ప్రధాన మంత్రి కార్యాలయం
‘వరల్డ్ సస్‌టేనబుల్ డెవలప్‌మెంట్ సమిట్ 2021’ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
జలవాయు పరివర్తనానికి వ్యతిరేకం గా పోరాడడం కోసం జలవాయు న్యాయానికి పెద్ద పీట వేసిన ప్రధాన మంత్రి
మేము జిడిపి తాలూకు ఉద్గారాల తీవ్రత ను 2005 స్థాయిల నుంచి 33 మొదులుకొని 35 శాతం వరకు తగ్గించడానికి కట్టుబడి ఉన్నాము: ప‌్రధాన మంత్రి
Posted On:
10 FEB 2021 8:49PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వరల్డ్ సస్‌టేనబుల్ డెవలప్‌మెంట్ సమిట్ 2021’ ని బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ‘మన ఉమ్మడి భవిష్యత్తు ను పునర్ నిర్వహించుకోవడం: అందరి కోసం సురక్షితమైనటువంటి, భద్రమైనటువంటి వాతావరణం’ అనేది ఈ శిఖర సమ్మేళనానికి ఇతివృత్తం గా ఉంది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ గతి ని కొనసాగిస్తున్నందుకుగాను టిఇఆర్ఐ కి అభినందనలు తెలిపారు. ఈ తరహా ప్రపంచ వేదిక లు మన వర్తమానానికి, మన భవిష్యత్తు కు చాలా అవసరమని ఆయన అన్నారు. రెండు అంశాలు రాబోయే కాలాల్లో మానవ జాతి వికాస యాత్ర ఏ విధం గా పురోగమించేదీ నిర్వచిస్తాయని ఆయన చెప్పారు. వాటిలో ఒకటోది మన ప్రజల ఆరోగ్యం, కాగా రెండోది మన పృథ్వి ఆరోగ్యం; ఇవి రెండూ ఒకదాని తో మరొకటి ముడిపడి ఉన్నాయి అని ఆయన వివరించారు.
మన ధరిత్రి స్వస్థత ను గురించి మాట్లాడుకోవడానికి మనమంతా ఇక్కడ సమావేశం అయ్యాం అని ఆయన అన్నారు. మనం ఎదుర్కొంటున్న సవాలు తాలూకు స్థాయి ని గురించి విస్తృతమైన చర్చే జరిగింది; కానీ, మన ముందుకు వచ్చి నిలచే సమస్యల ను మనం సాంప్రదాయక దృష్టికోణం తో పరిష్కరించలేం అని ఆయన అన్నారు. మనం రూఢివాదాని కన్నా భిన్నం గా ఆలోచించాలి, మన యువజనుల పైన పెట్టుబడి పెట్టాలి, నిలకడతనం తో కూడిన అటువంటి అభివృద్ధి దిశ లో కృషి చేయవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
జలవాయు పరివర్తన కు వ్యతిరేకం గా పోరాటాన్ని సాగించడం కోసం జలవాయు న్యాయానికి పెద్ద పీట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. జలవాయు సంబంధిత న్యాయం అనేది ధర్మకతృత్వం తాలూకు దృష్టికోణం తో ప్రేరణ ను పొందింది, దీనిలో వృద్ధి అనేది నిరుపేద ప్రజల పట్ల మరింత సహానుభూతి నుంచే ప్రాప్తిస్తుందన్నారు. జలవాయు సంబంధిత న్యాయం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదగడానికి మరింత జాగా ను వదలివేయడం కూడా అని ఆయన వివరించారు. ఎప్పుడైతే మనలో ప్రతి ఒక్కరు వారి వ్యక్తిగత మరియు/ సామూహిక కర్తవ్యాలను అర్థం చేసుకొంటారో అప్పుడు జలవాయు సంబంధిత న్యాయం దక్కుతుంది అని ఆయన అన్నారు.
