ఆర్థిక మంత్రిత్వ శాఖ

పట్టణ స్థానిక సంస్థల (యు.ఎల్.‌బి) సంస్కరణలను పూర్తి చేసిన 6వ రాష్ట్రంగా నిలిచిన - గోవా

223 కోట్ల రూపాయల మేర అదనపు రుణం తీసుకునేందుకు - అనుమతి

యు.ఎల్.‌బి. సంస్కరణలు చేపట్టిన 6 రాష్ట్రాలకు ఇప్పటివరకు 10,435 కోట్ల రూపాయల మేర అదనపు ఋణం అనుమతి మంజూరయ్యింది

Posted On: 11 FEB 2021 1:40PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిర్దేశించిన పట్టణ స్థానిక సంస్థల (యు.ఎల్.‌బి) సంస్కరణలను, మన దేశంలో విజయవంతంగా చేపట్టిన 6వ రాష్ట్రంగా గోవా అవతరించింది.  ఈ విధంగా, బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 223 కోట్ల రూపాయల మేర అదనపు ఆర్థిక వనరులను సమీకరించడానికి గోవా అర్హత సాధించింది.  ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం, ఈ మేరకు అనుమతి జారీ చేసింది. 

యు.ఎల్.‌బి. సంస్కరణలను పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, రాజస్థాన్, తెలంగాణ వంటి మరో ఐదు రాష్ట్రాల జాబితాలో ఇప్పుడు గోవా కూడా చేరింది.  నిర్దేశించిన సంస్కరణల అమలు అనంతరం, ఈ ఐదు రాష్ట్రాలకు మొత్తం 10,435 కోట్ల రూపాయల మేర  అదనపు రుణాలకు అనుమతి మంజూరయ్యింది.  

రాష్ట్రాల వారీగా అనుమతించిన అదనపు రుణాల వివరాలు : 

క్రమ సంఖ్య 

రాష్ట్రం 

మొత్తం 

(రూపాయలు-కోట్లలో)

1.

ఆంధ్రప్రదేశ్ 

2,525

2.

గోవా 

223

3.

మధ్యప్రదేశ్ 

2,373

4.

మణిపూర్ 

75

5.

రాజస్థాన్ 

2,731

6.

తెలంగాణ 

2,508

 

రాష్ట్రాల్లో యు.ఎల్.బి. లను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, పౌరులకు మెరుగైన ప్రజారోగ్యం,  పారిశుద్ధ్య సేవలను అందించడానికి వీలు కల్పించాలనేది - యు.ఎల్.‌బి. లలో సంస్కరణలు మరియు పట్టణ సదుపాయాల్లో సంస్కరణల ఉద్దేశ్యం.  ఆర్థికంగా పునరుజ్జీవింపబడిన యు.ఎల్.‌బి. లు మంచి పౌర మౌలిక సదుపాయాలను కూడా సృష్టించగలవు.

ఈ లక్ష్యాలను సాధించడానికిగాను, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిర్దేశించిన సంస్కరణల వివరాలు : 

(i)         రాష్ట్రాలు ఈ వివరాలు తెలియజేయవలసిఉంటుంది : 

ఏ.          ప్రస్తుత సర్కిల్ రేట్లకు (అనగా ఆస్తి లావాదేవీలకు మార్గదర్శక రేట్లు) మరియు యు.ఎల్.బి. లలో ఆస్తి పన్ను యొక్క రేట్లు;   మరియు

బి.        ప్రస్తుత ఖర్చులు / గత ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించే త్రాగు నీటి సరఫరా, మురుగు నీటి పారుదల సదుపాయానికి సంబంధించి వినియోగదారుల  ఛార్జీల రేట్లు.

(ii) ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆస్తిపన్ను / వినియోగదారు ఛార్జీల రేట్లు క్రమానుగతంగా పెంచే విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తుంది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న బహుళ సవాళ్లను ఎదుర్కోడానికి కావలసిన వనరుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని,  భారత ప్రభుత్వం 2020 మే 17వ తేదీన రాష్ట్రాల రుణ పరిమితిని వారి జి.ఎస్.‌డి.పి. లో 2 శాతం పెంచింది.  ఈ ప్రత్యేక పంపిణీలో సగం అంటే జి.ఎస్.‌డి.పి. లో 1 శాతం నిధులు, రాష్ట్రాల ద్వారా పౌరుల కేంద్రీకృత సంస్కరణలను చేపట్టడానికి అనుసంధానించబడి ఉన్నాయి. 

సంస్కరణల కోసం, వ్యయ విభాగం గుర్తించిన, నాలుగు పౌర కేంద్రీకృత ప్రాంతాలు :

(ఎ)      ఒక దేశం, ఒక రేషన్ కార్డు వ్యవస్థ అమలు; 

(బి)      సులభతర వ్యాపారం దిశగా సంస్కరణ; 

(సి)     పట్టణ స్థానిక సంస్థ / వినియోగ సంస్కరణలు మరియు

(డి)      విద్యుత్ రంగ సంస్కరణలు.

ఇప్పటి వరకు, 17 రాష్ట్రాలు నాలుగు నిర్ణీత సంస్కరణలలో కనీసం ఒక దానిని చేపట్టి,  సంస్కరణ అనుసంధాన రుణాలు తీసుకునే అనుమతులు పొందాయి.  వీటిలో 13 రాష్ట్రాలు ఒకే దేశం, ఒక రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయగా, 12 రాష్ట్రాలు సులభతర వ్యాపార సంస్కరణలు అమలు చేశాయి. కాగా, 6 రాష్ట్రాలు స్థానిక సంస్థల సంస్కరణలు;  2 రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్కరణలనూ, చేపట్టాయి.   సంస్కరణలతో అనుసంధానమైన రాష్ట్రాలకు, ఇప్పటివరకు, మొత్తం 76,512 కోట్ల రూపాయల మేర అదనపు రుణాల అనుమతిని జారీచేయడం జరిగింది.

 

*****



(Release ID: 1697264) Visitor Counter : 203