ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆశా సిబ్బంది సంక్షేమం

Posted On: 02 FEB 2021 4:29PM by PIB Hyderabad

"భారతదేశ కొవిడ్‌-19 ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత, అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ" కింద, కొవిడ్‌-19 నిర్వహణ, నియంత్రణ కోసం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు/యూటీలకు రూ.6309.91 కోట్ల కేటాయింపు జరిగింది.

    కొవిడ్‌ విధుల్లో ఉన్న అందరు ఆరోగ్య సిబ్బందితోపాటు, ఆశా వర్కర్లకు కూడా "ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ ఇన్సూరెన్స్‌" కల్పించాం. వీరు కొవిడ్‌ కారణంగా చనిపోతే రూ.50 లక్షల పరిహారం వారి కుటుంబానికి అందుతుంది. ఆశా సిబ్బందికి నెలకు వెయ్యి రూపాయల ప్రోత్సాహకం కూడా అందించాం. గతేడాది నవంబర్‌ వరకు రాష్ట్రాలు, యూటీలు అందించిన నివేదికల ప్రకారం, 9,53,445 మంది ఆశాలు, 36,716 మంది ఆశా ఫెసిలిటేటర్లు కొవిడ్‌ అనుబంధ నగదును అందుకున్నారు. ఇందులో ఎక్కడా అలసత్వం జరగలేదు.

ఆశాలు సామాజిక ఆరోగ్య కార్యకర్తలు. ఈ క్రింది అంశాలు సహా పని ఆధార ప్రోత్సాహకాలకు వారు అర్హులు:
    ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (రూ.330 ప్రీమియంను ప్రభుత్వం చెల్లించింది)
    ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (రూ.12 ప్రీమియంను ప్రభుత్వం చెల్లించింది)
    ప్రధానంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ (ప్రీమియంలో 50 శాతాన్ని ప్రభుత్వం, 50 శాతాన్ని లబ్ధిదారు చెల్లించారు) 

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్‌ చౌబే ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
 

 

*****


(Release ID: 1694490) Visitor Counter : 254