జల శక్తి మంత్రిత్వ శాఖ

మంచినీటి సరఫరా మరియు పర్యవేక్షణా వ్యవస్థ రూపకల్పనకు పోటీ

Posted On: 13 JAN 2021 12:54PM by PIB Hyderabad

'మంచినీటి సరఫరా మరియు పర్యవేక్షణా వ్యవస్థ' రూపకల్పనకు చేయడానికి ​జాతీయ జల్ జీవన్ మిషన్నిర్వహించిన పోటీకి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అనూహ్య స్పందన లభించింది.పోటీలో పాల్గొడానికి ఆసక్తి చూపుతూ 218 ప్రతిపాదనలు అందాయి. జల వనరుల శాఖ,​ ​జాతీయ జల్ జీవన్ మిషన్, తాగునీరు పారిశుధ్య శాఖలు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పోటీని నిర్వహించాయి.'మంచినీటి సరఫరా మరియు పర్యవేక్షణా వ్యవస్థ' రూపకల్పనకు ఈ పోటీని నిర్వహించారు. 2020 సెప్టెంబర్  20వ తేదీన పోటీలో పాల్గొడానికి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది. పోటీ నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేసి దీనిని జల్ జీవన్ మిషన్ కోసం బెంగళూరుకు చెందిన సి-డాక్ వినియోగిస్తుంది. ఈ పోటీకి దేశం వివిధ ప్రాంతాలకు చెందిన 218 మంది తమ ప్రతిపాదనలను పంపారు. ఎల్ ఎల్ పి పరిశ్రమ​లు, భారతీయ సాంకేతిక అంకుర సంస్థలతో పాటూ వ్యక్తిగత ప్రతిపాదనలు కూడా అందాయి. విద్యావంతులు, పరిశ్రమలు, జల్ జీవన్ మిషన్, సి-డాక్, ఎస్ టిపిఐ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తదితర రంగాలకు చెందిన నిపుణులతో ఎంపిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఎంపిక కమిటి నవంబర్ 20వ తేదీన ఫలితాలను ప్రకటించింది. అందిన ప్రతిపాదనల నుంచి 10 ప్రతిపాదనలను ఎంపిక చేసి తదుపరి దశ (ప్రోటో టైప్)కు పంపారు. ఈ దశలో ఎంపిక అయిన ఒకో ప్రతిపాదనకు 7. 50 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం ప్రోటో టైప్ ల పరిశీలన జరుగుతోంది. 2020 జనవరి ఆఖరి వారంలో దీని ఫలితాలు తెలుస్తాయి. ఈ ప్రతిపాదనలు ఎంతవరకు ఆచరణసాధ్యమన్న అంశాన్ని పరీక్షించడానికి బెంగళూరులోని సి-డాక్ ఎలక్ట్రానిక్స్ సిటీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రోటో టైప్ దశలో సాంకేతికంగా ఆర్ధికంగా వెసలుబాటుగా వుండే నాలుగు ప్రతిపాదనలను గుర్తించి తుది దశకు ఎంపిక చేస్తారు. ప్రతిపాదనను వినియోగానికి అనువుగా తీర్చి దిద్దడానికి ఈ నాలుగు ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన వారికీ 25 లక్షల రూపాయలను చొప్పున అందిచడం జరుగుతుంది.

దీని తరువాత క్షేత్రస్థాయిలో వీటిని పరీక్షిస్తారు. దీనికోసం జల్ జీవన్ మిషన్ దేశం వివిధ ప్రాంతాలలో 25 కేంద్రాలను గుర్తించింది. దీనిలో ప్రధమ స్థానంలో నిలిచే దానికి 50 లక్షల రూపాయలను, ద్వితీయ స్థానంలో నిలిచే ఇద్దరికీ 25 లక్షల రూపాయల చొప్పున అందించి తుది పోటీకి ఎంపిక చేయడం జరుగుతుంది. జాతీయ జల్ జీవన్ మిషన్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఈ నిధులను అందిస్తున్నాయి.

​2024 నాటికి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ కల్పించాలంటూ ప్రధానమంత్రి 2019 ఆగస్టు 15వ తేదీన ప్రకటించిన పథకాన్ని జల్ జీవన్ మిషన్ అమలు చేస్తున్నది. ఇంతవరకు గ్రామీణ ప్రాంతాలలో 3. 13 లక్షల గృహాలకు కొళాయి కనెక్షన్లను కల్పించడం జరిగింది.

చిత్రం 1: మొదటి 10 స్థానాలు

చిత్రం 2: బెంగళూరులోని సి-డాక్ ఎలక్ట్రానిక్స్ సిటీలోఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం

వీడియో లింక్ :

https://drive.google.com/file/d/1IQH34SD77MbPvbZAl4VAJcp3HnTLBKge/view?usp=sharing

https://drive.google.com/file/d/1NVBwTdVpS5wGJCR_OTf8A0wNG0_iL7Jn/view?usp=sharing

 

***

 

 



(Release ID: 1688320) Visitor Counter : 146