారోగ్య ప్ర‌యోగ‌శాల‌ల తో కూడిన ఒక నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేయ‌డం తో పాటు పిఎంజెఎవై లో ఒక భాగాన్ని తీసుకోవ‌డానికి పిపిపి న‌మూనాల ను ప్రైవేటు రంగం స‌మ‌ర్ధించ‌వ‌చ్చును అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  నేశ‌న‌ల్ డిజిట‌ల్ హెల్థ్ మిశ‌న్ లోను, పౌరుల డిజిట‌ల్ హెల్త్ రికార్డుల లోను, ఇత‌ర అధునాతన సాంకేతిక విజ్ఞా‌నం లోను కూడా భాగ‌స్వామ్యానికి ఆస్కారం ఉంది అని ఆయ‌న అన్నారు.

***



(Release ID: 1700202) Visitor Counter : 199