ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ లో ఈ నెల 18న ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; ఆయన రెండు వంతెనల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు
Posted On:
16 FEB 2021 8:30PM by PIB Hyderabad
అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు, అంటే ఈ నెల 18న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇదే సందర్భం లో ధూబ్ రీ ఫూల్‌బాడీ వంతెన కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటు మజులీ వంతెన నిర్మాణ పనుల కు మధ్యాహ్నం 12 గంటల కు భూమి పూజ ను కూడా చేయనున్నారు. ఈ కార్యక్రమం లో రహదారి రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, నదీ మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు.
‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను గురించి
‘మహాబాహు-బ్రహపుత్ర’ ను ప్రారంభించడం తో పాటే నెమాటీ-మజులీ దీవి, ఉత్తర గువాహాటీ-దక్షిణ గువాహాటీ, ధూబ్ రీ-హాట్‌సింగిమారీ మధ్య రో-పాక్స్ వెసల్ కార్యకలాపాలను కూడా ప్రారంభించడం జరుగుతుంది; జోగీఘోపా లో ఇన్‌లాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ (ఐడబ్ల్యుటి) టర్మినల్ కు శంకుస్థాపన, బ్రహ్మపుత్ర నది మీద వివిధ పర్యటక రేవు కట్టల తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఉద్దేశించినటువంటి డిజిటల్ సాల్యూశన్స్ ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. భారతదేశ ఈశాన్య ప్రాంతాల కు నిరంతరాయం గా సంధానాన్ని సమకూర్చాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యం గా ఉంది. బ్రహ్మపుత్ర, బరాక్ నదుల చుట్టుపక్కల ప్రాంతాల లో నివసిస్తున్న ప్రజల కోసం చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమం లో భాగం గా ఉన్నాయి.
రో-పాక్స్ సేవలతో నది తీరాల నడుమ సంధానాన్ని సమకూర్చడం తో ప్రయాణ కాలం తగ్గడం తో పాటు రహదారి మార్గం లో ప్రయాణించవలసిన దూరం కూడా తగ్గిపోగలదు. నెమాటీ-మజులీ మధ్య రో-పాక్స్ కార్యకలాపాలు ప్రస్తుతం వాహనాలు ప్రయాణిస్తున్న 420 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 కి.మీ. కి తగ్గిపోయి, తత్ఫలితంగా ఆ ప్రాంతం లో చిన్న తరహా పరిశ్రమల కు లాజిస్టిక్స్ పరంగా చెప్పుకోదగ్గ ప్రభావం పడనుంది. ఎమ్.వి. రాణీ గాయిదిన్‌లియూ, ఎమ్.వి. సచిన్ దేవ్ బర్మన్ అనే పేరు లు కలిగిన రెండు స్వదేశీ రో-పాక్స్ నౌకలు వాటి కార్యకలాపాల ను మొదలుపెట్టనున్నాయి. ఎమ్.వి. జె.ఎఫ్.ఆర్. జేకబ్ పేరు తో ఒక రో-పాక్స్ నౌక ప్రారంభం కావడం తో ఉత్తర గువాహాటీ, దక్షిణ గువాహాటీ ల నడుమ ప్రయాణించే దూరం దాదాపు 40 కి.మీ. కాస్తా కేవలం 3 కి.మీ. కి తగ్గిపోనుంది. ధూబ్ రీ, హాట్ సింగిమారీ ల మధ్య రాకపోకలు సాగించే ఎమ్.వి. బాబ్ ఖాతింగ్ నౌక 220 కి.మీ.ల ప్రయాణ దూరాన్ని 28 కి.మీ. కి తగ్గించివేయగలగుతుంది. ఈ ప్రకారంగా ప్రయాణానికి పట్టే కాలం కూడా బోలెడంత ఆదా అవుతుంది.
పర్యటన మంత్రిత్వ శాఖ అందించే 9.41 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తో నెమాటీ, బిశ్వనాథ్ ఘాట్, పాండు, జోగీఘోపా అనే నాలుగు ప్రదేశాల లో పర్యటక రేవు కట్ట ల నిర్మాణ పనుల కు శంకుస్థాపన కూడా ఈ కార్యక్రమం లో ఓ భాగం గా ఉంది. ఈ టూరిస్ట్ జెటీ లు రివర్ క్రూజ్ టూరిజమ్ ను ప్రోత్సహించడమే కాకుండా స్థానికంగా ఉద్యోగ అవకాశాల ను కల్పించడం తో పాటు స్థానిక వ్యాపారాలు వృద్ధి చెందేందుకు ఆస్కారాన్ని కూడా కల్పించనున్నాయి.
ఈ కార్యక్రమం లో భాగం గా జోగీఘోపా లో ఒక శాశ్వత ఇన్‌లాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ టర్మినల్ ను కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది జోగీఘోపా లో త్వరలో ఏర్పాటు కానున్న మల్టీ-మాడల్ లాజిస్టిక్స్ పార్క్ తో జత పడనుంది. ఈ టర్మినల్ కోల్‌కాతా, హల్దియా ల దిశ లో సాగే సిలీగుడీ కారిడార్ లో వాహన రాక పోక లను తగ్గించడం లో సహాయకారి కానుంది. ఈ టర్మినల్ ఈశాన్య ప్రాంతంలో మేఘాలయ, త్రిపుర ల వంటి వివిధ రాష్ట్రాలకే కాక భూటాన్, బాంగ్లాదేశ్ లకు కూడా వరద ల కాలం లో సైతం ఓడ ల ద్వారా సరకు ను ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీ గా చేరవేసేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
వ్యాపారాన్ని నిర్వహించడం లో మరింత సౌలభ్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రెండు ఇ-పోర్టల్స్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. కార్-డి (కార్గో డాటా) పోర్టల్ ఓడ సరకు రవాణా తో పాటు క్రూజ్ డేటా ను వాస్తవ కాల ప్రాతిపదిక న కలుపుతుంది. ఇక పిఎఎన్ఐ (‘పానీ’- పోర్టల్ ఫార్ ఎసెట్ ఎండ్ నేవిగేశన్ ఇన్ఫార్ మేశన్) నదీ జల పర్యటన కు, మౌలిక సదుపాయాల కల్పన కు సంబంధించిన సమాచారాన్ని అందజేసేందుకు ఒకే చోటు లో సేవ ను అందించే కార్యాన్ని నిర్వర్తిస్తుంది.
ధూబ్ రీ ఫూల్‌బాడీ వంతెన గురించి
బ్రహ్మపుత్ర నది మీద ఉత్తరపు ఒడ్డున ధూబ్ రీ కి, దక్షిణపు ఒడ్డున ఫూల్ బాడీ నడుమ నాలుగు దోవల నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిపాదిత వంతెన ఎన్ హెచ్-127బి పైన ఏర్పాటవుతుంది. ఇది ఎన్ హెచ్-27 (ఈస్ట్- వెస్ట్ కారిడార్) లో శ్రీరామ్ పుర్ నుంచి మొదలై మేఘాలయ రాష్ట్రం లో ఎన్ హెచ్-106 లో నోంగ్ స్టోయిన్ వద్ద ముగుస్తుంది. ఇది అసమ్ లోని ధూబ్ రీ ని మేఘాలయ లోని పూల్‌బాడీ, తూరా, రోంగ్రామ్, రోంగ్ జేంగ్ లను కలుపుతుంది.
దాదాపు 4997 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం కానున్న ఈ వంతెన ను నిర్మించాలని అసమ్, మేఘాలయ రాష్ట్రాల ప్రజలు చాలా కాలం గా కోరుతున్నారు. వారు ఇంతవరకు నది లో రెండు తీర ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి బల్లకట్టు సేవల పైన ఆధారపడుతూ వచ్చారు. ఇది రోడు మార్గం ద్వారా ప్రయాణించే 205 కి.మీ. దూరాన్ని తగ్గించి 19 కి.మీ. గా చేసి వేస్తుంది. అంటే ఈ వంతెన మొత్తం పొడవు 19 కి.మీ. ఉందన్న మాట.
మజులీ వంతెన
ప్రధాన మంత్రి మజులీ (ఉత్తరపు ఒడ్డు న), జోర్ హాట్ (దక్షిణపు ఒడ్డు న) ల నడుమ బ్రహ్మపుత్ర నది మీద రెండు దోవ ల వంతెన నిర్మాణానికి గాను భూమి పూజ ను కూడా చేయనున్నారు.
ఈ వంతెన ‘‘ఎన్‌హెచ్-715కె’’ పైన ఏర్పాటు కానుంది. ఇది నీమతీఘాట్ (జోర్ హాట్ వైపు న), కమ్ లా బారీ (మజులీ వైపు న) లను కలుపుతుంది. ఈ వంతెన ను నిర్మించాలని మజులీ ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. వారు కొన్ని తరాల తరబడి అసమ్ ముఖ్య భూమి తో జత పడడానికి గాను బల్లకట్టు సేవలను ఆశ్రయిస్తున్నారు.
***
(Release ID: 1698667)
Visitor Counter : 252
Read this release in:
Punjabi
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam