ప్రధాన మంత్రి కార్యాలయం

ఫ్రెంచ్ అధ్యక్షుని దౌత్య సలహాదారుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ బోన్నే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు

Posted On: 08 JAN 2021 6:55PM by PIB Hyderabad

ఫ్రెంచ్ అధ్యక్షుడు గౌరవనీయులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు దౌత్య సలహాదారుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ బోన్నే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఉగ్రవాద నిరోధకత, సైబర్ భద్రత, రక్షణ, వ్యూహాత్మక సహకారం మొదలైన కీలక రంగాలలో, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరు దేశాలు సాధించిన పురోగతిపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

సముద్ర రంగం మరియు బహుపాక్షిక సహకారంతో సహా వివిధ ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై భారత-ఫ్రాన్స్ సహకారం గురించి శ్రీ బోన్, భారత ప్రధానమంత్రికి వివరించారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఇటీవల జరిగిన సంభాషణలను, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  కోవిడ్ షరతులు అనుమతించిన వెంటనే భారతదేశాన్ని సందర్శించాలని, అధ్యక్షుడు మాక్రాన్‌కు చేసిన ఆహ్వానాన్ని, నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.

2021 జనవరి, 7వ తేదీన జరిగిన ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక చర్చల సందర్భంగా,  శ్రీ ఇమ్మాన్యుయేల్ బోన్న, భారత పర్యటనలో ఉన్నారు.

 

*****



(Release ID: 1687235) Visitor Counter : 137