భారతదేశం ఉద్దేశ్యానికి వెనుక నిర్ధిష్టమైన చొరవ తాలూకు సమర్ధన ఉందని ఆయన అన్నారు. ఉత్సాహవంతమైన సార్వజనిక ప్రయాలసతో ప్రేరణ ను పొంది, మేము పారిస్ లో చేసిన వాగ్ధానాల తో పాటు నిర్దేశించుకొన్న లక్ష్యాల ను అధిగమించే మార్గం లో సాగుతున్నాం అని ఆయన అన్నారు. మేము 2005 స్థాయి నుంచి జీడీపీ తాలూకు ఉద్గారాల తీవ్రత (ఎమిశన్స్ పర్ యూనిట్ ఆఫ్ జీడీపీ) ని 33 శాతం నుంచి 35 శాతానికి తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. భారతదేశం భూ క్షయ తటస్థత పరం గా చేసిన తన వాగ్ధానం విషయం లో నిరంతరం పురోగమిస్తున్నది అని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశం లో నవీకరణయోగ్య శక్తి సైతం వేగాన్ని అందుకొంటోందన్నారు. మేము 2030వ సంవత్సరానికల్లా 450 గీగా వాట్స్ మేరకు అక్షయ శక్తి శక్తి ఉత్పాదన సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకొనే బాట లో పయనిస్తున్నామని ఆయన అన్నారు.
సమానమైన అందుబాటు కు తావు లేనప్పుడు నిలకడతనం తో కూడిన అటువంటి అభివృద్ధి అసంపూర్ణంగానే మిగిలిపోతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ దిశ లో కూడా భారతదేశం చక్కని ప్రగతి ని సాధించింది అన్నారు. 2019వ సంవత్సరం మార్చి నెల లో, భారతదేశం దాదాపు గా 100 శాతం విద్యుతీకరణ ను సాధించింది అని ఆయన తెలిపారు. మన్నికైన సాంకేతిక విజ్ఞానం, కొత్త కొత్త పోకడ లు పోతున్న నూతన ఆవిష్కరణల నమూనా ల ద్వారా ఇది సాధ్యపడిందన్నారు. ఉజాలా కార్యక్రమం ద్వారా 367 మిలియన్ ఎల్ఇడి బల్బు లు ప్రజల జీవితాల లో ఒక భాగం అయిన సంగతి ని గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. దీనితో ఒక్కొక్క సంవత్సరానికి 38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం జరిగిందన్నారు. జల్ జీవన్ మిశన్ కేవలం 18 నెలల కాలం లో 34 మిలియన్ కుటుంబాల ను నల్లా కనెక్షన్ లతో జోడించిందని ఆయన చెప్పారు. పేదరిక రేఖ కు దిగువన గల 80 మిలియన్ కు పైగా కుటుంబాలకు పిఎమ్ ఉజ్జ్వల యోజన ద్వారా స్వచ్ఛమైన వంట ఇంధనం అందిందన్నారు. మేము భారతదేశ ఎనర్జీ బాస్కెట్ లో సహజ వాయువు వాటా ను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
తరచు గా నిలకడతనం అంశం పై జరిగే సంప్రదింపులు హరిత శక్తి పై కేంద్రీకృతం అయిపోతున్నాయి, కానీ హరిత శక్తి సాధనం మాత్రమే అని ప్రధాన మంత్రి అన్నారు. మనం సాధించాలనుకొంటున్నది ఒక ఆకుపచ్చ తనం తో నిండివండే పుడమి ని ఆవిష్కరించడమే అని ఆయన గుర్తుచేశారు. అడవులన్నా, ఆకుపచ్చని కవచం అన్నా ఎంతో గౌరవాన్ని కట్టబెట్టే మా సంస్కృతి అసాధారణమైన ఫలితాల ను అందిస్తోంది అని ఆయన అన్నారు. నిలకడతనం కలిగిన అభివృద్ధి ని సాధించాలన్న మా ఉద్యమం లో పశు పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా మిళితమై ఉంది అని ఆయన అన్నారు. గడచిన అయిదేళ్ళు, ఏడేళ్ళ కాలం లో సింహాలు, పులులు, చిరుతల సంఖ్య తో పాటు, గంగా నది లో మనుగడ సాగించేటటువంటి డాల్ఫిన్ ల సంఖ్య కూడా పెరిగిపోయిందని ఆయన వెల్లడించారు.
