ఆయుష్
ఆయు సంవాద్ ప్రచారం ( నా ఆరోగ్యం నా బాధ్యత)
Posted On:
25 JAN 2021 3:31PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, న్యూఢిల్లీ సంయుక్తంగా ఆయుర్వేద- కోవిడ్ 19 మహమ్మారి గురించి నిర్వహిస్తున్న భారీ ప్రజావగాహన కార్యక్రమాల్లో ఆయు సంవాద్ (నా ఆరోగ్యం నా బాధ్యత) అన్నది ప్రధానమైంది. భారత పౌరుల కోసం దేశ వ్యాప్తంగా ఆయుర్వేద వైద్యుల ద్వారా 5 లక్షల కన్నా ఎక్కువగా నిర్వహించనున్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎవిసిసి వేదికపై జనవరి 18 నుంచి 21,2021 వరకు శిక్షకులకు ఆన్‌లైన్‌లో శిక్షణా కార్యక్రమాన్ని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నిర్వహించింది. భారత్‌లోని ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాళ్ళు, డైరెక్టర్లు, వైద్య అధికారులు, పిజి, పిహెచ్‌డి స్కాలర్లు, ప్రాక్టిషనర్లు, ఇతర భాగస్వాములందరికీ ఈ శిక్షణను నిర్వహించింది. ఈ శిక్షణా కార్యక్రమంలో పద్మ భూషణ్ విడి. దేవేంద్ర త్రిగుణ, ఆయుష్ కార్యదర్శి కార్యదర్శి విడి, రాజేష్ కొటేచా, ఆయుష్ అదనపు కార్యదర్శి ప్రమోద్ కుమార్ పాఠక్, సంయుక్త కార్యదర్శి పి.ఎన్. రంజీత్ కుమార్, రోషన్ జగ్గీ, ఆయుర్వేద సలహాదారులు మనోజ్ నేసారీ, సిసిఐఎం బోర్డ్ ఆఫ్ గవర్నర్ల చైర్మన్ విడి, జయంత్ దేవ్‌పూజారీ, ఎఐఐఎ డైరెక్టర్ విడి. తనూజ నేసారీ, ఎఐఐఎ అధ్యాపకులు విడి. మహేష్ వ్యాస్, విడి, మేధా కులకర్ణి, విడి, రమాకాంత్ యాదవ్, విడి. మీరా భోజానీ కార్యక్రమంలో పాలు పంచుకున్న వారికి మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఎఐఐఎ జాయింట్ డైరెక్టర్ విడి. ఉమేష్ తగడే వ్యవహరించారు.
రిఫరెన్స్ కోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను, బుక్‌లెట్‌ను ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద రూపొందించింది. శిక్షణ పొందిన సిబ్బంది ప్రభుత‌్వ కార్యాలయాల్లో, ప్రభుత్వేతర రంగ సిబ్బంది, పాఠశాలలు, కళాశాలలు, పంచాయితీరాజ్ వ్యవస్థలు, గ్రామ సభలు, పరిశ్రమలు, వివిధ హౌజింగ్ సొసైటీలు, ఎన్జీవోలు, మహిళా ఉద్యోగ్ లు, ఆషా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులకు లెక్చర్లను నిర్వహిస్తారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఎఐఐఎ, సిసిఐఎం, సిసిఆర్ ఎస్, ఆర్ ఎవి, ఇతర ఎన్ ఐఎస్, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్లకు రిఫరెన్స్‌గా పిపిటి, ట్రైనింగ్ మెటీరియల్‌ను అధికారిక వెబ్‌సైట్లలో అప్ లోడ్ చేసి, దేశవ్యాప్తంగా లెక్చర్లను నిర్వహించేందుకు మార్గదర్శనం చేస్తారు.
భారత దేశ ప్రజలకు జనవరి 26 నుంచి మార్చి 30, 2021వరకు ప్రతి శిక్షణ పొందిన వ్యక్తీ చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, కనీసం 5 లెక్యర్లను ఇవ్వాలి.
ప్రచార లక్ష్యంః
ఈ ప్రచార ప్రధాన లక్ష్యం ఈ లెక్చర్ల పరంపరతో చైతన్యాన్ని సృష్టించి, సామాన్య ప్రజానీకానికి కోవిడ్ 19 మహమ్మారికి ఆయుర్వేద అన్న ఇతివృత్తాన్ని గురించి అవగాహన పెంచడం. దేశవ్యాప్తంగా 01 కోట్ల లక్ష్యిత ప్రేక్షకులకు 05 లక్షల లెక్చర్లను ఒక పిపిటి నిర్మితి ద్వారా సమాచారాన్ని ఎటువంటి తేడాలు లేకుండా అందించేందుకు ఈ ప్రచారం ప్రయత్నం చేస్తుంది. ఆయుర్వేద ద్వారా కోవిడ్ 19 నిర్వహణలో నివారణ, ప్రోత్సాహక, స్వస్థత చేకూర్చే, పునరావాసం అన్న అంశాల పాత్రపై ప్రచారం దృష్టి పెడుతుంది.
రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్లు, ఎన్ ఎఎం బృందం ద్వారా పర్యవేక్షణ జరుగనుంది. లెక్చర్లు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌పై నివేదికను రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ మే 2021, మొదటి వారంలో సమర్పిస్తారు.
****
(Release ID: 1692260)
Visitor Counter : 238