మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

దేశంలో ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) పరిస్థితి

Posted On: 20 JAN 2021 6:01PM by PIB Hyderabad

బుధవారం ‍(20.01.2021‌) వరకు, ఆరు రాష్ట్రాల్లోని (కేరళ, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌) పౌల్ట్రీ పక్షుల్లో, 10 రాష్ట్రాల్లోని ‍(మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌) కాకులు/వలస పక్షులు/అటవీ పక్షుల్లో ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా నిర్ధారణ అయింది. 

    పంజాబ్‌ రాష్ట్రం డేరా బస్సి, ఎస్‌ఏఎస్‌ నగర్‌లో పౌల్ట్రీ పక్షుల నమూనాల్లో; ఎస్‌ఏఎస్‌ నగర్‌, పింజోర్‌, పంచకులలో కాకుల్లోనూ వైరస్‌ను బయటపడింది. 

    మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణాలోని ప్రభావిత ప్రాంతాల్లో వైరస్‌ నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి.

    మహారాష్ట్రలోని సతారా, లాతూర్‌, పర్బని, బీద్‌ జిల్లాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందాలు, వైరస్‌ బయటపడిన ప్రాంతాలను పరిశీలించి, సాంక్రమిక రోగ అధ్యయనాలు చేస్తున్నాయి. 

    "ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా-2021 సంసిద్ధత, నియంత్రణ కోసం కార్యాచరణ"కు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన నియంత్రణ చర్యల గురించి కేంద్ర పశుసంవర్దక విభాగానికి ప్రతిరోజూ నివేదికలు సమర్పిస్తున్నాయి.                                                         
    ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా, బర్డ్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర పశు సంవర్దక విభాగం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆ విభాగం సూచన మేరకు; అనుమానిత నమూనాలను పరీక్షల కోసం భోపాల్‌లోని నిషాద్‌కు తరలించేందుకు అంగీకరించేలా విమానయాన సంస్థలను ఆదేశించాలని, డీజీసీఏను పౌర విమానయాన శాఖ కోరింది. 

***



(Release ID: 1690604) Visitor Counter : 66