ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
2021 సీజను కు కొబ్బరి కనీస మద్ధతు ధర కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
27 JAN 2021 2:22PM by PIB Hyderabad
2021 సీజను కు కొబ్బరి కి కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్‌పి) కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం ఆమోదాన్ని తెలిపింది.
2021 సీజను కు మిలింగ్ కు ఉపయోగపడే ఉత్తమ సగటు నాణ్యత (ఫేర్ ఏవరిజ్ క్వాలిటి- ఎఫ్ఎక్యు) కలిగిన కొబ్బరి రకాని కి కనీస మద్దతు ధర ను (ఎమ్ఎస్‌పి) 375 రూపాయల మేరకు పెంచి, దానిని ఒక్కొక్క క్వింటాలు కు 10,335 రూపాయలకు చేర్చడమైంది. 2020 లో ఈ రకం కొబ్బరి కి ఎమ్ఎస్‌పి ఒక్కో క్వింటాలు కు 9,960 రూపాయలు గా ఉండింది. గుండు కొబ్బరి ఎమ్ఎస్‌పి ని కూడా 2021 సీజను కు 300 రూపాయల మేర పెంచి, దానిని ఒక్కొక్క క్వింటాలు కు 10,600 రూపాయల కు చేర్చడం జరిగింది. 2020లో ఈ రకం కొబ్బరి కి ఎమ్ఎస్‌పి ఒక్కో క్వింటాలు కు 10,300 రూపాయలు గా ఉంది. ప్రకటించిన ధర, అఖిల భారత స్థాయి లో సరాసరి ఉత్పాదన వ్యయం తో పోలిస్తే మిల్లు కొబ్బరి కి 51.87 శాతం ప్రతిఫలం, గుండు కొబ్బరి కి 55.76 శాతం అధిక ప్రతిఫలానికి పూచీ పడుతోంది.
వ్యావసాయిక వ్యయాల మరియు ధరల సంఘం (సిఎసిపి) సిఫారసు ల పై ఆధారపడి, ఈ మేరకు ఆమోదాన్ని తెలపడమైంది.
2021 సీజను కు కొబ్బరి తాలూకు ఎమ్ఎస్‌పి లో పెరుగుదల- అఖిల భారత సరాసరి ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల స్థాయి లో ఎమ్ఎస్‌పి ని ఖరారు చేయాలని 2018-19 బడ్జెటు లో ప్రభుత్వం ప్రకటించిన సూత్రానికి అనుగుణం గా- ఉన్నది.
రైతుల ఆదాయాల ను 2022 కల్లా రెట్టింపు చేసే దిశ లో కనీసం 50 శాతం లాభానికి పూచీపడడం అనేది ఒక ముఖ్యమైన, ప్రగతిశీలమైన చర్య గా ఉంది.
కొబ్బరి ని పండించే రాష్ట్రాల లో ఎమ్ఎస్‌పి ని ఆచరణ లోకి తీసుకురావడం కోసం నేశనల్ ఎగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎఎఫ్ఇడి.. ‘నాఫెడ్’), నేశనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సిసిఎఫ్) లు సెంట్రల్ నోడల్ ఏజెన్సీల రూపం లో వాటి పాత్ర ను నిర్వర్తిస్తూ ఉంటాయి.
2020 సీజను కు, ప్రభుత్వం 5053.34 టన్నుల గుండు కొబ్బరి ని, 35.58 టన్నుల మిలింగ్ రకం కొబ్బరి ని సేకరించడం తో 4896 మంది కొబ్బరి రైతుల కు ప్రయోజనం కలిగింది.
****
(Release ID: 1692715)
Visitor Counter : 252
Read this release in:
Punjabi
,
Odia
,
Malayalam
,
Marathi
,
Tamil
,
Kannada
,
Assamese
,
Bengali
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Gujarati