రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భౌగోళిక విపత్తుల నిర్వహణపై కలిసి పని చేయనున్న ఎంఒఆర్‌టిహెచ్, డిఆర్‌డిఒ
Posted On:
20 JAN 2021 2:10PM by PIB Hyderabad
భౌగోళిక విపత్తు నిర్వహణలో సాంకేతిక బదిలీ, సహకారం కోసం బుధవారం కొత్త ఢిల్లీలో రహదారులు, రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్), రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అవగాహన పత్ర చట్రంపై సంతకాలు చేశాయి. ఈ అవగాహనా పత్రంపై ఎంఒఆర్‌టిహెచ్ కార్యదర్శి గిరిధర్ ఆరామానే, డిఆర్‌డిఒ కార్యదర్శి డాక్టర్ సతీష్ రెడ్డి సంతకాలు చేశారు.
ఎంఒఆర్‌టిహెచ్, డిఆర్‌డిఒలు పరస్పరం లబ్ధిని చేకూర్చే రంగాలైన- మన దేశంలో మంచు కురిసే ప్రాంతాలలో అన్ని కాలాలలోనూ అనుసంధానతకు సమగ్ర హిమ ప్రవాహం/ కొండ చరియల సమగ్ర పరిరక్షణ పథకాలు, రూపకల్పన, ప్రణాళిక, సొరంగాల, వయాడక్ట్‌ల పూర్వ సాధ్యత, హిమప్రవాహాన్ని/ కఒండచరియలను నియంత్రించే కట్టడాలకు ప్రణాళిక, రూపకల్పన, ప్రతిపాదనల తయారీలో సహభాగస్వామ్యం/ భౌగోళిక/ జియో టెక్నికల్/ భూభాగ కల్పన, సొరంగాలకు సంబంధించిన ఇతర అంశాలు సహా పొరంగాల కోసం డిపిఆర్‌లలో ఇరు సంస్థలూ సహకారం ఇచ్చి పుచ్చుకుంటాయి. దేశంలో వివిధ అత్యాధునిక శాస్త్రసాంకేతిక అంశాలపై పని చేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్‌డిఒ. భూభాగం, హిమపాతాలపై దృష్టితో పోరాట ప్రభావాన్ని పెంచడానికి క్లిష్టమైన, కీలకమైన సాంకేతికతల అభివృద్ధిలో డిఆర్‌డిఒకు చెందిన అత్యున్నత ప్రయోగశాల అయిన డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్్స రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ముందుంది. హిమాలయ భూభాగంలో హిమ ప్రవాహాలను, కొండచరియలను తగ్గించి, నియంత్రించడం, పర్యవేక్షణ, మ్యాపింగ్, అంచనా వేయడం ఈ సంస్థ పాత్ర, లక్ష్యం. దేశవ్యాప్తంగా జాతీయ హైవేలను అభివృద్ధి చేసి, నిర్వహించే భాధ్యత కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖది. దేశంలోని వివిధ జాతీయ హైవేల పై కొండచరియల, హిమ ప్రవాహాలు, ఇతర ప్రకృతి ప్రకోపాల కారణంగా జరిగిన విధ్వంసాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే డిఆర్‌డిఒ అందించే నైపుణ్యాలను (డిజిఆర్ ఇ ద్వారా) ఉపయోగించుకోవడంపై ఇరు సంస్థలు అంగీకారానికి వచ్చాయి.
ఇరు సంస్థలు సహరించే అంశాలు దిగువన ఇవ్వడం జరిగింది.
* క్లిష్టమైన హిమ ప్రవాహాలు/ కొండచరియలు, ఏటవాలు ప్రాంతాల అస్థిరత, ముంపు సమస్యలు తదితరమైన భౌగోళిక విపత్తులపై సమగ్ర పరిశోధన.
* సొరంగాలు సహా నేషనల్ హైవేలకు ప్రకృతి విపత్తలను తగ్గించేందుకు నిరంతర చర్యల ప్రణాళిక, రూపకల్పన, నమూనాలను రూపొందించడం.
* ఉపశమన చర్యల అమలులో పర్యవేక్షణ.
* అవసరమైనప్పుడు ఇతర సేవలు.
*****
(Release ID: 1690381)
Visitor Counter : 232