రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్ ముందు కాలంతో పోలిస్తే కోవిడ్ స‌వాళ్ళ న‌డుమ భార‌తీయ రైల్వే ప్ర‌స్తుతం 65% మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌ను న‌డుపుతోంది


కోవిడ్ ముందు కాలంలో న‌డిచిన 1768 మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే ప్ర‌స్తుతం రోజూ 1138 మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్, పండుగ రైళ్ళ‌ను న‌డుపుతున్న భార‌తీయ రైల్వేలు

భార‌తీయ రైల్వేల‌లో మొత్తం 4807 స‌బ‌ర్బ‌న్ రైల్ సేవ‌లు న‌డుస్తున్నాయి

జ‌న‌వ‌రి మాసంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 115 మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌ను న‌డిపేందుకు ఆమోద ముద్ర‌

దేశంలోని అన్ని ముఖ్య‌మైన ప్ర‌దేశాలకూ ఈ రైళ్ళ ద్వారా అనుసంధానం

కోవిడ్ స‌వాళ్ళు ఉన్న‌ప్ప‌టికీ రైళ్ళు న‌డుస్తున్నాయి

మ‌రిన్ని రైళ్ళ‌ను న‌డ‌పాల్సిన అవ‌స‌రంపై నిరంత‌ర స‌మీక్

Posted On: 25 JAN 2021 6:07PM by PIB Hyderabad

కోవిడ్ స‌వాళ్ళను త‌ట్టుకొని భార‌తీయ రైల్వేలు మొత్తం 1138 పండుగ‌లకు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు స‌హా  మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌ను భార‌తీయ రైల్వేల‌కు చెందిన భిన్న జోన్ల‌లో న‌డుపుతోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని గ‌మ్య స్థానాలు కూడా ప్ర‌త్యేక రైళ్ళ‌తో అనుసంధానం అయి ఉన్నాయి. మ‌రిన్ని రైళ్ళ‌ను న‌డిపాల్సిన అవ‌స‌రాన్ని గురించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష నిర్వ‌హిస్తోంది. 
కోవిడ్ ముందు కాలంలో భార‌తీయ రైల్వేలు రోజుకు స‌గ‌టున 1768 మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌ను న‌డుపుతోంది.
జ‌న‌వ‌రి మాసం 2021కు మొత్తం 115 మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్ళ‌ను న‌డిపేందుకు ఆమోదించ‌డం గ‌మ‌నార్హం. 
అద‌నంగా, ప్ర‌స్తుతం భార‌తీయ రైల్వేలు రోజుకు 4807 స‌బ‌ర్బ‌న్ రైలు స‌ర్వీసులు వివిధ భార‌తీయ రైల్వే జోన్ల‌లో న‌డుపుతోంది. కోవిడ్ ముందు స‌మ‌యంలో స‌గ‌టున 5881 స‌బ‌ర్బ‌న్ రైళ్ళ‌ను న‌డిపింది. 
ఇవే కాకుండా, 196 పాసింజ‌ర్ రైల్ సేవ‌ల‌ను భార‌తీయ రైల్వేలు న‌డుపుతోంది. కోవిడ్ ముందు కాలంలో దేశ‌వ్యాప్తంగా 3634 ప్యాసింజ‌ర్ రైళ్ళు న‌డిచేవి. 

 

 

***



(Release ID: 1692385) Visitor Counter : 182