ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల 29వ రోజు తాజా సమాచారం

80 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు, ఈ సాయంత్రం 6 వరకు 84,807 మందికి

ఈ రోజు నుంచి మొదలైన రెండో డోస్ టీకా, అందుకున్నవారు 7,668 మంది ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ టీకాల కార్యక్రమంపై రాష్ట్రాలతో కేంద్ర కాబినెట్ కార్యదర్శి సమీక్ష

క్రమం తప్పకుండా సమావేశాలు జరిపి టీకా అనంతర ప్రభావాలపై అవగాహన పెంచాలని సూచన

Posted On: 13 FEB 2021 8:11PM by PIB Hyderabad

ఇప్పటివరకు కోవిడ్ టీకాలు అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కలిసి మొత్తం సంఖ్య 80 లక్షలు దాటింది. 1,69,215 శిబిరాలలో ఇప్పటివరకు 80,52,454 మంది టీకాలు వేయించుకున్నట్టు ఈ సాయంత్రం 6 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. వీరిలో 59,35,275 మంది ఆరోగ్య సిబ్బంది కాగా, 21,17,179 మంది కోవిడ్ యోధులు.

కోవిడ్-19 టీకాల రెండో డోస్ ఈరోజు ఇవ్వటం మొదలైంది. మొదటి డోస్ తీసుకొని 28 రోజులు గడిచిన సమ్దర్భంగా వీరికి రెండో డోస్ ఇచ్చారు. మొదటి డోస్ తీసుకున్నవారు 4 నుంచి 6 వారాల్లోగా రెండో డోస్ తీసుకోవాలని అధికారులు నిర్దేశించారు. ఈ రోజు 7,668 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. నేడు 29వ రోజు సాయంత్రం 6 గంటలవరకు మొత్తం 84,807 మంది టీకాలు వేయించుకున్నారు. వీరికోసం 4,434 శిబిరాలు నిర్వహించారు.తుది నివేదిక రాత్రి పొద్దుపొయాక అందుతుంది.

ఈ రోజు మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో టీకాలు ఇచ్చారు. 

 

 

క్రమ సంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకాల లబ్ధిదారులు

మొదటి డోస్

రెండో డోస్

మొత్తం డోస్ లు

1

అండమాన్, నికోబార్ దీవులు

3,646

0

3,646

2

ఆంధ్రప్రదేశ్

3,54,868

3,434

3,58,302

3

ఆరుణాచల్ ప్రదేశ్

15,116

0

15,116

4

అస్సాం

1,25,260

198

1,25,458

5

బీహార్

4,76,076

0

4,76,076

6

చండీగఢ్

8,660

143

8803

7

చత్తీస్ గఢ్

2,47,992

29

2,48,021

8

దాద్రా, నాగర్ హవేలి

2,914

48

2962

9

డామన్, డయ్యూ

1,121

30

1151

10

ఢిల్లీ

1,79,748

318

1,80,066

11

గోవా

12,949

0

12949

12

గుజరాత్

6,76,453

0

6,76,453

13

హర్యానా

1,95,965

325

1,96,290

14

హిమాచల్ ప్రదేశ్

79,166

0

79,166

15

జమ్మూ, కశ్మీర్

1,28,756

807

1,29,563

16

జార్ఖండ్

1,95,291

920

1,96,211

17

కర్నాటక

4,95,980

0

4,95,980

18

కేరళ

3,47,776

0

3,47,776

19

లద్దాఖ్

2,904

0

2904

20

లక్షదీవులు

1,776

0

1776

21

మధ్యప్రదేశ్

5,26,783

0

5,26,783

22

మహారాష్ట్ర

6,49,966

0

6,49,966

23

మణిపూర్

19,607

0

19607

24

మేఘాలయ

13,084

59

13143

25

మిజోరం

11,332

0

11332

26

నాగాలాండ్

9,476

0

9,476

27

ఒడిశా

4,01,021

0

4,01,021

28

పుదుచ్చేరి

5,510

0

5510

29

పంజాబ్

1,03,687

57

1,03,744

30

రాజస్థాన్

6,06,942

0

6,06,942

31

సిక్కిం

8,335

0

8335

32

తమిళనాడు

2,27,542

0

2,27,542

33

తెలంగాణ

2,78,250

38

2,78,288

34

త్రిపుర

68,789

366

69,155

35

ఉత్తరప్రదేశ్

8,58,602

0

8,58,602

36

ఉత్తరాఖండ్

1,08,349

0

1,08,349

37

పశ్చిమ బెంగాల్

4,95,585

896

4,96,481

38

ఇతరములు

99,509

0

99,509

మొత్తం

80,44,786

7,668

80,52,454

 

12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలొలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 70% పైగా టీకాలు వేయించుకున్నారు. అవి- బీహార్, లక్షదీవులు, త్రిపుర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, కేరళ, రాజస్థాన్, మిజోరం, సిక్కిం

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

శాతం

1.

