ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

యూనివర్సల్ ఇమ్యునైజేషన్ పై దృష్టి పెట్టండి: ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 3.0ను ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్

29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన 250 జిల్లాలు / పట్టణ ప్రాంతాలలో ఫిబ్రవరి 22 మరియు మార్చి 22 నుండి రెండు దశల్లో ఐఎంఐ 3.0 నిర్వహించబడుతుంది.

"టీకా ద్వారా నివారించదగ్గ వ్యాధుల బారిన ఏ బిడ్డ మరియు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకుండా చూసుకుందాం"

Posted On: 19 FEB 2021 4:53PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0 ను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, బీహార్ ఆరోగ్య మంత్రి శ్రీ మంగల్ పాండేలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి ఐఎంఐ 3.0 పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు ఐఎంఐ3.0 కోసం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో ఉపయోగించే ఐఈసీ ప్యాకేజీని కూడా విడుదల చేశారు.

ప్రతి తల్లి మరియు బిడ్డలకు టీకాలను అందించే విస్తృతమైన కార్యక్రమాలపై డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆనందం వ్యక్తం చేశారు: ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0 ఫిబ్రవరి 22 మరియు మార్చి 22, 2021 నుండి రెండు దశల్లో అమలవుతుంది. దేశంలోని 29 రాష్ట్రాలు / కేంద్రపాలతి ప్రాంతాల్లో ముందుగా ఎంపిక చేయపడ్డ 250 జిల్లాలు / పట్టణ ప్రాంతాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో టీకా డోస్‌ పొందలేకపోయిన పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలపై ఐఎంఐ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఐఎంఐ 3.0 యొక్క రెండు దశల్లో వారిని గుర్తించడంతో పాటు టీకాలు అందిస్తారు. ఈ ప్రతి దశ 15 రోజులు ఉంటుంది. కొవిడ్19 సమయంలో వ్యాక్సిన్ డోస్‌ను పొందలేకపోయిన వలస ప్రాంతాల లబ్ధిదారులు మరియు చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాలపై ప్రధానంగా ఈ కార్యక్రమం దృష్టి సారించింది.

ఐఎంఐ 3.0 కార్యక్రమం మునుపటి దశల ప్రయోజనాలపై ఆధారపడుతుందని మరియు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వైపు శాశ్వత లాభాలు సాధిస్తుందని
డాక్టర్ హర్ష్ వర్ధన్‌ పేర్కొన్నారు: మొదటి దశ నుండి మిషన్ ఇంద్రధనుష్‌ కార్యక్రమాలు 690 జిల్లాలను కవర్ చేశాయి. అలాగే 37.64 మిలియన్ల మంది పిల్లలు మరియు 9.46 మిలియన్ల గర్భిణీ స్త్రీలకు టీకాలు వేశారు. ప్రస్తుతం ఎనిమిదవ ప్రచారం దేశంలోని అన్ని జిల్లాల్లో 90% పూర్తి ఇమ్యునైజేషన్ కవరేజ్ (ఎఫ్‌ఐసి) సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. మరియు రోగనిరోధకత వ్యవస్థ బలోపేతం ద్వారా కవరేజీని నిలబెట్టుకుంటుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు భారతదేశం యొక్క ప్రయాణాన్నిప్రోత్సహిస్తుంది. దేశంలోని పౌరులందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణను అందించడానికి గౌరవనీయ ప్రధానమంత్రి మార్గదర్శకంలో  మిషన్ ఇంద్రధనుష్ 2014 లో ప్రారంభించబడింది"అని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.

ఐఎంఐ 3.0 కోసం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..313 తక్కువ ప్రమాదాన్ని ప్రతిబింబించేలా జిల్లాలు వర్గీకరించబడ్డాయి; మీడియం రిస్క్‌గా 152; మరియు 250 అధిక ప్రమాదం ఉన్న జిల్లాల జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుత కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో కార్యక్రమం యొక్క పాత్రను ఆయన వివరిస్తూ "దేశం విజయవంతంగా కొవిడ్‌19 ను ఎదుర్కొంది. మరియు రెండు దేశీయ వ్యాక్సిన్ల ద్వారా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. టీకా యొక్క ప్రాముఖ్యత ఇంత బలంగా గతంలో ఎప్పుడూ భావించలేదు. ప్రతి సంవత్సరం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం 12 వ్యాక్సిన్ నివారణ వ్యాధుల నుండి 2.65 కోట్ల మంది పిల్లలు మరియు 2.9 కోట్ల మంది గర్భిణీ టీకా అవసరాలను తీరుస్తుంది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, కొంతమంది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు వీటిని అందుకోలేకపోతున్నారు. అలాంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను చేరుకోవడానికి చేపట్టిన విజయవంతమైన వ్యూహామే ఈ మిషన్ ఇంద్రధనుస్సు. ఈ కార్యక్రమ అమలులో గొప్ప మెరుగుదల ఉంది. ఇది 22 రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌5 డేటాలో కూడా స్పష్టంగా ఉంది." అని చెప్పారు.

చివరి పౌరుడి వరకూ సరైన ఆరోగ్య సంరక్షణను అందించే భారీ కార్యక్రమాన్ని మంత్రి గుర్తించారు. "కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించే సమయంలో కూడా ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 3.0 వంటి పెద్ద కార్యక్రమాలను అమలు చేయడం భారత ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కావడానికి స్పష్టమైన సూచన. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 3.0 (ఐఎంఐ 3.0) యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యుఐపి) కింద అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్లతో ఇప్పటివరకూ టీకా చేరని జనాభాను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు పూర్తి రోగనిరోధకత మరియు పూర్తి రోగనిరోధకత కవరేజీని వేగవంతం చేస్తుంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై అధిక ప్రాధాన్యతనిచ్చే బడ్జెట్‌లోని కేటాయింపులనుఈ సందర్భంగా  కేంద్ర మంత్రి వివరించారు.

శ్రీ అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ "మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాలు భారత సందర్భానికి తగినట్లుగా తయారయ్యాయని నిరూపించబడ్డాయి మరియు మునుపటి దశలలో చాలా ఎక్కువ ఫలితాలను ఇచ్చాయి. మిషన్ ఇంద్రధనుష్ & ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ వంటి కార్యక్రమాలు ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలాలు మరియు సంచార జనాభాతో సహా అధిక ప్రమాదకర ప్రాంతాలను చేరుకోవడానికి  ఇమ్యునైజేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. మునుపటి కార్యక్రమాలు సూక్ష్మ ప్రణాళికను మెరుగుపరచడంలో, రోగనిరోధకత సేవలకు డిమాండ్‌ను పెంచడంతో మరియు సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడ్డాయి." అని చెప్పారు.

ఐఎంఐ 3.0లో భాగంగా  టీకాలు అందించే కార్యక్రమాల్లో కొవిడ్ అప్రొపరైట్ బిహేవియర్‌(సీఏబీ) చర్యల అమలుపై మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీకాలు అందించే ప్రాంతాల్లో రద్దీని నివారించడానికి పలు చర్యలను చేపట్టాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. రద్దీని నివారించడానికి  బ్రేక్-అప్ సెషన్లను కూడా అమలు చేయాలని చెప్పారు. ఒక నిర్దిష్ట సమయంలో సెషన్ సైట్ వద్ద 10 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండని విధంగా సెషన్లను కూడా ప్లాన్ చేస్తారు.

ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ శ్రీమతి వందన గుర్నాని, సంయుక్త కార్యదర్శి (పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం) శ్రీమతి ప్రీతి పంత్ మరియు మంత్రిత్వ శాఖ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

***


(Release ID: 1699523) Visitor Counter : 380