నౌకారవాణా మంత్రిత్వ శాఖ

100 ఎమ్ఎమ్‌టీల సరుకును రవాణా చేసిన దీన్‌దయాళ్ పోర్ట్

కోవిడ్ ముందు నాటికి స్థితికి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని చెప్పడానికి ఇదే ముఖ్యమైన సూచన: మంత్రి మన్సుఖ్ మాండవియా

Posted On: 19 FEB 2021 2:31PM by PIB Hyderabad
భారతదేశంలోని 12 మేజర్ పోర్టులలో ఒకటైన దీన్‌దయాళ్ పోర్ట్ ట్రస్ట్ కార్గో హ్యాండ్లింగ్‌లో 100 ఎంఎంటీల (మిలియన్ మెట్రిక్ టన్నులు) మార్కును దాటింది. గతంలో కాండ్లా పోర్ట్ అని పిలిచిన దీన్‌దయాళ్ పోర్ట్ గుజరాత్‌లోని కచ్‌లో ఉంది.
 
కందల లోని దీన్‌దయాళ్ పోర్ట్ 13.25 ఎంఎంటీ లిక్విడ్ కార్గో  43.76 ఎంఎంటీ డ్రై కార్గో & కంటైనర్లను హ్యాండిల్ చేసింది. ఇది వాడినార్ వద్ద 43.30 ఎంఎంటీ ని కార్గోను నిర్వహించింది (ఇందులో ట్రాన్స్‌షిప్మెంట్ కూడా ఉంది). ఇదేకాలంలో కంటైనరైజ్డ్ కార్గో  4.50 లక్షల టీఈయూని దాటి, మొత్తం 100 ఎంఎంటీలకు చేరింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, ఉప్పు, వంట నూనె, ఎరువులు, చక్కెర, కలప, సోయా బీన్, గోధుమలు దీన్‌దయాళ్ పోర్ట్ నుంచి రవాణా అయ్యే ప్రధాన వస్తువులు.
షిప్పింగ్ వ్యాపారులు / వాటాదారులతో పోర్ట్  వినియోగదారు-స్నేహపూర్వక విధానం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరించింది. వారితో నిరంతరం సంప్రదింపులు జరపడం ఈ విజయానికిప్రధాన కారణమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా పోర్టులు, షిప్పింగ్  జలమార్గాల శాఖ మంత్రి (ఐ / సి)  మన్సుఖ్ మాండవియా, దీన్‌దయాళ్ పోర్ట్ చేస్తున్న కృషిని ప్రశంసించారు సంక్లిష్టభరిత కోవిడ్ కాలంలో సాధించిన ప్రధాన విజయం ఇదని అభివర్ణించారు. కోవిడ్కు ముందు నాటిస్థాయికి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్నదని చెప్పడానికి ఇదే ప్రధాన సూచన అని అన్నారు. 
 
***

(Release ID: 1699440) Visitor Counter : 198