ప్రధాన మంత్రి రెండు విషయాలను శ్రోత ల దృష్టి కి తీసుకు వచ్చారు. అవి.. ఒకటో అంశం కలసికట్టుగా ఉండటం, కాగా రెండో అంశం నూతన ఆవిష్కరణ. నిలకడతనం తో కూడినటువంటి అభివృద్ధి ని సామూహిక ప్రయాస ల ద్వారా మాత్రమే సాధించగలుగుతాం అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి జాతీయ హితం కోసం ఆలోచిస్తూ ఉంటే, ప్రతి ఒక్క దేశం ప్రపంచ హితం దిశ గా ఆలోచిస్తూ ఉంటే గనక అప్పుడు మాత్రమే నిలకడతనం తో కూడిన అభివృద్ధి అనేది వాస్తవ రూపాన్ని దాల్చుతుంది అని ఆయన చెప్పారు. భారతదేశం ఈ దిశ లో అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) ద్వారా ఒక ప్రయత్నాన్ని చేసిందన్నారు. ప్రపంచం అంతటా ఉన్న అత్యుత్తమ అభ్యాసాల ను అవలంబించడానికి మన దేశాలు, మన మనస్సుల ను తెరచిపెట్టుకోవాలని శ్రోతల కు ఆయన విజ్ఞప్తి చేశారు.
నూతన ఆవిష్కరణ ను గురించి ఆయన ప్రస్తావించి, నవీకరణ యోగ్య శక్తి, పర్యావరణ మైత్రీపూర్వకమైన సాంకేతిక విజ్ఞానం తదితర అంశాలపై కృషి చేస్తున్న స్టార్ట్- అప్స్ అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. విధాన నిర్ణేతలు గా మనం ఆ కోవ కు చెందిన ప్రయత్నాల ను ఎన్నిటినో సమర్ధించవలసిన అవసరం ఉందన్నారు. మన యువత లోని ఉత్సాహం తప్పక అసాధారణమైనటువంటి ఫలితాల ను అందిస్తుందన్నారు.
విపత్తు నిర్వహణ సామర్ధ్యాల ను గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ప్రస్తావించారు. ఈ విషయం లో మానవ వనరుల అభివృద్ధి పట్ల, సాంకేతిక విజ్ఞానం పట్ల శ్రద్ధ అవసరమన్నారు. కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) లో భాగం గా మేము ఈ దిశ లో కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. నిలకడతనం తో కూడిన అభివృద్ధి (సస్‌టేనబుల్ డెవలప్‌మెంట్) ని మరింత ముందుకు తీసుకుపోవడానికి చేతనైన ప్రయత్నమల్లా చేయడానికి భారతదేశం తయారు గా ఉంది అని ఆయన భరోసా ను ఇచ్చారు. మనకు మానవ ప్రధానమైనటువంటి దృష్టి కోణం అనేది ఉందంటే గనక అది ప్రపంచ హితానికై శక్తి ని ఇంతలంతలు గా పెంచగలిగేది కాగలదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో గుయాన సహకారి గణతంత్రం అధ్యక్షుడు మాన్యశ్రీ డాక్టర్ మొహమద్ ఇర్ ఫాన్ అలీ, న్యూ పాపువా గినీ ప్రధాని శ్రీ జేమ్స్ మారపే, మాల్దీవ్స్ గణతంత్రం పీపుల్స్ మజ్ లిస్ స్పీకర్ శ్రీ మొహమ్మద్ నశీద్, ఐక్య రాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ- జనరల్ అమీనా జె. మొహమ్మద్, భారత ప్రభుత్వ పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ లు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1697053)
Visitor Counter : 277
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam