మంత్రిమండలి
కౌమార ప్రాయం లోని వారికి న్యాయం (బాలల సంరక్షణ మరియు వారి పరిరక్షణ) చట్టం, 2015 లో సవరణల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
17 FEB 2021 3:52PM by PIB Hyderabad
బాలల కు ఉత్తమ ప్రయోజనాలు అందేటట్లు చూడటం కోసం బాల సంరక్షణ సంబంధిత వ్యవస్థ ను పటిష్టం చేయడానికి కొన్ని విధి విధానాల ను ప్రవేశపెట్టేందుకు కౌమార ప్రాయం లోని వారికి న్యాయం (బాలల సంరక్షణ మరియు వారి పరిరక్షణ) చట్టం, 2015 ను సవరించాలి అంటూ మహిళలు, బాల వికాస మంత్రిత్వ శాఖ తీసుకు వచ్చిన ప్రతిపాదన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
ఈ సవరణ లో వ్యాజ్యాల సత్వర పరిష్కారం తో పాటు జవాబుదారుతనాన్ని పెంపొందింపచేయడం కోసం జిల్లా మేజిస్ట్రేటు కు, అదనపు జిల్లా మేజిస్ట్రేటు కు జెజె (జూవినైల్ జస్టిస్) చట్టం లోని సెక్షన్ 61 ప్రకారం దత్తత తీసుకొనే ఆదేశాల ను జారీ చేసే అధికారాన్ని ఇవ్వడమైంది. ఈ చట్టాన్ని సాఫీ గా అమలు అయ్యేటట్లు చూసేందుకు జిల్లా మేజిస్ట్రేటుల కు అధికారాలు ఇవ్వడమైంది. దీనితో, సంకట స్థితి లో బాలల కు మేలు చేసే విధం గా సమన్విత ప్రయత్నాల ను చేపట్టడానికి వీలు చిక్కుతుందన్న మాట. సిడబ్ల్యుసి సభ్యుల నియామకానికి సంబంధించి అర్హత ప్రమాణాలను నిర్వచించడం, ఇంతకు ముందు నిర్ధారణ కానటువంటి అపరాధాల ను ‘‘తీవ్రమైన అపరాధం’’ గా వర్గీకరించడం వంటివి కూడా ఈ ప్రతిపాదనల లో ఇతర అంశాలు గా ఉన్నాయి. చట్టం లోని వివిధ నిబంధనల ను అమలు చేయడం లో ఎదురుకాగల ఇబ్బందుల ను కూడా తీర్చడం జరిగింది.
***
(Release ID: 1698797)
Visitor Counter : 244
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam