ప్రధాన మంత్రి కార్యాలయం
రాజకీయాలలో స్వార్ధ రహితంగాను, నిర్మాణాత్మకంగాను తోడ్పడండంటూ యువత కు ఉద్భోదించిన ప్రధాన మంత్రి
సామాజిక అవినీతి కి వంశవాద రాజకీయాలు ప్రధాన కారణం : ప్రధాన మంత్రి
Posted On:
12 JAN 2021 3:13PM by PIB Hyderabad
రాజకీయాల లో స్వార్ధానికి తావు ఇవ్వకుండాను, నిర్మాణాత్మకంగాను కృషి చేయవలసింది గా దేశంలోని యువతీయువకుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ తాలూకు ముగింపు కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, అర్థవంతమైన మార్పు ను తీసుకురావడం లో రాజకీయాలు ఒక పెద్ద సాధనం గా ఉన్నాయన్నారు. మరే ఇతర క్షేత్రం లో మాదిరిగానే, రాజకీయాల లో కూడా యువత ఉనికి కీలకం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం నిజాయితీపరులైన వారు సేవ చేసే అవకాశాన్ని దక్కించుకొంటున్నారని, నీతినియమాలు లేని కార్యకలాపాల రంగస్థలమే రాజకీయాలు అనే ఒక పాత భావాన్ని వారు మారుస్తున్నారని ఆయన యువత కు హామీ ని ఇచ్చారు. ఇవాళ నిజాయితీ, పనితీరు తక్షణావసరంగా మారాయన్నారు.
ఈ సందర్భం లో, వంశవాద రాజకీయాల ను గురించి ప్రధాన మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. అవినీతి అనేది ఎవరి వారసత్వం అయితే ఉందో, వారికి అది ( అవినీతి) భారం గా తయారయింది అని ఆయన అన్నారు. కుటుంబ సంబంధాల కంటే నిజాయితీ వైపు దేశం మొగ్గు చూపుతోందని, అభ్యర్ధులు సైతం మంచి పని అనేది ఒక్కటే నిలబడుతుందని గ్రహిస్తున్నారని ఆయన చెప్పారు.
వంశవాద వ్యవస్థ ను పెకలించి వేయాలని యువత కు ఆయన పిలుపునిచ్చారు. వంశవాద రాజకీయాలు చేతకాని తనానికి, నియంతృత్వానికి చోటు ఇస్తాయి. ఎందుకంటే, వంశవాదులు వారి కుటుంబం తాలూకు రాజకీయాల ను కాపాడుకొనేందుకు, రాజకీయాల లో కుటుంబాన్ని కాపాడుకొనేందుకు పని చేస్తారు అని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం ఒక ఇంటి పేరు ను ఊత కర్ర గా తీసుకొని ఎన్నికల లో గెలిచే రోజులు పోయాయి. అయినప్పటికీ, ఈ వంశవాద రాజకీయాల అనారోగ్యం ఇంకా పూర్తి గా సమసిపోనేలేదు.. రాజకీయ వంశవాదం దేశానికి పెద్ద పీట వేయడానికి బదులుగా స్వీయ అస్తిత్వాన్ని, కుటుంబాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది భారతదేశం లో సామాజిక అవినీతి కి ఒక పెద్ద కారణం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
రాజకీయాల లోకి రావాలంటూ యువత కు ప్రధాన మంత్రి ఉద్భోదించారు. వారు రాజకీయాల లోకి రావడం వంశవాద రాజకీయాలకు భరతవాక్యం పలుకుతుంది అని ఆయన అన్నారు. ‘‘మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే మీరు రాజకీయాల లో చేరడం అత్యవసరం. స్వామి వివేకానంద లో మీరు ఒక గొప్ప మార్గదర్శి ని చూసుకోవచ్చు. మరి ఆయన ప్రేరణ తో, మన యువత రాజకీయాల లోకి వచ్చిందంటే గనక, దేశం పటిష్టం అవుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
***
(Release ID: 1687950)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam