జల శక్తి మంత్రిత్వ శాఖ
2023-24 నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని రాష్ట్రం సాధనకు సాంకేతిక తోడ్పాటును అందించేందుకు పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న జాతీయ జల జీవన్ మిషన్ బృందం
Posted On:
07 JAN 2021 2:47PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన జల జీవన మిషన్ కింద హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రానికి సాంకేతిక సాయాన్ని అందించేందుకు జాతీయ జల జీవన్ మిషన్ (ఎన్‌జెజెఎం)కు చెందిన 8మంది సభ్యులతో కూడిన బృందం5 నుంచి 8వ జనవరి , 2021న నాలుగు రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న వారికి ఎదురయ్యే సవాళ్ళను, సమస్యలను గుర్తించి, మంచి పద్ధతులు ఏమైనా కనుగొంటే వాటిని నమోదు చేయాలన్నది ఈ పర్యటన మరొక లక్ష్యం.
ఈ నాలుగు రోజులలో రాష్ట్రంలోని పశ్చిమ బర్ధమాన్, బంకురా, బర్దమాన్, బీర్భం, ముర్షిదాబాద్, నాదియా, పశ్చిమ మేద్నీపూర్, పూర్బ మేద్నీపూర్ జిల్లాలలో ఈ బృందం పర్యటించనుంది. ఎన్‌జెజెఎం సభ్యులు నీటి సరఫరా పథకాలతో సంబంధం ఉన్న క్షేత్ర స్థాయి అధికారులు, గ్రామ ప్రధాన్‌లు, గ్రామ పంచాయతీల సభ్యులు, గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీలు/ పానీ సమితితో పాటుగా లబ్ధిదారులతో కూడా సంభాషిస్తున్నారు. దీనితో పాటుగా జిల్లా నీటి&పారిశుద్ధ్య మిషన్ చైర్‌పర్సన్/ జిల్లా కలెక్టర్ తో సమావేశాలు నిర్వహిస్తూ వారి ప్రాంతంలో పని పురోగతి ఏమేరకు వచ్చిందో సమాచారమిచ్చి, ఈ కార్యక్రమాని్న వేగవంతంగా అమలు చేసేందుకు వారి జోక్యాన్ని కోరుతున్నారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామీణ ఆవాసానికీ నల్లా నీటి కనెక్షన్ ఇవ్వాలనే భారీ లక్ష్యాన్ని 2024వ సంవత్సరానికల్లా 100% కవరేజీతో పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రణాళికలు రూపొందిస్తోంది. జెజెఎం కింద కాలపరిమితి పెట్టుకున్న ఈ లక్ష్యాన్నిసాధించేందుకు భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తోడ్పాటునందించి, రాష్ట్ర ప్రభుత్వంతో సమిష్టిగా పని చేసేందుకు కటు్టబడి ఉంది. గత నెలలో నలుగురు సభ్యులతో కూడిన బృందం సాంకేతిక సాయాన్ని అందించడం ద్వారా రాష్ట్రంలో కార్యక్రమ అమలును వేగవంతం చేసేందుకు పర్యటించింది.
మొత్తం 1.63 కోట్ల గ్రామీణ ఆవాసాలలో, ఇప్పటివరకూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 7.61 లక్షల కుటుంబాలకు కనెక్షన్‌ను ఇచ్చింది. 2023-24 సంవత్సరానికి అన్ని కుటుంబాలకూ నల్లా కనెక్షన్లను కల్పించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉంది. జెజెఎం కింద పని రాష్ట్రంలో పనులు జోరుగా సాగుతున్నాయి, ఎన్‌జెజెఎం బృందం పర్యటన రాష్ట్రంలో కార్యక్రమ అమలుకు ప్రేరణను ఇవ్వనుంది. కాగా, 2020-21లో కేంద్ర నిధుల వాటాగా ఓపెనింగ్ బాలెన్సు రూ. 1,146.58 కోట్లతో సహా రూ. 2,760.76 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. దీనితో జెజెఎం కింద ప్రతి కుటుంబానికీ నల్లా కనెక్షన్లు అందుబాటులోకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్‌కు మొత్తం రూ. 5,770 కోట్లు అందుబాటులో ఉన్నాయి. జెజెఎం కింద పనితీరు ప్రోత్సాహకం రూపంలో కార్యక్రమ అమలు పురోగతిని బట్టి రాష్ట్రానికి అదనపు నిధులను కూడా అందించవచ్చు.
పశ్చిమ బెంగాల్‌లోని పంచాయతీ రాజ్ వ్యవస్థలకు గ్రాంట్ల రూపంలో 15వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రూ.4,412 కోట్లు ఉన్నాయి ఇందులో తప్పనిసరిగా 50% నిధులను నీరు, పారిశుద్ధ్యంపై ఖర్చు చేయవలసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంజిఎన్ ఆర్ ఇజిఎస్, జెజెఎం, ఎస్‌బిఎం(జి), 15వ ఫైనాన్స్ కమిషన్ పంచాయితీ రాజ్ వ్యవస్థలకు ఇచ్చిన నిధులు, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, సిఎఎంపిఎ, సిఎస్ ఆర్ నిధి, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి, తదితరాలన్నింటినీ కేంద్రీకరించేందుకు ప్రణాళికను రూపొందించాలి. గ్రామ స్థాయిలో ప్రతి గ్రామానికీ 5 ఏళ్ళకు గ్రామీణ కార్యాచరణ ప్రణాళిక (విఎపి)ను 15వ ఫైనాన్స్ కమిషన్‌తో కలిసి రూపొందించి, అటువంటి నిధులన్నింటినీ ఏకం చేసి సురక్షిత మంచి నీటిని కల్పించే నీటి మూలాలను బలోపేతం చేసేందుకు నీటి సంరక్షణ కార్యకలాపాలను నిర్వహించేందుకు వినియోగించాలి.
జీవనాన్ని పరివర్తన చేసే జల జీవన్ మిషన్ కింద దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ తగినంత పరిణామంలో మంచినీటిని సరఫరా చేసేందుకు, దీర్ఘకాలికంగా, నిత్యం సూచించిన నాణ్యతతో అందించేందుకు క్రియాశీల కుటుంబ నల్లా కనెక్షన్లను అందించనున్నారు. సహకార సమాఖ్యవాద వాస్తవ స్ఫూర్తిని అనుసరిస్తూ, గ్రామీణ ప్రజల జీవన సౌలభ్యతకు, మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లలపై భారాన్ని తగ్గించేందుకు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. జీవితాన్ని పరివర్తనకు లోను చేసే ఈ మిషన్, సమానత, కలుపుకుపోవడం అన్న కీలక సూత్రాలపై దృష్టి పెడుతుంది. ఇంతకు ముందు కార్యక్రమాలకు భిన్నంగా, ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాల సృష్టికన్నా, సేవలను అందించడాన్ని నొక్కి చెప్తుంది.
****
(Release ID: 1686843)
Visitor Counter : 146