సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను న్యూఢిల్లీలో కలిసి మెమొరాండం సమర్పించిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థుల కార్యాచరణ కమిటీ
ఏడు దశాబ్దాల సుదీర్ఘకాల నిరీక్షణ అనంతరం తమకు పౌరసత్వ హక్కులను ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపిన కమిటీ
Posted On:
07 JAN 2021 5:47PM by PIB Hyderabad
ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తమకు పౌరసత్వ హక్కులను ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు గురువారం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ 70 ఏళ్ళ కాలంలో, మమ్మల్ని విదేశీయులుగా పరిగణిస్తూ మాకు జాతీయత, కులం, తదితర సర్టిఫికెట్లను ఇవ్వడానికి నాటి జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో తమ తరం అంతరించిపోయిందని పశ్చిమ పాకిస్తాన్ శరణార్థుల కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు లబ్భా రామ్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ఇఆర్) కేంద్ర సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంథనం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కు సమర్పించిన మొమొరాండంలో పేర్కొన్నారు. ఈ పత్రాలు లేని ఫలితంగా తమకు పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, వృత్తిపరమైన కళాశాలల్లోనే తమకు అడ్మిషన్లు దక్కలేదని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమకు ఓటు వేసే హక్కు లేకుండా పోయిందని వివరించారు. మా ప్రతినిధులు నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పర్యాయాలు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ, తమ బాధలను ఎవరూ పట్టించుకోలేదన్నారు.
ఆర్టికల్ 370ను, 35-ఎను రద్దు చేసి, జమ్ము కాశ్మీర్‌ను రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో నిస్సహాయంగా ఉన్న పశ్చిమ పాకిస్తానీ శరణార్ధులకు అన్ని హక్కులు యాంత్రికంగా సంక్రమించాయన్నారు. ఈ కీర్తి కేంద్రంలో మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
అరగంట సేపు వారితో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఈ శరణార్థుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే కాక, మానవ హక్కులను కూడా ఉల్లంగించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వీరు జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో స్థిరపడేందుకు నిర్ణయించుకున్నందునే 70 ఏళ్ళ పాటు వారికి పౌరసత్వాన్ని నిరాకరించారని, కాగా, భారత్‌లో ఇతర ప్రాంతాలలో స్థిరపడేందుకు నిశ్చయించుకున్న ఇతర శరణార్థులు దేశ ప్రధాన మంత్రులు అయ్యారని - ఇందర్ కుమార్ గుజరాల్, డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించారు. ప్రధాన మంత్రి మోడీ సాహసోపేతమైన నిర్ణయానంతరం వారికి కూడా భారతదేశంలో ఇతర పౌరులకు ఉండే హక్కులన్నీ ఉంటాయని, వారి పిల్లలకు ఉద్యోగాలలో, మోడీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన నూతన ఉపాధులలో సమానావకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.
బార్డర్ సంఘర్ష్ సమితి ఆర్నియా తరఫున పంచాయత్ హల్కా త్రెవా సర్పంచ్ బల్వీర్ కౌర్, కౌన్సిలర్ అర్నియా సమర్పించిన మరొక మెమొరాండంలో, అంతర్జాతీయ సరిహద్దులలో నివసిస్తున్న ప్రజలకు నియంత్రణ రేఖ సమీపంలో నివసిస్తున్న ప్రజలకు కల్పించినట్టే రిజర్వేన్లను కల్పించినందుకు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు ప్రత్యేకంగా ప్రశంసించారు. అదనంగా, అంతర్జాతీయ సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న ప్రజలకు మరిన్ని సహాయక చర్యలను అందించేందుకు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దులలో నివసించే ప్రజలు ఎదుర్కొనే ఆటంకాలు, సమస్యలను పరిగణలోకి తీసుకుని, ఆ ప్రాంతంలో డిగ్రీ కాలేజీని, మరికొన్ని సౌకర్యాలను కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
<><><><><>
(Release ID: 1687017)
Visitor Counter : 156