సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సీనియర్ సిటిజన్లకు వరం ' పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ' (పిపిఓ):డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
17 JAN 2021 5:16PM by PIB Hyderabad
ఇటీవల ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ' పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ' (పిపిఓ) విధానం వల్ల సీనియర్ సిటిజన్లకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు,అణుశక్తి, అంతరిక్ష వ్యవహారాలశాఖ ( స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఇటీవల ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణలను మంత్రి వివరించారు.సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పెన్షన్ల శాఖకు సీనియర్ సిటిజన్ల నుంచి పెన్షన్ ఆర్డర్లపై అనేక ఫిర్యాదులు అందేవని ఆయన చెప్పారు. తమ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు కనిపించడంలేదంటూ వారు శాఖకు ఫిర్యాదు చేసేవారని ఆయన అన్నారు. దీనివల్ల సీనియర్ సిటిజన్లు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేదని అన్నారు. తమ శాఖ ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ' పెన్షన్ చెల్లింపు ఆర్డర్ 'వల్ల ఈ సమస్యలు పరిష్కారం అయ్యాయని మంత్రి తెలిపారు. దీనివల్ల పదవీవిరమణ చేస్తున్న అధికారులు తమకు రావలసిన రావలసిన ప్రయోజనాలను పొందుతున్నారని అన్నారు.
డిజిటలైజేషన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యతను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. డిజిటలైజేషన్ కు గత ఆరు సంవత్సరాలుగా ప్రాధాన్యత పెరిగిందని, ప్రస్తుతం 80 శాతం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమ కార్యకలాపాలను ఈ - ఆఫీస్ ద్వారా నిర్వహిస్తున్నాయని అన్నారు. కోవిడ్ వల్ల ఎదురైన సమస్యలను అధిగమించి
ఎలక్ట్రానిక్ ' పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ' కు రూపకల్పన చేసిన పెన్షన్ల విభాగ సిబ్బందిని మంత్రి అభినందించారు. దీనివల్ల కోవిడ్ సమయంలో పదవీవిరమణ చేసిన అధికారులు ఇబ్బందులు లేకుండా పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను పొందారని మంత్రి అన్నారు. ఈ విధానం అమలులో లేకపోతే వారు స్వయంగా వెళ్లి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను తీసుకోవలసి వచ్చేది. కోవిడ్ వల్ల పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి గడువు కంటె ముందుగానే ఈ పద్దతిని ప్రవేశ పెట్టారని మంత్రి వివరించారు.
దీని ప్రకారం సిజిఎ (కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్) జారీ చేసే పిఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ను డిజి-లాకర్‌తో అనుసంధానం చేయాలని పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇది పింఛనుదారుడు డిజి-లాకర్ ఖాతా నుండి తన పిపిఓ యొక్క తాజా కాపీని తక్షణ ముద్రణ పొందటానికి అనుమతిస్తుంది.
పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పెరుగుతున్న పెన్షనర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచి సమస్యలను లేకుండా జీవించడానికి సంస్కరణలను తీసుకుని వస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా పదవీ విరమణ చేసిన తరువాత అర్ధవంతమైన జీవితాన్ని ఎలా గడపాలి, సీనియర్ సిటిజన్ల సేవలను అనుభవాలను సమాజ శ్రేయస్సు కోసం ఎలా వినియోగించుకోవాలి అన్న అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ కౌన్సెలింగ్ తరగతులను నిర్వహిస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
***
(Release ID: 1689578)
Visitor Counter : 160