మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

Posted On: 18 JAN 2021 6:51PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి,  కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌  శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో ఆన్‌లైన్‌ విధానంలో సంభాషించారు. న్యూఢిల్లీలోని కె.వి.ఆండ్రూస్‌గంజ్ నుంచి జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరై విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఇంటరాక్షన్ ప్రోగ్రాం సందర్భంగా విద్యార్థులు వివిధ రంగాలకు, సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. కోవిడ్ -19 కారణంగా ఈ సంవత్సరం పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించినందున, ఈ సంవత్సరం జెఇఇ మరియు నీట్ వంటి రాబోయే పోటీ పరీక్షలలో అభ్యర్థులకు మరిన్ని ఎంపికలు ఉంటాయని కెవి గురుగ్రామ్ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీ పోఖ్రియాల్ తెలియజేశారు.

వారణాసికి చెందిన ఒక విద్యార్థి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా పాఠశాల తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఆన్‌లైన్ విద్య సౌకర్యాలు కొనసాగుతాయని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. కొంతకాలం పాటు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కొత్త విద్యా విధానం- 2020 గురించి కేంద్రీయ విద్యాలయ ఆండ్రూస్గంజ్ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి, “భవిష్యత్ భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త విద్యా విధానం రూపొందించబడింది. కేవలం పుస్తకాలకు చెందిన జ్ఞానం కంటే ఆచరణాత్మక జ్ఞానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. 6 వ తరగతి నుండి విద్యార్థులకు వృత్తి శిక్షణా సౌకర్యం కల్పించబడుతుంది, ఇందులో ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది. కృత్రిమ మేధస్సు పాఠశాల స్థాయి నుండే నేర్పుతుంది. అదే సమయంలో, భారతీయ విలువలు మరియు సంస్కృతి కూడా ప్రోత్సహించబడతాయి. ఈ విధానం ఆత్మ నిర్భర్ భారత్ కలను సాకారం చేయగలదు ”. అని వివరించారు.

తన సాహిత్య నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నపై మంత్రి  తన అభిమాన కవితలను కూడా పఠించారు.

అంతకుముందు, శ్రీ పోఖ్రియాల్ కెవి ఆండ్రూస్గంజ్ ప్రాంగణంలో ఒక మొక్కను కూడా నాటారు. ఫిట్ ఇండియా ప్రచారానికి  సంబంధించిన మెమోంటోను అందుకున్న ఆయన కెవిలో ‘ఓపెన్ జిమ్’ కూడా ప్రారంభించారు. అవే కాకుండా పాఠశాల ప్రాంగణంలో ఒక మ్యూజికల్ గార్డెన్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్, కెవిఎస్ శ్రీమతి నిధి పాండే స్వాగత ప్రసంగం చేయగా, అదనపు కమిషనర్, కెవిఎస్ శ్రీమతి వి. విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

***


(Release ID: 1689794) Visitor Counter : 210