హోం మంత్రిత్వ శాఖ

సుభాష్ చంద్ర‌బోస్ ఆప్ద‌‌ ప్ర‌భంద‌న్ పుర‌స్కార్ 2021

Posted On: 23 JAN 2021 5:38PM by PIB Hyderabad

భార‌త‌దేశంలోని వ్య‌క్తులు, సంస్థ‌లు, విప‌త్తుల నిర్వ‌హ‌ణ రంగంలో  వారు అందించిన విలువైన , నిస్వార్థ సేవ‌ల‌కు గుర్తుగా భార‌త ప్ర‌భుత్వం సుభాష్ చంద్ర‌బొస్ ఆప్ద ప్ర‌భంధ‌న్ పుర‌స్కార్ పేరుతో వార్షిక అవార్గుల‌ను ఏర్పాటు చేసింది. ఈ అవార్డుల‌ను ప్ర‌తి ఏడాది నేతాజి సుభాష్  చంద్ర‌బొస్ జ‌యంతి నాడు అయిన జ‌న‌వ‌రి 23న ప్ర‌క‌టిస్తారు. ఈ అవార్డు  కింద సంస్థ‌ల‌కు అయితే రూ 51 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు, స‌ర్టిఫికేట్ ,వ్య‌క్తుల‌కు అయితే 5 ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు , స‌ర్టిఫికేట్ ఇస్తారు.
ఈ ఏడాది ఈ అవార్డుకు 2020 జూలై 1 నుంచి నామినేష‌న్ల‌ను ఆహ్వానించారు. 2021 సంవ‌త్స‌రానికి అవార్డు స్కీమ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్, సోష‌ల్ మీడియా ద్వారా విస్తృత ప్ర‌చారం క‌ల్పించారు. ఈ ప్ర‌క‌ట‌న‌కు స్పందించి వివిధ సంస్థ‌లు వ్య‌క్తుల నుంచి అర్హ‌త క‌లిగిన 371 నామినేష‌న్లు వ‌చ్చాయి. 2021 సంవ‌త్స‌రానికి 1)సుస్థిర ప‌ర్యావ‌ర‌ణం, ప‌ర్యావ‌రణ అభివృద్ధి సొసైటీ (సంస్థ‌ల కేట‌గిరీలో) (2) వ్య‌క్తుల కేట‌గిరీలో డాక్ట‌ర్ రాజేంద్ర కుమార్ భండారిల‌ను విప‌త్తుల నిర్వహ‌ణ‌లో‌ సుభాష్ చంద్ర‌బోస్ ఆప్ద ప్ర‌బంధ‌న్ పుర‌స్కార్ కు ఎంపిక చేశారు.
2020 సంవ‌త్స‌రానికి సంస్థ‌ల‌ కేట‌గిరీలో ఉత్త‌రాఖండ్ కు చెందిన డిజాస్ట‌ర్ మిటిగేష‌న్‌, మేనేజ్‌మెంట్ సెంట‌ర్‌ను , వ్య‌క్తుల కేట‌గిరీలో శ్రీ కుమార్ మున్న‌న్ సింగ్ ఎంపికైన విష‌యం తెలిసిందే.
.విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి 2021 సంవ‌త్స‌రానికి అవార్డులు గెలుపొందిన వారి ప్ర‌తిభా విశేషాలు:

1) స‌స్టెయిన బుల్ ఎన్విరాన్‌మెంట్‌, ఎక‌లాజిక‌ల్ డ‌వ‌ల‌ప్‌మెంట్ సొసైటీ (ఎస్‌.ఇ.ఇ.డి.ఎస్‌) ప్ర‌కృతి విప‌త్తుల‌నుంచి క‌మ్యూనిటీలు త‌ట్టుకుని నిల‌బ‌డేలా చేయ‌డంలో అద్భుత కృషి చేసింది. ప్ర‌కృతి విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండ‌డం, పున‌రావాసం, స్థానిక సామ‌ర్ద్యాల నిర్మాణం, వివిధ రాష్ట్రాల‌లో క‌మ్యూనిటీల స్థాయిలో రిస్క్ త‌గ్గింపు వంటి కార్య‌క‌లాపాల విష‌యంలో విశేష కృషి చేస్తున్న‌ది.
స్థానిక అంశాల‌పై లోతైన అవ‌గాహ‌న క‌లిగిన స్థానిక నాయ‌క‌త్వాలు, పెద్ద పెద్ద ప‌ధ‌కాల కు ఆవ‌ల‌గ‌ల వారిని చేరుకునే సామ‌ర్ధ్యాలు క‌లిగి ఉంటాయి. స్థానిక నాయ‌కులు స్థానిక వ్య‌వ‌స్థ‌లు, రాజ‌కీయాలు, సంస్కృతిపై మంచి  అవ‌గాహ‌న క‌లిగి ఉంటారు. ఎస్ఇఇడిఎస్ సంస్థ  క‌మ్యూనిటీల ఇబ్బందులు తొల‌గించేందుకు తమ సామ‌ర్ధ్యాల‌ను వినియోగిస్తుంది.ఎస్‌.ఇ.ఇ.డి.ఎస్ సంస్థ ప‌లురాష్ట్రాల‌లో పాఠ‌శాల‌ల
భ‌ద్ర‌త విష‌యంలో ప‌నిచేస్తున్న‌ది. ఇది టీచ‌ర్లు, స్థానిక నాయ‌క‌త్వాలు ఆయా ప్రాంతాల‌లో రిస్క్‌ల‌ను గుర్తించేందుకు,అంచ‌నా వేసేందుకు తోడ్ప‌డుతున్న‌ది. వీరు పౌర వేదిక‌ల‌ను ప్రోత్స‌హించారు. ఇందులో స్థానిక సంక్షేమ సంఘాల‌కు , మార్కెట్ ట్రేడ‌ర్ల అసోసియేష‌న్లు , రాష్ట్రాల‌కు చెందిన స్థానిక గ్రూప్‌లు స‌భ్యులుగా ఉన్నారు. వీరు జిల్ఆ అధికారులు, క‌మిటీల‌కు మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌లుగా ప‌నిచేస్తారు. వీరు ప్ర‌జారోగ్యం, భ‌ద్ర‌త   కార్య‌క్ర‌మాల‌ను సంయుక్తంగా అమ‌లు చేయ‌డంలో స‌హ‌క‌రిస్తారు. 2001,2005,2015 ల‌లో ఇండియాలో భూకంపం అనంత‌రం ఎస్‌.ఇ.ఇ.డి.ఎస్  సంస్థ నిర్మాణ మేస్త్రీల‌ను స‌మీక‌రించి వారికి ప్ర‌కృతి విప‌త్తుల‌ను త‌ట్టుకునే నిర్మాణాల గురించి తెలిపింది. వీరు స్థానిక క‌మ్యూనిటీల‌కు ఈ విష‌యంలో రాయ‌బారులుగా త‌యార‌య్యారు. విప‌త్తుల‌కు సంబంధించి స‌త్వ‌ర హెచ్చ‌రిక‌ల‌కు కృత్రి మ మేధ‌తో కూడిన సాంకేతిక ప‌రిజ్ఙానాన్ని , ఫీడ్ బ్యాక్‌కు సంబంధించిన ప‌రిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇది స‌త్వ‌ర నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి , విపత్తుల‌ను ఎదుర్కొవ‌డంలో స‌న్న‌ద్ద‌త‌కు ఉప‌క‌రిస్తుంది. 

