ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్థానిక భారతీయ భాషలలో ఉచిత డొమైన్ ను ఇచ్చేందుకు ఎన్ ఐఎక్్స ఐ ఆఫర్
Posted On:
08 JAN 2021 2:03PM by PIB Hyderabad
ఐఎన్ (IN) డొమైన్‌ను బుక్ చేసుకున్న నమోదుదారులు అందరికీ వారికి నచ్చిన 22 భారతీయ అధికారిక భాషలలో దేనితోనైనా ఉచితంగా ఐడిఎన్ (ఇంటర్నలైజ్డ్ డొమైన నేమ్)ను ఇస్తామని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ ఐఎక్స్ ఐ) ప్రకటించింది. దరఖాస్తుదారు స్థానిక భాషలో ఉచిత ఇమెయిల్ పొందుతారు. స్థానిక భాషలో విషయాంశాలు, భారత్ (ఐడిఎన్) డొమైన్ పేర్లను పెట్టుకునేందుకు ప్రేరణను ఇచ్చేందుకు ఈ ఆఫర్‌ను సృష్టించారు.
ఈ ఆఫర్ 31 జనవరి 2021 వరకు నమోదు చేసుకున్న నూతన డాట్ ఇన్ (.in) దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. కాగా, తమ డొమైన్‌ను జనవరి 2021వరకు రిన్యూ చేసుకోనున్న ఉనికిలో ఉన్న ఇన్ యూజర్లకు కూడా వర్తింపచేస్తున్నారు.
ఎన్ ఐఎక్్సఐ గురించి
భారత పౌరులలో ఇంటర్నెట్ సాంకేతికతను వ్యాపింప చేసేందుకు 2003 నుంచి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ ఐఎక్్సై). అది దిగువన పేర్కొన్న కార్యకలాపాలను నిర్వహిస్తుందిః-
1) ఐఎస్‌పిల మధ్య, ఐఎస్‌పిలు, సిడిఎన్‌ల మధ్య ఇంటర్నెట్ డాటాను ఇంటర్నెట్ ఎక్స్‌చేంజీల ద్వారా ఇచ్చిపుచ్చుకుంటారు.
2) ఐఎన్ రిజిస్ట్రీ, ఐఎన్ కంట్రీ కోడ్ డొమైన్, భారత్ ఐడిఎన్ డొమైన్ నిర్వహణ, కార్యకలాపాలు.
3) ఐఆర్ ఐఎన్ ఎన్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IPv4/IPv6) కార్యకలాపాలు, నిర్వహణ.
***
(Release ID: 1687121)
Visitor Counter : 248