ఆర్థిక మంత్రిత్వ శాఖ
భోపాల్‌లో దాడులు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
22 FEB 2021 1:34PM by PIB Hyderabad
బేతుల్ సోయా ప్రొడక్టు మాన్యుఫ్యాక్చరింగ్ గ్రూప్‌కు చెందిన మహారాష్ట్ర , కోల్‌కతాలోని ముంబై , సోలాపూర్‌లోని బేతుల్ , సత్నాలోని 22 ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ ఈ నెల 18న సెర్చ్, సీజర్ ఆపరేషన్ నిర్వహించింది. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, భారీగా నల్లధనాన్ని గుర్తించారు. వివిధ దేశాలకు చెందిన విలువైన కరెన్సీ రూ. 44 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ సమయంలో 9 బ్యాంక్ లాకర్లను కూడా కనుగొన్నారు. కోల్‌కతా ఆధారిత షెల్ కంపెనీల నుండి భారీ ప్రీమియంతో షేర్ క్యాపిటల్‌ను కొనడం ద్వారా సంపాదించిన 259 కోట్లను ఈ కంపెనీ లెక్కల్లో వెల్లడించలేదు. షెల్ కంపెనీలలో పెట్టుబడులను కోల్‌కతాలోని మరో షెల్ కంపెనీలకు అమ్మడం ద్వారా రూ.90 కోట్లు వచ్చినట్టు ఖాతాల పుస్తకాలలో రాసుకుంది. ఈ కంపెనీలు ఏవీ వారి చూపిన చిరునామాలో పనిచేయడం లేదని వెల్లడయింది. అటువంటి డొల్ల కంపెనీలను లేదా దాని డైరెక్టర్లనూ గుర్తించలేకపోయారు. ఈ డొల్ల కంపెనీలలో చాలా వాటిని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు చేసినట్టు గుర్తించారు.
బేతుల్ కంపెనీ అక్రమంగా లాభాలను తగ్గించి 52 కోట్ల రూపాయల నష్టాన్ని క్లెయిమ్ చేసింది. ఈ లావాదేవీలు నిర్వహించడానికి ఉద్యోగుల పేరిట వివిధ కంపెనీలు ఏర్పడ్డాయి. వాటి మధ్య అసలు వ్యాపారమే జరగలేదు. ఈ సంస్థల డైరెక్టర్లకు అలాంటి లావాదేవీల గురించి తెలియదు. ఈ గ్రూప్ షేర్ల అమ్మకంపై వచ్చిన ఆదాయంపై 27 కోట్ల కోట్ల క్యాపిటల్ గెయిల్ వచ్చినట్టు తప్పుడు లెక్కలు చూపింది. గ్రూప్ డైరెక్టర్లు ఈ సంస్థ వాటాలను నామమాత్రపు విలువతో కోల్‌కతా ఆధారిత షెల్ కంపెనీల నుండి కొనుగోలు చేసినందున ఈ వాటాల కొనుగోలు నిజమైనది కాదని దర్యాప్తులో తేలింది. నిందితుల మధ్య చాట్లతో సహా వివిధ రకాల సాక్ష్యాలను అధికారులు సేకరించారు. వీరంతా రూ.15 కోట్ల విలువైన హవాలా పద్ధతిలో పేమెంట్స్ చేసినట్టు వెల్లడయింది. ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు వంటి డిజిటల్ మీడియా డివైజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం..నల్లధనం విలువను రూ. 450 కోట్లుగా గుర్తించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
****
(Release ID: 1699981)
Visitor Counter : 145