ఆర్థిక మంత్రిత్వ శాఖ

జీఎస్టీ పరిహార లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలకు 11 వ విడత 6,000 కోట్ల రూపాయల బ్యాక్ టు బ్యాక్ లోన్

ఇంతవరకు అన్ని రాష్ట్రాలు మరియు యుటిలకు చట్ట ప్రకారం మొత్తం 66,000 కోట్ల రూపాయల విడుదల

ఇది రాష్ట్రాలకు మంజూరు చేసిన 1,06,830 కోట్ల రూపాయల అదనపు రుణ అనుమతికి అదనం

Posted On: 11 JAN 2021 5:04PM by PIB Hyderabad

జీఎస్టీ పరిహార లోటును భర్తీ చేయడానికి 11 వ వారపు విడతగా 6,000 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ మొత్తంలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న 23 రాష్ట్రాలకు 5,516.60 కోట్ల రూపాయలను, శాసనసభలు కలిగిన మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు ( ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, పుదుచ్చేరి) 483.40 కోట్ల రూపాయలను కేటాయించారు. జీఎస్టీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న మిగిలిన 5 రాష్ట్రాలు,అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ మరియు సిక్కింలకు జీఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో లోటు ఏర్పడలేదు. ఇప్పుడు అంచనా వేసిన జీఎస్టీ పరిహారలోటులో 60 శాతం నిధులను రాష్ట్రాలు, శాసనసభలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది. ఇందులో రాష్ట్రాలకు 60,066.36 కోట్ల రూపాయలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు 5,933.64 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి.

 

జీఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో ఏర్పడే లోటును భర్తీ చేయడానికి 2020 అక్టోబర్ లో 1.10 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రత్యేక రుణాలు తీసుకునే విండోను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల తరపున భారత ప్రభుత్వం ఈ విండో ద్వారా రుణాలు తీసుకుంటోంది. ఈ రుణాలను 11 దఫాలుగా తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు తీసుకున్న మొత్తాన్ని 2020 అక్టోబర్ 23, 2020, నవంబర్ 2 , 2020 నవంబర్ 9 , 2020 నవంబర్ 23 , 2020 డిసెంబర్ 1 , 2020  డిసెంబర్ 7, 2020 డిసెంబర్ 14 , 2020 డిసెంబర్ 21 , 2020 డిసెంబర్ 28 , 2020 జనవరి 04 , 2021 జనవరి 11 తేదీలలో రాష్ట్రాలకు విడుదల చేయడం జరిగింది.

 

ఈ వారంలో విడుదల చేసిన మొత్తం రాష్ట్రాలకు అందించిన అటువంటి నిధుల 11 వ విడత. ఈ మొత్తాన్ని ఈ వారం 5.1057% వడ్డీ రేటుతో రుణంగా తీసుకున్నారు. ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా సగటున 4.7271% వడ్డీ రేటుతో 66,000 కోట్ల రూపాయలను రుణంగా తీసుకుంది.

 

జీఎస్టీ అమలు కారణంగా ఆదాయ కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా నిధులను అందించడంతో పాటు మొదటి ఆప్షన్ కు ఆమోదం తెలిపిన రాష్ట్రాలకు వాటి స్థూల రాష్ట్రాల దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 0.50% కు సమానమైన అదనపు రుణాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.అన్ని రాష్ట్రాలు మొదటి ఆప్షన్ కు ఆమోదం తెలిపాయి. దీనితో అదనపు ఆర్థిక వనరులను సమీకరించుకుని జీఎస్టీ పరిహార లోటును భర్తీ చేసుకోవడానికి 28 రాష్ట్రాలకు మొత్తం 1,06,830 కోట్ల రూపాయల (జిఎస్‌డిపిలో 0.50%) రుణం తీసుకోవడానికి అనుమతి ఇవ్వబడింది.

 

అదనపు రుణాలు తీసుకోడానికి 28 రాష్ట్రాలకు ఇచ్చిన అనుమతులు,ప్రత్యేక విండో ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సేకరించిన నిధుల మొత్తం కింది అనుబంధంలో జతచేయబడింది.

 

2021 జనవరి 11వ తీదీనాటికి జిఎస్‌డిపిలో 0.50 శాతం అదనపు రుణాలు తీసుకోవడం మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధులు

 

(కోట్ల రూపాయల్లో)

 

S. No.

Name of State / UT

Additional borrowing of 0.50 percent allowed to States

Amount of fund raised through special window passed on to the States/ UTs

1

Andhra Pradesh

5051

1559.07

2

Arunachal Pradesh*

143

0.00

3

Assam

1869

670.84

4

Bihar

3231

2634.14

5

Chhattisgarh

1792

1015.56

6

Goa

446

566.58

7

Gujarat 

8704

6221.22

8

Haryana

4293

2935.98

9

Himachal Pradesh 

877

1158.35

10

Jharkhand

1765

551.70

11

Karnataka

9018

8370.15

12

Kerala

4,522

2211.72

13

Madhya Pradesh

4746

3064.19

14

Maharashtra

15394

8080.35

15

Manipur*

151

0.00

16

Meghalaya

194

75.49

17

Mizoram*

132

0.00

18

Nagaland*

157

0.00

19

Odisha

2858

2578.45

20

Punjab

3033

3206.28

21

Rajasthan

5462

2411.02

22

Sikkim*

156

0.00

23

Tamil Nadu

9627

4210.58

24

Telangana

5017

1077.30

25

Tripura

297

152.70

26

Uttar Pradesh

9703

4052.45

27

Uttarakhand

1405

1562.64

28

West Bengal

6787

1699.60

 

Total (A):

106830

60066.36

1

Delhi

Not applicable

3956.63

2

Jammu & Kashmir

Not applicable

1532.67

3

Puducherry

Not applicable

444.34

 

Total (B):

Not applicable

5933.64

 

Grand Total (A+B)

106830

66000.00

* These States have ‘NIL’ GST compensation gap

 

****

 



(Release ID: 1687760) Visitor Counter : 156