2) డాక్ట‌ర్ రాజేంద్ర కుమార్ భండారి భార‌త‌దేశంలోని జియో ముప్పుకు సంబంధించి శాస్త్రీయ అధ్య‌య‌నానికి పునాదివేసిన వారు. ఆయ‌న సిఎస్ఐఆర్‌- సెంట్ర‌ల్ బిల్డింగ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ సిబిఆర్ ఐ వ‌ద్ద,మ‌రో మూడు కేంద్రాల‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం దానికి సంబంధించి తొలి శాస్త్రీయ అధ్యయ‌నాల‌కు పునాది వేశారు. భార‌త‌దేశంలో విప‌త్తుల‌పై ఆయ‌న అధ్య‌య‌నాలు చేశారు. ఇందుకు సంబంధించి అధునాత‌న రాడార్ల‌ను, జియోటెక్నిక‌ల్ డిజిట‌ల్ సిస్ట‌మ్‌ను , వైబ్రేటింగ్ వైర్ పీజోమీట‌ర్లు, లేస‌ర్ పార్టిక‌ల్ అన‌లైజ‌ర్‌, పైల్ డ్రైవ్ అన‌లైజ‌ర్‌, అకౌస్టిక్ ఎమిష‌న్ టెక్నాల‌జీ ని లోతైన ప‌రిశోధ‌న‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మానిట‌రింగ్‌, రిస్క్ అన‌ల‌సిస్‌, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వంటి వాటికి సంబంధించి హెచ్చ‌రిక‌లు వంటి వాటి విష‌యంలో అధునాత‌న సాంకేతిక  ప‌రిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విప‌త్త‌లను త‌ట్టుకునే ఆవాసాల నిర్మాణం, జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానిఇక సంబంధించి శాస్త్రీయ ప‌రిశోద‌న‌లు, ఇంజ‌నీరింగ్ నైపుణ్యాల‌కు ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు. డైర‌క్ష‌న‌ల్ డ్రిల్లింగ్ ద్వారా  ద్వారా కోండ‌చ‌రియ‌లు ప‌డిపోకుండా చూడ‌డం, దేశంలో కోండ‌చ‌రియ‌లు ప‌డిపోవ‌డానికి సంబంధించి న ముప్పు పై అట్లాస్ రూప‌క‌ల్ప‌న వంటివి ముఖ్య‌మైన‌వి. దీనిని బిల్డింగ్ మెటీరియ‌ల్స్ టెక్నాల‌జీ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ (బిఎంపిటిపిసి) ప్ర‌చురించింది.

నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ నాలెడ్జ్ నెట్‌వ‌ర్క్ కోసం ఆయ‌న చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను 2001లో  ఉన్న‌త‌స్థాయి క‌మిటీ సిఫార్సుల‌లో భాగం అయ్యాయి. ఇండియ‌న్ నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ ఇంజ‌నీరింగ్ (ఐఎన్ఎఇ) ఫోరం కు ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హించారు. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వంటి విప‌త్తును ఎదుర్కొనేందుకు కార్యాచ‌ర‌ణ‌తో కూడిన సిఫార్సుల కు ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హించారు. అలాగే ఆయ‌న విప‌త్తుల‌ను ఎదుర్కోవ‌డంపై విద్యార్ధుల‌కు పాఠ్యాంశాలు రూపొందించారు.

 

***

 



(Release ID: 1691867) Visitor Counter : 287