లక్షదీవులు

81%

2.

బీహార్

80.06%

3.

త్రిపుర

78.9%

4.

ఒడిశా

76.7%

5.

మధ్యప్రదేశ్

75.8%

6.

ఉత్తరాఖండ్

74.8%

7.

హిమాచల్ ప్రదేశ్

74.5%

8.

చత్తీస్ గఢ్

73%

9.

కేరళ

71.1%

10.

రాజస్థాన్

70.7%

11.

మిజోరం

70.5%

12.

సిక్కిం

70.1%

 

 

మరోవైపు 7 రాష్ట్రాల్లో ఆరోగ్య సిబ్బందిలో 40% లోపు మాత్రమే టీకాలు వేయించుకున్నారు. ఆ రాష్ట్రాలు మేఘాలయ, పంజాబ్, మణిపూర్, తమిళనాడు, చందీగఢ్, నాగాలాండ్, పుదుచ్చేరి. 10 రాష్ట్రాలలో అత్యధికంగా టీకాల కార్యక్రమం అమలైంది. అవి: జమ్మూ-కశ్మీర్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, ఉత్తరాఖండ్, త్రిపుర, ఢిల్లీ.

ఇప్పటిదాకా కోవిడ్ టీకాల అనంతరం ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య 34. ఇది మొత్తం టీకాలు వేసుకున్నవారిలో 0.0004% మాత్రమే. ఈ 34 కేసులలో 21 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది చనిపోయారు. ఇద్దరు ఇంకా చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో ఎవరూ ఆస్పత్రిలో చేరలేదు. ఇప్పటిదాకా 27 మరణాలు నమోదు కాగా అవి మొత్తం టీకాలు వేసుకున్నవారిలో 0.0003%. వీరిలో 11 మంది ఆస్పత్రిలో మరణించగా 16 మంది ఆస్పత్రి వెలుపల మరణించారు.

అయితే, టీకా అనంతరం కనబడిన అనారోగ్య సంబంధమైన మార్పులేవీ టీకాలకు సంబంధించినవి కావు 

గత 24 గంటలలొ మూడు తాజా మరణాలు నమోదయ్యాయి. వారిలో 38 ఏళ్ళ వ్యక్తి మధ్యప్రదేశ్ లోని హార్దాకు చెందినవారు. టీకా వేసుకున్న 9 రోజుల తరువాత గుండె సంబంధ వ్యాధి కారణంగా మరణించాడు. మరో 35 ఏళ్ళ వ్యక్తి హర్యానాలోని పానిపట్ కు చెందినవాడు. న్యుమోనియాతోబాటు శ్వాసకోశ సంబంధమైన ఇమ్కో సమస్యవల్ల చనిపోయినట్టు తేలింది. ఈయన టీకా వేయించుకొని 8 రోజులైంది. పోస్ట్ మార్టమ్ వివరాలు ఇంకా రావాల్సి ఉంది. రాజస్థాన్ లో దౌసా కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి విధి నిర్వహణలో ఉండగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువచ్చే సరికే మరణించినట్టు డాక్టర్లు నిర్థారించారు. పొస్ట్ మార్టమ్ నివేదిక రావాల్సి ఉంది.

కోవిడ్ టీకాల కార్యక్రమం మీద పూర్తి సమాచారం తీసుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ రోజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్ష జరిపారు. అరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులకు టీకాలిచ్చే విషయంలో గడువు కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రామాణిక నిర్వహణావిధానాలను పాటిస్తూ రెండో డోస్ కూడా పూర్తి చేయాలని, కో-విన్ వేదికమీద సమాచారం పంచుకొవాలని కోరారు. టీకామందు నిల్వలు సమర్థంగా నిర్వహించాలని నొక్కి చెప్పారు. ప్రతి రాష్టం ఒక మీడియా సెల్ ఏర్పాటు చేసి సమీక్షా సమావేశాలు జరపాలని చెప్పారు.

కోవిడ్ 19 టీకాల తరువాత బలమైన నిఘా ద్వారా పరిస్థితిని బేరీజు వేసుకోవాలన్నారు. టీకాల తరువాత కనబడే ప్రతికూల ప్రభావాన్ని గమనించటానికి జిల్లాల స్థాయిలోను, రాష్ట్రాల స్థాయిలోను ఏర్పాటు చేసుకొని నిఘాను సరిచూసుకోవాలని సూచించారు. దీనివలన టీకాలు వేయించుకునే వారిలో నమ్మకం పెరుగుతుందన్నారు. రాష్ట్రాలు తమ అనుభవాలను కేంద్రప్రభుత్వంతో పంచుకోవటం ద్వారా టీకాల విధానాన్ని మరింత మెరుగు పరచుకొవటం సాధ్యమవుతుందన్నారు.

******

 

 (Release ID: 1697832) Visitor Counter : 137