ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం

దేశవ్యాప్తంగా టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది 23 లక్షల పైనే
12 వ రోజున సాయంత్రం 6 వరకు టీకాలు వేయించుకున్నవారు 3 లక్షల మంది

టీకాల తరువాత ఆస్పత్రిలో చేరినవారు 0.0007% మాత్రమే
టీకాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన లేదా మరణించినవారెవరూ లేరు

Posted On: 27 JAN 2021 7:45PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ టీకాల కార్యక్రమం 12వ రోజు కూడా విజయవంతంగా సాగింది.

ఇప్పటివరకూ టీకాలు వేయించుకున ఆరోగ్య సిబ్బంది సంఖ్య నేటికి 23 లక్షలు దాటి సాయంత్రం 6 గంటలకు

23,28,779 కి చేరింది.  ఇందుకోసం మొత్తం 41,599  శిబిరాలు నిర్వహించారు. తాత్కాలిక నివేదిక ప్రకారం  ఈరోజు

2,99,299  మందికి టీకాలు వేశారు. ఈ రోజు 5308 శిబిరాలు జరిగాయి. రాత్రి పొద్దుపోయాక తుది నివేదిక అందుతుంది.

 

ఈ రోజు టీకాలు వేయించుకున్నవారిలో 79% మంది 5 రాష్ట్రాలు ( కర్నాటక,  పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర,

మధ్యప్రదేశ్, రాజస్థాన్) కు చెందినవారు.

ఈ రోజు టీకాలు వేయించుకున్నవారి సంఖ్య రాష్ట్రాలవారీగా ఇలా ఉంది:

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1

ఆంధ్రప్రదేశ్  

8,491

2

అస్సాం

162

3

బీహార్

606

4

చండీగఢ్

285

5

చత్తీస్ గఢ్

10,906

6

ఢిల్లీ

6,441

7

గోవా

476

8

గుజరాత్

1,366

9

హర్యానా

5,353

10

హిమాచల్ ప్రదేశ్

461

11

జమ్మూ కశ్మీర్

158

12

జార్ఖండ్

5,287

13

కర్నాటక

33,124

14

కేరళ

10,541

15

లద్దాఖ్

141

16

మధ్యప్రదేశ్

60,194

17

మహారాష్ట్ర

37,575

18

మణిపూర్

360

19

మేఘాలయ

482

20

మిజోరం

872

21

నాగాలాండ్

547

22

ఒడిశా

1,195

23

పంజాబ్

4,636

24

రాజస్థాన్

71,632

25

సిక్కిం

257

26

తమిళనాడు

4,316

27

ఉత్తరాఖండ్

172

28

పశ్చిమ బెంగాల్

33,263

                                     మొత్తం

2,99,299

 

నేడు 12 వ రోజు సాయంత్రం 6 వరకు టీకాల అనంతరం ప్రభావితమైన 123 కేసులు నమోదు కాగా  వారిలో

16 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటివరకు 0.0007% మంది మాత్రమే మొత్తంగా ఆస్పత్రిలో చేరారు.  

గత 24 గంటలలో ఒక వ్యక్తి బాక్టీరియా సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఈ నెల

 23న టీకా వేయగా 24 న ఆస్పత్రిలో చేరారు. 

ఇప్పటివరకు మొత్తం 9 మంది మరణించగా వీటిలో ఏ ఒక్కటీ కోవిడ్ టీకాకు సంబంధించినది కాదు.

గడిచిన 24 గంటలలో ఒడిశాకు చెమ్దిన 23 ఏళ్ళ వ్యక్తి  చనిపోయాడు.  పోస్ట్ మార్టమ్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే, నేటి వరకూ టీకా సంబంధమైన మరణం ఒక్కటీ నమోదు  కాలేదు.


(Release ID: 1692808) Visitor Counter : 220