వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

"ఈ-కామర్స్" వేదిక - నియంత్రణ మరియు క్రమబద్దీకరణ


Posted On: 12 FEB 2021 12:32PM by PIB Hyderabad

"ఈ-కామర్స్" యొక్క విస్తృత స్వభావాన్ని పరిశీలిస్తే, అనేక రంగాలలోని వివిధ చట్టాలు మరియు నిబంధనలు ప్రస్తుత "ఈ-కామర్స్" కార్యకలాపాలను నియంత్రిస్తాయి. వాటిలో కొన్ని: వినియోగదారుల రక్షణ చట్టం-2019; ఆర్థిక చట్టం-2020; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000; విదేశీ మారక నిర్వహణ చట్టం-2000 మరియు పోటీ చట్టం-2002. క్రమబద్దీకరణ విధానాన్ని అందించే పరంగా, పోటీ చట్టం-2002, పోటీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే పద్ధతులను నివారించడానికి సహాయపడుతుంది. సెక్షన్-3 కింద, పోటీ వ్యతిరేక ఒప్పందాలకు సంబంధించి మరియు సెక్షన్-4 కింద, ఆధిపత్య స్థానం దుర్వినియోగానికి సంబంధించి కూడా, "ఈ-కామర్స్" వేదికలకు వర్తిస్తాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.‌డి.ఐ) తో ఉన్న "ఈ-కామర్స్" సంస్థలు / వేదికలు ప్రస్తుతం, పత్రికా ప్రకటన 2 (2018) ద్వారా విదేశీ మారక నిర్వహణ (రుణేతర పత్రాలు) నిబంధనలు-2019 లోని క్రమ సంఖ్య: 15.2, షెడ్యూల్-1 తో పరిగణించడం జరుగుతుంది.

ఈ-కామర్స్ కంపెనీలకు వ్యతిరేకంగా అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సి.ఏ.ఐ.టి) సమర్పించిన విజ్ఞాపనలు ప్రభుత్వం స్వీకరించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం-1999 ప్రకారం, పరిశోధనాత్మక అధికారాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈ.డి) కు ఉన్నాయి. అందువల్ల, ఈ విజ్ఞాపనలను ఈ.డి. కి పంపించడం జరిగింది. వీటిని దర్యాప్తు కోసం స్వీకరించారు. ఇంకా, అమెజాన్ మరియు ఫ్లిప్-‌కార్ట్ వంటి, "ఈ-కామర్స్" వెబ్-‌సైట్ల ద్వారా చేసిన కొనుగోళ్లకు, నగదు తిరిగి చెల్లింపు మరియు రాయితీలను అందించడంలో బ్యాంకులు పక్షపాత ధోరణిని అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ సి.ఏ.ఐ.టి. నుండి ఫిర్యాదులు వచ్చాయి. వీటిని, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది.

ఫ్లిప్-‌కార్ట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ మధ్య జరిగిన ఒప్పందంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌.డి.ఐ) విధానం మరియు ఫెమా ఉల్లంఘన ఆరోపణలపై ఆర్.‌బి.ఐ. లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి దర్యాప్తు ప్రారంభించలేదు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో, ఈ సమాచారాన్ని తెలియజేశారు.

*****

 



(Release ID: 1697454) Visitor Counter : 212