ప్రధాన మంత్రి కార్యాలయం
‘‘ప్రాజెక్ట్ అర్థ్ గంగ’’ పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి : అసమానత్వాల ను సరిచేయడమూ, ప్రజల ను జోడించడమూను
Posted On:
15 MAY 2020 8:00PM by PIB Hyderabad
‘‘ప్రాజెక్ట్ అర్థ్ గంగ’’ ను అమలు పరచడం లో భాగం గా రూపకల్పన చేసిన ప్రణాళిక ల తాలూకు పురోగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమీక్షించారు.
కాన్ పుర్ లో నేశనల్ గంగ కౌన్సిల్ తాలూకు ఒకటో సమావేశం 2019వ సంవత్సరం లో డిసెంబరు 14వ తేదీ నాడు జరిగిన సందర్భం లో గంగా నది ఒడ్డుల వెంబడి ఆర్థిక కార్యకలాపాల కు పుష్టి ని సంతరించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘అర్థ్ గంగ’ ను రూపుదిద్దారు.
గంగా నది ని నౌకాయానాని కి సురక్షితమైన వ్యవస్థ గా అభివృద్ధి పరచడమే ధ్యేయం గా జల మార్గ వికాస్ పథకాన్ని (జెఎమ్ విపి) రూపొందించడమైంది; ఈ పథకాన్ని ప్రపంచ బ్యాంకు యొక్క ఆర్థిక సహాయం మరియు యంత్ర సంబంధిత సహాయం తోను అమలు పరచడం జరుగుతున్నది. స్థానిక సముదాయం ప్రమేయం తో గంగా నది లోపల మరియు గంగా నది పరిసర ప్రాంతాల లో ఆర్థిక కార్యకలాపాల పైన శ్రద్ధ తీసుకొంటూ జెఎమ్ విపి యొక్క రి-ఇంజీనియర్ ప్రక్రియ కోసమని ‘ప్రాజెక్ట్ అర్థ్ గంగ’ కు రూపకల్పన చేయడమైంది.
గంగా నది తీరం వెంబడి ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ లలో ఆర్థిక కార్యకలాపాల కు పుష్టి ని సంతరించడం కోసం ‘‘ప్రాజెక్ట్ అర్థ్ గంగ’’ లో భాగం గా సముదాయ స్థాయి లో ఆర్థిక కార్యకలాపాల ను పెంచేందుకు గాను గంగా నది పొడవున చిన్న చిన్న రేవు కట్టల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గంగా నది నడికట్టు మీదుగా నెలకొన్న నాలుగు రాష్ట్రాల లోను గంగా నది పైన తేలియాడే రేవు కట్టల ను దాదాపు గా 40 తో పాటు 10 జత ల రొ-రొ కొనల ను నిర్మించే ప్రణాళిక ఉంది. ఇది స్థానిక ఉత్పత్తుల చేరవేత లో రైతుల కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలుగుతుంది.
వ్యాపారం పరమైనటువంటి ప్రయోజనాల ను అందజేయడం, విపణుల ను అందుబాటు లోకి తీసుకురావడం తో పాటు స్థానిక సముదాయం యొక్క ఆర్థిక వృద్ధి కి మరియు ప్రయాణికుల సౌలభ్యత కు ‘అర్థ్ గంగ’ ప్రాజెక్టు పూచీ పడుతుంది. అంతేకాక, ప్రభుత్వ/ప్రయివేటు రంగాల యొక్క సామర్థ్యం పెంపుదల కు మరియు పెద్ద ఎత్తు న నైపుణ్యాల వృద్ధి కి కూడా దోహద పడుతుంది. తదుపరి 5 సంవత్సరాల కాల క్రమం లో 1,000 కోట్ల కు పైగా ఆర్థిక లబ్ధి ని ప్రసాదించేటటువంటి ఆర్థిక అభివృద్ధి గంగా నదీ పరీవాహక ప్రాంతం లో చోటు చేసుకోవడం లో ఒక ఉత్ప్రేరకం గా ‘ప్రాజెక్ట్ అర్థ్ గంగ’ పనిచేస్తుంది.
శిప్పింగ్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ మన్ సుఖ్ ఎల్. మాండవియా కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.
‘అర్థ్ గంగ’ యొక్క విపుల ప్రణాళిక
***
(Release ID: 1694723)
Visitor Counter : 161